Hyper Aadi: పెళ్లి అప్పుడే చేసుకుంటా.. కండిషన్స్ చెప్పిన హైపర్ ఆది..

జబర్థస్త్ కామెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఆది, ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే కొంతకాలం క్రితం ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, కుటుంబం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

కిస్సిక్ టాక్ ఇంటర్వ్యూలో హైపర్ ఆది.. ప్రేమ గురించి మాట్లాడుతూ, తన స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉండేదో చెప్పుకొచ్చాడు. 'మా రోజుల్లో ప్రేమ అంటే చూపుల్లోనే ఉండేది. ఒక అమ్మాయి మనవైపు చూస్తుందా లేదా అని గమనించడం... మరుసటి రోజు మళ్లీ అదే చూస్తుందా అని కన్ఫామ్ చేసుకోవడం... అంతే. మాట్లాడే అవకాశమే ఉండేది కాదు'అంటూ అప్పటి అమాయకమైన ప్రేమను గుర్తు చేసుకున్నాడు. ఇప్పటి ప్రేమతో పోలిస్తే ఆ ఫీలింగ్ చాలా ప్యూర్ అని ఆయన అభిప్రాయపడ్డాడు.

Hyper Aadi Reveals Marriage Conditions Talks Love Family and Fear of Marriage

కుటుంబం గురించి మాట్లాడుతూ..తన బాల్యాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. 'మేము ముగ్గురు అన్నదమ్ములు.. మా ఇంట్లో ఎనర్జీ ఎప్పుడూ ఫుల్‌గా ఉండేది. సరదాగా కొట్టుకోవడం, అల్లరి చేయడం మా రోజువారీ పని'అంటూ నవ్వులు పూయించాడు. అయితే ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం వల్ల తన తల్లికి ఓ లోటు ఉండేదని, ఆ లోటును తన పెదనాన్న కూతురు భర్తీ చేసిందని చెప్పడం ద్వారా తన ఫ్యామిలీ బాండింగ్‌ను బయటపెట్టాడు.

ఇక పెళ్లి గురించి వచ్చిన ప్రశ్నకు మాత్రం హైపర్ ఆది చాలా సీరియస్‌గా స్పందించాడు. 'ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు చూస్తే పెళ్లి అంటే భయం వేస్తోంది. అది ఒక పెద్ద బాధ్యత.. తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు' అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు. పెళ్లి అనేది కేవలం ఇద్దరి మధ్య బంధం మాత్రమే కాకుండా, బాధ్యతలు, అర్థం చేసుకోవడం, సహనం అన్ని కలిపిన వ్యవహారమని వివరించాడు.

తాను భావించే ఐడియల్ భర్త లక్షణాలను కూడా వివరించాడు. కోపాన్ని అదుపులో పెట్టుకునే వాడు, ఓపికగా ఉండే వాడు, బయట సమస్యలను ఇంట్లోకి తీసుకురాని వాడు, తన కష్టంతోనే సంపాదించే వాడు.. ముఖ్యంగా భార్యను అర్థం చేసుకుని, ఆమెకు తల్లిదండ్రుల ప్రేమను ఇవ్వగలిగే వ్యక్తే నిజమైన భర్త అని చెప్పాడు. 'ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి' అంటూ తన నిర్ణయంపై క్లారిటీ ఇచ్చాడు.

ఇక ప్రస్తుత జనరేషన్‌లో పెళ్లి విలువ తగ్గిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లోనే వైరల్ అయ్యాయి. 'ముందు పెళ్లి అంటే జీవితాంతం బంధం... ఇప్పుడు మాత్రం చిన్న విషయాలకే చీటింగ్, విడాకులు అంటూ కోర్టుల వరకు వెళ్తున్నారు' అంటూ తన అభిప్రాయం చెప్పాడు. కొందరు పెళ్లిని ఓ బాధ్యతగా కాకుండా, కేవలం కండిషన్‌లతో నడిచే రిలేషన్‌గా చూస్తున్నారని కూడా వ్యాఖ్యానించాడు. అన్ని క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి అంటున్న హైపర్ ఆది... ఆ రోజు ఎప్పుడు వస్తుందో? మరి వేచిచూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X