Hyper Aadi: ఆమె వల్లే జబర్దస్త్ మానేయాల్సి వచ్చింది.. షాకింగ్ విషయం బయట పెట్టిన హైపర్ ఆది!

బుల్లితెర కమెడియన్ గా సినీ కెరీర్ ను ఆరభించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. హైపర్ ఆది అంటే తెలియని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఉండరు. ప్రతి ఫెస్టివల్ కి కానీ, సినీ సెలబ్రేషన్స్ కి కానీ స్పెషల్ ఈవెంట్ లు, ప్రోగ్రామ్స్ లో తనదైన కామెడీ పంచులతో అట్రాక్ట్ చేస్తాడు హైపర్ అది. ఎంతో కాలంగా హైపర్ ఆది తెలుగు బుల్లితెరపై హవాను చాటుతూ టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. పంచులు, ప్రాసల స్పెషలిస్టుగా పేరొందిన ఈ కమెడియన్ అనేక షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటున్న హపర్ ఆది తాజాగా ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు.

 రైటర్ గా ఎంట్రీ ఇచ్చి..

రైటర్ గా ఎంట్రీ ఇచ్చి..

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లోకి రైటర్ గా ప్రవేశించిన ఆది అనేక సినిమా స్పూఫ్ స్కిట్లతో పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా అంటే కమెడియన్ గా మారి ఎన్నో స్కిట్లలో అదరగొట్టాడు. తను కనిపించిన ప్రతి స్కిట్లలో తన మార్క్ చాటాడు. దీంతో హైపర్ ఆదిగా అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనిలోని టాలెంట్ చూసి హైపర్ ఆదికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు.

డైరెక్టర్స్, హీరోలను ఆకట్టుకునేలా..

డైరెక్టర్స్, హీరోలను ఆకట్టుకునేలా..

హైపర్ ఆది కెరీర్ బుల్లితెరపై జబర్ధస్త్‌ షో తరహాలో సూపర్ గా సాగుతోంది. హైపర్ ఆది కామెడీ పంచులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. జబర్ధస్త్‌లో సుదీర్ఘ కాలం పాటు టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించాడు హైపర్ ఆది. అంతేకాకుండా అతని డైలాగ్స్ సినిమా దర్శకులు, హీరోలను కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దీంతో అతడికి సినీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

 సినిమాల్లోనూ డైలాగ్ రైటర్ గా..

సినిమాల్లోనూ డైలాగ్ రైటర్ గా..

బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అందులోనూ తన మార్క్ చూపించాడు. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్న హైపర్ ఆది ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఈ క్రమంలోనే కమెడియన్, నటుడు అల్లరి నరేష్ నటించిన 'మేడ మీద అబ్బాయి' మూవీతో సినిమాల్లోనూ డైలాగ్ రైటర్‌గానూ మారాడు. తర్వాత పలు సినిమాలకు డైలాగ్స్ అందించాడు ఆది.

ఫ్రెండ్స్ అయినా కారణంగా..

ఫ్రెండ్స్ అయినా కారణంగా..

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ధమాకాకు కూడా కొన్ని కామెడీ సీన్స్ రాశాడు హైపర్ ఆది. ధమాకా సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కిన, హైపర్ ఆది మంచి ఫ్రెండ్స్ అని టాక్. ఈ కారణంగా, అలాగే జబర్దస్త్ లో హైపర్ ఆది పంచులు, ప్రాసలకు ఫిదా అయి ధమాకా అవకాశం ఇచ్చారని బయట వినిపిస్తున్న టాక్. ఇదివరకు అయితే త్రినాథ రావు సినిమాలకు రచయిత ప్రసన్న కుమార్ రాసేవారు. ఈ ధమాకా చిత్రానికి మాత్రం హైపర్ ఆదిని తీసుకున్నారు.

ఓనర్ ను టార్చర్ చేసే డ్రైవర్..

ఓనర్ ను టార్చర్ చేసే డ్రైవర్..


ఇక ధమాకా చిత్రంలో స్టోరీ పరంగా వచ్చే కామెడీతో డైలాగ్ రైటర్ గా తనదైన మార్క్ చూపించాడు హైపర్ ఆది. ఈ సినిమాలో కామెడీ స్కిట్స్ రైటర్ గానే కాకుండా హైపర్ ఆది ఓ పాత్ర కూడా పోషించాడు. హీరోయిన్ శ్రీలీల తండ్రి రావు రమేష్ కు డ్రైవర్ గా తనదైన పంచ్ లతో సినిమాలోనూ నవ్వించాడు హైపర్ ఆది. ఓనర్ ను పంచ్ డైలాగ్ లతో నిత్యం టార్చర్ చేసే డ్రైవర్ గా హైపర్ ఆది అలరించాడు.

 సీరియల్ నటితో పెళ్లి..

సీరియల్ నటితో పెళ్లి..

ఇక హైపర్ ఆదికి సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. మీమ్స్ రూపంలోనూ, తన కామెడీ స్కిట్స్ ప్రోమోల రూపంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. అతనికి సంబంధించిన విషయాలు హైలెట్ అవుతూ కూడా ఉంటాయి. ఇలా ఇప్పటికే దీపిక పిల్లతో హైపర్ ఆది పెళ్లి రూమర్స్ హల్ చల్ చేశాయి. తర్వాత సీరియల్ నటితో హైపర్ ఆదికి పెళ్లయినట్లు కూడా ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అవన్ని స్కిట్ లు, సన్నివేశాల్లో భాగమనే టాక్ కూడా నడిచింది.

జనవరి 15న ప్రసారం కానున్న..

జనవరి 15న ప్రసారం కానున్న..

ఇటీవల జబర్దస్త్ లో కనిపించడం మానేసిన హైపర్ ఆది అందుకు గల కారణం ఎవరో బయట పెట్టాడు. స్పెషల్ ప్రోగ్రామ్స్ లలో హైపర్ ఆది పాల్గొంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ఎపిసోడ్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సీరియల్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్ అలరించారు. జనవరి 15న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ఆ అమ్మాయే కారణం..

ప్రోమోలో ఫారెన్ నుంచి వచ్చా.. ఫారెన్ అంటే తెలుసు కదా అని రాజా రవీంద్ర అంటే.. హా తెలుసు.. ఫారెన్ వీడియోలు చూస్తుంటాం అని ఆది అన్నాడు. దీంతో ఏ చేయరా అని కౌంటర్ వేశాడు రాజా రవీంద్ర. తర్వాత ఆర్జీవీ, అషురెడ్డి ఇంటర్వ్యూని రోస్ట్ చేశాడు హైపర్ ఆది. తర్వాత కొంత ఫన్ చేసిన హైపర్ ఆదిని.. మీరు జబర్దస్త్ మానేయడానికి ఎవరు కారణం అని యాంకర్ రష్మీ అడిగింది. ఈ ఫొటోల్లో ఇద్దరు కమెడియిన్లతోపాటు ప్రస్తుత జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు ఉంది. అప్పుడు "నేను జబర్దస్త్ మానేయడానికి కారణం ఆ అమ్మాయి" అని సౌమ్య గురించి చెప్పాడు హైపర్ ఆది. దీంతో ఇంద్రజ అలా షాక్ అయి చూస్తి ఉండిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X