twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బతుకుమ్మ వివాదం: ఎట్టకేలకు స్పందించిన హైపర్ ఆది.. నేనా మాట అనలేదు.. అయినా సరే!

    |

    తెలంగాణ వ్యాప్తంగా హైపర్ ఆది వివాదం రేపుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ గా అతి స్వల్ప కాలంలోనే హైపర్ ఆది విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.. అయితే ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంతే విధంగా వివాదాల్లో సైతం చిక్కుకుంటున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక షో కోసం ఆయన బతుకమ్మను, గౌరమ్మను కించపరుస్తూ మాట్లాడారంటూ పెద్ద ఎత్తున వివాదం రేగింది. అయితే ఎట్టకేలకు టెన్షన్ హైపర్ ఆది ఈ విషయంలో స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

    పోలీసులకు ఫిర్యాదు

    పోలీసులకు ఫిర్యాదు


    జబర్దస్త్ కామెడీ హైపర్ ఆది మీద ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని కించపరుస్తూ తెలంగాణ వాసులు దేవతగా పూజించే బతుకమ్మను గౌరమ్మను కించపరుస్తూ మాట్లాడాడు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ముందే వివాదాల్లో

    ముందే వివాదాల్లో


    దీనికి సంబంధించి నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే హైపర్ ఆది గతంలో కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో కచ్చితంగా ఈ అంశంలో మాత్రం క్షమాపణ చెబితే కానీ లేదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పట్టుబట్టారు. అతను ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.

    క్షమాపణలు చెప్పాల్సిందే

    క్షమాపణలు చెప్పాల్సిందే

    హైపర్ ఆది మాటలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని చెబుతూ ఆయన క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో తిరగనివ్వమని, షూటింగ్ స్పాట్స్ కి వెళ్లి అయినా హైపర్ ఆది అడ్డుకుంటామని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఒక ప్రముఖ ఛానల్ లైవ్ లో ఉండగానే ఆదికి జాగృతి సభ్యులు ఫోన్ కలిపారు. ఈ ఫోన్ సంభాషణలో ఆది క్షమాపణలు కూడా చెప్పారు.

    నేను సైలెంట్ గానే ఉన్నా

    నేను సైలెంట్ గానే ఉన్నా

    తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడలేదని ఆది చెప్పుకొచ్చారు. షోలో భాగంగా బతుకమ్మకి సంబంధించిన పండుగ చేయాల్సి వచ్చిందని కానీ బతుకమ్మను గౌరమ్మను ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని తెలిసి తాను సైలెంట్గా ఉన్నానని కానీ తాను ఆ పదాలు పలికినట్లు ఎడిటింగ్లో సింక్ చేశారని ఆది చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 : Contestants వీళ్ళే ! మీకు ఓకే నా ? || Filmibeat Telugu
    క్షమాపణలు చెప్పడానికి సిద్ధం

    క్షమాపణలు చెప్పడానికి సిద్ధం

    అసలు తాను ఆ మాటలు అనలేదని, ఒకవేళ తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెప్పడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆది చెప్పుకొచ్చారు. ఇక ఈ అంశం మీద మల్లెమాల సంస్థ నుంచి మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదు. ఆది స్పందించిన నేపథ్యంలో బహుశా మల్లె మాల సంస్థ తరపు నుంచి కూడా ఏదైనా ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు.

    English summary
    we all know that a complaint was lodged against noted Telugu comedian ‘Hyper’ Aadi by representatives of Telangana Jagruthi Students Federation for allegedly making derogatory comments on Telangana dialect and culture. recently hyper aadi responds on bathukamma skit controversy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X