Hyper Aadi: ఫారెన్ బ్యూటీతో హైపర్ ఆది రొమాన్స్.. అందరి ముందే ఆ పని చేయడంతో!
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ద్వారా పరిచయం అయిన కమెడియన్ హైపర్ ఆది ఒకడు. అద్భుతమైన పంచ్‌లు, అదిరిపోయే ప్రాసలతో సత్తా చాటుతోన్న ఈ టాలెంటెడ్ గాయ్.. తెలుగు రాష్ట్రాల్లో యమ ఫేమస్ అయిపోయాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోనూ హవాను చూపిస్తున్నాడు. ఇక, తాజాగా ఆది ఓ ఫారెన్ అమ్మాయితో రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్ షోతో ఆది ఫుల్ ఫేమస్
సినిమా స్ఫూఫ్ వీడియోలతో అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే ఆది జబర్ధస్త్ షోలోకి రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో సహాయకుడిగా చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తూ భారీ స్థాయిలో ఫేమస్ అయిపోయాడు.

మూవీల్లోనూ సత్తా చాటిన ఆది
జబర్ధస్త్ షో పుణ్యమా అని హైపర్ ఆది బుల్లితెరపై తిరుగులేని ఆర్టిస్టుగా మారిపోయాడు. ఈ క్రమంలోనే అతడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్‌లో నటించాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు.

జబర్ధస్త్‌ను కాదని... ఆ షోలలో
సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్‌లో టాప్ టీమ్ లీడర్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. కొంత కాలంగా ఆ షోలో కనిపించడం లేదు. దీంతో అతడి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే, అయితే, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రమే సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తన అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. దీంతో క్రేజ్‌ను పెంచుకుంటున్నాడు.

డ్యాన్స్ తక్కువ.. ఫన్ ఎక్కువ
సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక టీమ్‌కు హైపర్ ఆది మెంటర్‌గా చేస్తున్నాడు. ఇక, ఈ షోలో డ్యాన్స్ కంటే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఆది చేసే స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.

ఢీ కోసం ఫారెన్ బ్యూటీ రాక
వచ్చే వారం ప్రసారం కాబోతున్న 'ఢీ' 14వ సీజన్ ఎపిసోడ్ మరింత ఫన్నీగా జరగబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. ఇందులోకి ఆర్జే కమ్ యాంకర్ నిఖిల్.. ఓ ఫారెన్ అమ్మాయిని తీసుకుని వచ్చాడు. తాను రష్యాలో చదువుతున్నప్పుడు ఆమె పరిచయం అయిందని చెప్పాడు. ఇక, ఆ బ్యూటీ కూడా తనదైన శైలి స్టైల్, స్మైల్‌తో మెస్మరైజ్ చేసేసింది.
ఫారెన్ భామతో ఆది రొమాన్స్
'ఢీ' షోలో భాగంగా ఎంట్రీ ఇచ్చిన రష్యా పిల్లతో హైపర్ ఆది స్పెషల్ స్కిట్లు చేశాడు. ఆమెకు ముందుగా 'ఊ అంటావా మావ' అనే పాటను నేర్పించాడు. ఆ సమయంలోనే ఇద్దరూ అలా అలా నడుము ఊపుతూ రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. అంతేకాదు, నిఖిల్‌ను కూడా హైపర్ ఆది తనదైన పంచులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అయిపోతోంది.

ఆమె అలా చేయడంతో షాక్
'ఢీ' షోలోకి స్పెషల్ గెస్టుగా వచ్చిన ఫారెన్ బ్యూటీ ఏకంగా 'ఊ అంటావా మావ' పాటను హమ్ చేసింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయిపోయారు. అంతేకాదు, ఆమె హైపర్ ఆది మీద చేతులు వేసి తెగ సిగ్గు పడిపోయింది. ఇవి మాత్రమే కాదు.. ఆమె అదిరిపోయే స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయిపోయింది.


Click it and Unblock the Notifications











