అందరి ముందే ఆ అమ్మాయిని అలా అడిగిన హైపర్ ఆది: ఛీఛీ అంటూ అనసూయ షాకింగ్‌గా.. చివరికి రోజా కూడా!

బుల్లితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటారు. తద్వారా ఎనలేని క్రేజ్‌ను కూడా సంపాదించుకుంటారు. అలాంటి వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకడు. చాలా కాలం క్రితం జబర్ధస్త్ షో ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయ్యాడు. పంచ్ డైలాగుల స్పెషలిస్టుగా పేరొందిన అతడు.. అన్ని స్కిట్లను వన్ మ్యాన్ షోగా మార్చుకుంటాడు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది తాజాగా వింతగా ప్రవర్తించాడు. అసలేం జరిగింది? వివరాలు మీకోసం!

 జబర్ధస్త్ వల్ల ఆదికి.. ఆది వల్ల జబర్ధస్త్‌కు

జబర్ధస్త్ వల్ల ఆదికి.. ఆది వల్ల జబర్ధస్త్‌కు

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్‌ షోకు ఉన్న ప్రత్యేకతే వేరు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ షో ప్రేక్షకాదరణను పొందుతూ దూసుకుపోతుండడమే దీనికి కారణం. ఈ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు హైపర్ ఆది. ఇందులోకి వచ్చిన కొద్ది రోజులకే టీమ్ లీడర్ అయ్యాడు. అప్పటి నుంచి తనను తాను నిరూపించుకుంటూ షోకు భారీగా టీఆర్పీ రేటింగ్ పెంచడంతో తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

ఎప్పుడూ ట్రెండింగే... రికార్డుల రారాజుగా

ఎప్పుడూ ట్రెండింగే... రికార్డుల రారాజుగా

జబర్ధస్త్ స్కిట్లను యూట్యూబ్‌లో వదులుతుంటారు. వాటికి నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందులోనూ హైపర్ ఆది టీమ్ చేసే స్కిట్లే ప్రతి వారం ట్రెండింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అతడి స్కిట్లకు మిలియన్‌కు పైగా వ్యూస్ వస్తుంటాయి. ఇలా ఎన్నో స్కిట్ల ద్వారా పలు రికార్డులను క్రియేట్ చేశాడీ జబర్ధస్త్ కమెడియన్. దీంతో ఆది క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

 అందరిపై దండయాత్ర చేస్తూ హాట్ టాపిక్

అందరిపై దండయాత్ర చేస్తూ హాట్ టాపిక్

తన స్కిట్‌లో ఎవరు చేసినా.. వాళ్లను కనపడకుండా చేయడం హైపర్ ఆది ప్రత్యేకత. అంతలా అతడు ఎదుటి వారిపై గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ దండయాత్ర చేస్తుంటాడు. ఇందులో భాగంగానే తన స్కిట్లలో ఎక్కువ శాతం ట్రెండింగ్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టకుండా వాళ్లపైనా పంచులు విసురుతుంటాడు.

మరో అమ్మాయితో రొమాన్స్ చేసిన ఆది

మరో అమ్మాయితో రొమాన్స్ చేసిన ఆది

ఎప్పుడూ ఎవరో ఒకరిని గెస్టుగా తీసుకొస్తుండే హైపర్ ఆది.. వచ్చే వారం జరగనున్న జబర్ధస్త్ షోలో మరో అమ్మాయిని తీసుకొచ్చాడు. రావడం రావడమే మంచి మెలోడీ సాంగ్‌కు ఆమెతో కలిసి స్టెప్పులేసిన అతడు.. ఆ వెంటనే పంచులు పేల్చడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగానే ఆమెతో చేసిన సంభాషణ హైలైట్ అవుతోంది. దీంతో ఈ ప్రోమో వైరల్‌గా మారిపోయింది.

అందరి ముందే అది అడిగేసిన హైపర్ ఆది

అందరి ముందే అది అడిగేసిన హైపర్ ఆది


స్కిట్‌లో భాగంగా ఆ అమ్మాయి 'సెట్‌లో ఇంత మంది లేడీ గెటప్ వేసే వాళ్లు ఉండగా.. నన్నే ఎందుకు రమ్మన్నావ్' అని ప్రశ్నించింది. దీనికి ఆది 'నువ్వే కదా ఎవరూ పిలవట్లేదు. మళ్లీ పిలువు అన్నావ్' అంటూ గాలి తీసేశాడు. ఆ తర్వాత ఆమె 'నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మన జంట హైలైట్ అవ్వాలి' అని అడిగింది. దీనికి వెంటనే ఆది 'అయితే ఒక హగ్ ఇవ్వు' అంటూ అడిగేశాడు.

ఛీ ఛీ అంటూ అనసూయ షాకింగ్ రియాక్షన్


ఆ అమ్మాయిని హైపర్ ఆది హగ్ అడగడంతో యాంకర్ సీటులో ఉన్న అనసూయ భరద్వాజ్ వెంటనే స్పందించింది. 'ఏంటి ఇలా తయారయ్యావ్ నువ్వు. ఛీ ఛీ అందరినీ అడుక్కుంటున్నాడు' అంటూ జబర్ధస్త్ కమెడియన్ గురించి షాకింగ్‌గా రియాక్ట్ అయింది. ఆ వెంటనే జడ్జ్ కుర్చీలో ఉన్న రోజా కూడా స్పందిస్తూ.. 'నీవల్లే ఇలా తయారయ్యాడు' అంటూ అనసూయకు పంచ్ ఇచ్చింది.

 ఎవరూ ఇవ్వరంటూ ఆది రొమాంటిక్ కామెంట్స్

ఎవరూ ఇవ్వరంటూ ఆది రొమాంటిక్ కామెంట్స్

అనసూయ అలా.. రోజా ఇలా.. ఆ అమ్మాయి మరోలా అనడంతో హైపర్ ఆది తనదైన శైలిలో స్పందించాడు. 'వీళ్లు ఒప్పుకోరు.. వాళ్లు ఒప్పుకోరు.. అక్కడ వాళ్లు ఒప్పుకోరు ఛీఛీ' అంటూ రొమాంటిక్‌గా కామెంట్స్ చేశాడీ యంగ్ టాలెంటెడ్ కమెడియన్. దీంతో అక్కడున్న వాళ్లంతా షాకైపోయారు. ఆ వెంటనే పడి పడి నవ్వుకున్నారు. దీంతో హైపర్ ఆది మరోసారి ట్రెండ్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X