For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jabardasth లోకి హైపర్ ఆది రిటర్న్.. మరో బేరంతో సరికొత్తగా రీ ఎంట్రీ..

  |

  తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యదిక స్థాయిలో క్రేజ్ అందుకున్న బెస్ట్ కామెడీ షోలతో ఒకటైన జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్ళు గడిచినా కూడా ఇంకా ఆ షో హవా అస్సలు తగ్గడం లేదు. ఈ స్టేజ్ నుంచి ఎంతోమంది కొత్త తరహా కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నారు. ఇక రీసెంట్ గా మాత్రం కొందరు నిర్వాహకులతో వచ్చిన విబేధాలతో షో నుంచి బయటకు వెళ్లినట్లు టాక్ అయితే వచ్చింది. ఇక అదే తరహాలో ఆది కూడా వెళ్లిపోయినట్లు ఒక టాక్ వచ్చింది. ఇక రీసెంట్ గా హైపర్ ఆది మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది. కొత్త బేరంతోనే యూ టర్న్ తీసుకున్నట్లు టాక్ పూర్తి వివరాల్లోకి వెళితే..

  మధ్యలో అలాంటి టాక్

  మధ్యలో అలాంటి టాక్


  2013 నుంచి కొనసాగుతున్న జబర్దస్త్ షో మధ్యలో ఎప్పుడు కూడా బ్రేక్ ఇవ్వకుండా ఎన్నేళ్లపాటు విజయవంతంగా కొనసాగుతూ వస్తోంది. అయితే మధ్యలో ఈ షో రేటింగ్స్ పడిపోయినట్లు కూడా కొందరు కామెంట్ చేశారు. అంతేకాకుండా షోలు మధ్యలో ఆపేసే అవకాశం ఉన్నట్లు కూడా మరికొన్ని రూమర్లు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని మరికొందరు వివరణ ఇచ్చారు.

  జబర్దస్త్ తో కమెడియన్స్ కు అవకాశాలు

  జబర్దస్త్ తో కమెడియన్స్ కు అవకాశాలు

  నిజానికి జబర్దస్త్ షో నుంచి చాలామంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా వేణు నటరాజ్ షకలక శంకర్ గెటప్ శ్రీను అలాగే మరికొంతమంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అవకాశాలు అందుకుని ఇప్పుడు చాలా బిజీగా మారిపోతున్నారు. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా వారికి ఆదాయం కూడా గట్టిగానే వచ్చింది. దాని వల్లే కమెడియన్స్ సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నారు.

  హైపర్ ఆధితో భారీ క్రేజ్

  హైపర్ ఆధితో భారీ క్రేజ్

  ఇక అందరికంటే ఎక్కువ స్థాయిలో పారితోషికం అందుకుంటూ వచ్చిన టాప్ కమెడియన్స్ లలో హైపర్ ఆది ఒకరు. ఎక్స్ ట్రా జబర్దస్త్ మొదలైన అతను ఒక్కసారిగా రేటింగ్ పెంచేశాడు. మిగతా కమెడియన్స్ ఎంతమంది ఉన్నా కూడా ప్రత్యేకంగా ఆది స్కిట్ ల కోసం ఎదురుచూసే అభిమానుల సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది.

  అందుకే మధ్యలో బ్రేక్

  అందుకే మధ్యలో బ్రేక్

  హైపర్ ఆది మధ్యలో సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో వెళ్లిపోవాలని అనుకున్నప్పటికీ కూడా యాజమాన్యం మాత్రం అతన్ని బయటకు వెళ్ళనివ్వలేదు. అనుకున్న దాని కంటే ఎక్కువ పారితోషికం ఇచ్చి జబర్దస్త్ లో కొనసాగించింది. అయితే మధ్యలో అతను విభేదాల కారణంగా వెనక్కి వచ్చినట్లు టాక్ వచ్చింది. కానీ అందులో కూడా నిజం లేదు అని హైపర్ ఆది ఇంటర్వ్యూలలో తెలియజేశాడు. సినిమాలతో బిజీగా ఉండడం వల్లనే షోలోకి రాలేదు అని ఉండడం.

  సడన్ గా రీ ఎంట్రీ

  సడన్ గా రీ ఎంట్రీ

  ఇక రీసెంట్గా మళ్లీ అతను జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. వచ్చి రాగానే స్టేజ్ షో పైన జడ్జిలపై ప్రత్యేకంగా ఇంద్రజ, యాంకర్ రష్మీపై పంచ్ లతోనే మెప్పించాడు. వచ్చే వారం హైపర్ ఆది స్కిట్ తో మళ్ళీ తన టాలెంట్ చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. ఏదేమైనా కూడా హైపర్ ఆది రీ ఎంట్రీ ఇవ్వడం బాగానే ఉంది కాని ఇంత సడన్ గా రావడానికి కారణం అతనికి మునుపటి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు అనిపిస్తుంది.

   మళ్ళీ కంటిన్యూ అవుతాడా?

  మళ్ళీ కంటిన్యూ అవుతాడా?

  హైపర్ ఆది ఒక్క ఎపిసోడ్ కు లక్షకు పైగా తీసుకుంటూ వచ్చాడు. ఒక్కరోజు అతను మూడు లేదా రెండు ఎపిసోడ్స్ కు సంబంధించిన స్కిట్స్ చేశాడు. అయితే అతను హఠాత్తుగా వెళ్లిపోవడం జబర్దస్త్ కు పెద్ద డ్యామేజ్ అయ్యింది. రేటింగ్స్ తగ్గడం వలన మళ్ళీ అతనికి మునుపటి ఎక్కువ ఇచ్చి వెనక్కి రప్పించినట్లు టాక్. అయితే ఆది కేవలం ఈ వారం కోసమే వచ్చాడా లేదా యధావిధిగా కంటిన్యూ అవుతాడా అనేది చూడాలి.

  English summary
  Hyper aadi reentry in jabardasth after long time
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X