Jabardasth షోతో భారీగా ఆదాయం అందుకుంటున్న హైపర్ ఆది.. ఈసారి మరింత ఎక్కువగా?

టెలివిజన్ రంగంలో ప్రస్తుతం మంచి క్రేజ్ అందుకుంటే ఆదాయం కూడా సినిమా మార్కెట్ కు ఏమాత్రం తగ్గకుండా వస్తోంది. చాలావరకు కొంతమంది నటీనటులు సినిమా ప్రపంచంలో కంటే టెలివిజన్ రంగం లోనే చాలా ఎక్కువగా సంపాదిస్తుంటారు. ఇక గత కొన్నేళ్లుగా టాప్ కామెడీ షోగా కొనసాగుతూ వస్తున్న జబర్దస్త్ షో ద్వారా కూడా చాలామంది కమెడియన్స్ మంచి పారితోషికాలను అందుకుంటున్నారు. అయితే ఇటీవల హైపర్ ఆది తన పారితోషికాన్ని మరింత పెంచుకుని టెలివిజన్ రంగం లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఒకడిగా నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంచి జాబ్ వదిలేసి..

మంచి జాబ్ వదిలేసి..


చిన్నతనం నుంచి సినిమాల్లోకి రావాలని ఆకాంక్షతో హైపర్ ఆది షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించాడు. కాలేజి దశలో సొంతగా స్క్రిప్టు రాసుకునే స్టేజ్ షోలు కూడా ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన హైపర్ ఆది మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దాన్ని వదిలేసి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టాడు. అయితే మొదట అతనికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

హైపర్ ఆది స్కిట్స్.. పర్ఫెక్ట్!

హైపర్ ఆది స్కిట్స్.. పర్ఫెక్ట్!

అన్నింటినీ దాటుకుంటూ జబర్దస్త్ షోలో మొదట అదిరే అభి గ్రూప్ లో చేరి ఆ తర్వాత టీమ్ లీడర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఎక్కువగా సక్సెస్ అవుతున్నవి మాత్రం హైపర్ ఆది స్కిట్స్ అనే చెప్పాలి. అతను ప్రతి ఎపిసోడ్ తో కూడా అందరికంటే ఎక్కువగా నవ్విస్తూ మంచి మార్కులు కొట్టేస్తాడు.

 జబర్దస్త్ అగ్రిమెంట్

జబర్దస్త్ అగ్రిమెంట్

కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే సినిమాలతో కూడా హైపర్ ఆది నిత్యం బిజీగానే కనిపిస్తున్నాడు. అదేవిధంగా హైపర్ ఆది మిగతా కంటెస్టెంట్స్ స్కీట్స్ కు సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా అందిస్తూ వాటి ద్వారా కూడా మంచి ఆదాయాన్ని ఎందుకుంటున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ లో మరో నాలుగేళ్ళ వరకు కోమసాగే విధంగా అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు సమాచారం. ఆ అగ్రిమెంట్ తో కూడా 10 లక్షలకు పైగా ఆదాయం అందుతుంది.

భారీగా డిమాండ్

భారీగా డిమాండ్

అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న జబర్దస్త్ కమెడియన్స్ లలో హైపర్ ఆది రేంజ్ ఒక్కసారిగా పెరిగినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది వరకు హైపర్ ఆది ప్రతి ఎపిసోడ్ కు రెండు లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరొక లక్ష పెరగడంతో అతను జబర్దస్త్ కు వారం ఒక వారానికి మూడు లక్షల వరకు ఆదాయం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

టాప్ లిస్టులో హైపర్ ఆది

టాప్ లిస్టులో హైపర్ ఆది

ఇక సినిమాలతో పాటు ఇతర రియాలిటీ షోలలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్న హైపర్ ఆది అదే తరహాలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక చిన్న సినిమాల్లో మాత్రం మంచి కంటెంట్ ఉన్న పాత్రలు వస్తే పారితోషికం కూడా తగ్గించుకుంటునట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని చిన్న సినిమాలకు స్క్రిప్ట్ అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఏదేమైనా ప్రస్తుతం జబర్దస్త్ నుంచి అత్యధిక స్థాయిలో ఆదాయం అందుకుంటున్న కమెడియన్స్ లో హైపర్ ఆది టాప్ లిస్టు లో ఉన్నాడు అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X