అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? సీక్రెట్ చెప్పేసిన హైపర్ ఆది.. జబర్దస్త్ బ్యూటీ వార్నింగ్!

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్‌ని సంబంధించిన అన్ని అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రోమో వీడియోలు మొదలుకొని ఎపిసోడ్ వీడియోల వరకు అన్నీ హైలైట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో అనసూయపై హైపర్ ఆది వేసిన పంచ్ డైలాగ్స్, వాటిపై ఆ జబర్దస్త్ బ్యూటీ రియాక్షన్స్ మంచి కిక్కిచ్చాయి. ఆ వివరాలేంటో చూద్దామా..

అనసూయను చూడగానే హైపర్ ఆది

అనసూయను చూడగానే హైపర్ ఆది

జబర్దస్త్ షో అంటేనే సూపర్ కిక్. కమెడియన్ల పంచ్ డైలాగ్స్, రోజా నవ్వులు, అనసూయ స్పెషల్ అప్పియరెన్స్ అన్నీ దేనికవే ప్రత్యేకం. ఇక ఈ షోలో హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం మరింత స్పెషల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయను చూడగానే హైపర్ ఆది అలా అలా రెచ్చిపోవడం చాలా ఎపిసోడ్స్‌లో చూశాం.

హైపర్ ఆది పంచెస్.. అనసూయ ఫైర్

హైపర్ ఆది పంచెస్.. అనసూయ ఫైర్

తన ప్రతీ స్కిట్ లోనూ అనసూయను ఇన్వాల్వ్ చేస్తూ ఆమెపై జబర్దస్త్ పంచులేస్తుంటాడు హైపర్ ఆది. లేదంటే అనసూయ కూడా అసూయ పడేలా మరో అమ్మాయిని వెంట తీసుకొచ్చి హల్చల్ చేస్తుంటాడు. గత కొంతకాలంగా ఇదే ఫార్ములా ఫాలో అవుతూ వస్తున్న హైపర్ ఆది.. ఈ సారి మాత్రం అనసూయ కోపానికి గురయ్యాడు. దీంతో ఈ ఎపిసోడ్ వీడియో నెట్టింట వైరల్ అయింది.

జబర్దస్త్ బ్యూటీ వార్నింగ్.. స్టేజీపైనే అలా

జబర్దస్త్ బ్యూటీ వార్నింగ్.. స్టేజీపైనే అలా

ఇన్నాళ్లు అనసూయ అందం, ఆమె బ్యూటీనెస్ పైనే పంచులేసిన మనోడు.. ఈ సారి ఆమె రెమ్యునరేషన్ గురించి కామెంట్స్ చేసి రచ్చ చేశాడు. దీంతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ స్టేజీపైనే అతనికి వార్నింగ్ ఇచ్చింది. ఈ వారం ప్రసారం అయిన స్కిట్ అంతా అనసూయపైనే చేసిన ఆది.. అనసూయ గారూ మీరు భలే మేనేజ్ చేస్తారండీ అంటూ ఆమెపై వరుస పంచెస్ విసిరాడు హైపర్ ఆది.

అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

అంతేకాదు అనసూయకు ఈవెంట్‌కు 3 లక్షలు ఇస్తారు.. మాకు మాత్రం లక్ష ఇస్తారంటూ రెమ్యునరేషన్‌పై సెటైర్ వేసాడు హైపర్ ఆది. అలా ఆమెపై పంచులయితే బాగానే పేలాయి.. కానీ ఈ స్కిట్‌లో ఆది రాసిన డైలాగులు కామెడీ కోసమే అయినా అనసూయ రెమ్యునరేషన్ మాత్రం ఇలా బయటపడిందని చెప్పుకుంటున్నారు ఆడియన్స్.

జబర్దస్త్ జోడీ.. పొట్టచెక్కలయ్యే వినోదం

జబర్దస్త్ జోడీ.. పొట్టచెక్కలయ్యే వినోదం

జబర్దస్త్ షో పరంగా కొన్ని జోడీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో ఒక జోడీ రష్మీ గౌతమ్- సుధీర్ కాగా మరో జోడీ అనసూయ- హైపర్ ఆది. జబర్దస్త్ వేదికపై ఈ జంటల హంగామా మామూలుగా ఉండదనే విషయం అందరికీ తెలుసు. ఒకరిపై ఒకరు పంచుకోలేసుకుంటూ ప్రేక్షకులకు పొట్టచెక్కలయ్యే వినోదం పంచే వీళ్ళు ఇప్పుడు మాత్రం ఇలా రెమ్యునరేషన్ సీక్రెట్స్ చెప్పుకోవడం ఆసక్తికర అంశం.

Recommended Video

Anchor Anasuya Vs Anchor Manjusha In Jabardasth Comedy Show | Filmibeat Telugu

అనసూయ నడుముపై కన్నేసిన హైపర్ ఆది

ఇలానే గతంలో ఓ స్కిట్‌లో భాగంగా అనసూయ నడుముపై కన్నేశాడు హైపర్ ఆది. అంతేకాదు నానా రచ్చ చేయడంతో.. నా నడుము చూశావంటూ హైపర్ ఆదితో గొడవకు దిగింది అనసూయ. అప్పుడు ఆ వీడియో కూడా ఇలాగే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X