పటాస్ ప్రవీణ్ పెళ్లి.. ఫైమాపై నోరు పారేసుకున్న హైపర్ ఆది

పటాస్, జబర్దస్త్ కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు పటాస్ ప్రవీణ్, ఫైమా. తమదైన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో వీరిద్దరూ ప్రేక్షకులను నవ్వించారు. ఒకేసారి వీరిద్దరూ బుల్లితెరపై ప్రయాణం స్టార్ట్ చేశారు. ఇద్దరూ జోడీగా పలు స్కిట్స్ చేయడం, క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అనుకోని పరిస్ధితుల్లో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇదే సమయంలో ఫైమా.. ప్రవీణ్ అనే కుర్రాడిని తన బాయ్‌ఫ్రెండ్ అని పరిచయం చేయడం కలకలం రేపింది. తనకు ప్రవీణ్ కంటే ముందే ప్రవీణ్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని కానీ ఆలస్యంగా పరిచయం చేశానని చెప్పింది ఫైమా.

ప్రవీణ్‌తో గ్యాప్ కొనసాగుతుండగానే.. ప్రవీణ్ ఇటీవల వంశిత అనే అమ్మాయితో రిలేషన్‌ సాగించాడు. అనంతరం పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లాడాడు. దాంతో ఫైమా పరిస్ధితి ఏంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. అయితే ప్రవీణ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది ప్రవీణ్. పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన తన మిత్రుడికి వీడియో కాల్ చేసి మరి శుభాకాంక్షలు చెప్పింది. అయితే వ్యక్తిగతంగా ప్రవీణ్ పెళ్లికి ఫైమా హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

Hyper Aadi s Funny Punches on Faima and Patas Praveen s Marriage in Sridevi Drama Company

ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో పటాస్ ప్రవీణ్ పెళ్లి గురించి హైపర్ ఆది.. ఫైమాపై పంచ్‌లు విసిరాడు. సీరియల్స్ పురం అంటూ సాగిన ఈ కార్యక్రమంలో పొట్టి నరేష్‌తో కలిసి ఓ ఫన్నీ స్పూఫ్ చేసింది ఫైమా. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన తులసి మూవీలో యాంకర్ ఝాన్సీ వచ్చి రాని ఇంగ్లీష్‌లో అందరినీ తన ఇంట్లో ఫంక్షన్‌కు ఆహ్వానించే పాత్రను పోలి ఉండేలా ఉన్న ఈ స్పూఫ్ నవ్వు తెప్పించింది. తొలుత రిచ్ ఆంటీ అంటూ ఫైమాను ఆహ్వానించింది యాంకర్ రష్మి గౌతమ్.

ముందైతే ఆడది అని ఫైమా అనగా.. అది ఆడది కాదు ఆది అని చెబుతాడు నరేష్. మీ అందరికీ మాత్రం ఆది.. నాకు మాత్రం ఆడది అని అంటుంది ఫైమా. ఆడిది ఇడిది ఎందుకులే కానీ నీ సంగతి చెప్పమంటూ హైపర్ ఆది పంచ్ వేస్తాడు. ఇంతకీ మన ఫంక్షన్‌లో వన్నాలు ఉన్నాయా అని ఆది అడగ్గా.. అన్నాలు లేవు కానీ తమ్ముళ్లు ఉన్నారని ఫైమా రివర్స్ కౌంటర్ వేస్తుంది. మేం ఈ మధ్య ఓ కొంప కట్టుకున్నాం.. ఆ ఓపెనింగ్‌కి నిన్ను పిలుద్దామని వచ్చామని అంటుంది ఫైమా.

మీకు కొంపలు కూల్చడమే కానీ కట్టడం కూడా వచ్చా అంటూ ఆది అనడంతో అంతా నవ్వేస్తారు. నువ్వు ఇలా మాట్లాడతావు కాబట్టే నిన్ను అసలు మా ఫంక్షన్‌కి పిలవకూడదని అనుకున్నాం తెలుసా అని ఫైమా అనగా.. నీకు ప్రవీణ్‌గాడికి పెళ్లవుతుందని తెలుసా? వంశితా అని ఒకమ్మాయి ఉంది పిలుస్తావా అని అడుగుతాడు ఆది. ఆ అమ్మాయి ఎవరు అని ఫైమా అడగ్గా.. ప్రవీణ్ గాడు చేసుకునేది ఆ అమ్మాయినే అంటాడు ఆది.

ఈ మధ్యన నువ్వు చాలా అందంగా ఉంటున్నావు, ఏం వాడుతున్నావని ఓ సీరియల్ హీరోయిన్ అడగ్గా.. ఈ మధ్య నేను డేట్ చేస్తున్నానని అంటుంది ఫైమా. అది డేటింగ్ కాదు రా డైటింగ్ అని నరేష్ చెప్పగా.. అది కరెక్ట్‌గానే చెప్పింది నువ్వే అంటూ ఆది పంచ్ విసురుతాడు. మరో హీరో కూడా ఈ మధ్య చాలా అందంగా ఉంటున్నావు, ఏం తింటున్నావని అడుగుతాడు. నేను డ్రైవర్ ఫ్రూట్స్ తింటున్నానని ఫైమా చెప్పగా.. అది డ్రాగన్ ఫ్రూట్ అంటాడు నరేష్. అది కరెక్ట్‌గానే చెప్పింది రా నువ్వే అని మరోసారి ఆది పంచ్ వేస్తాడు.

మెరుపు కలలు సీరియల్ హీరోయిన్ రక్ష దగ్గరికి వెళ్లి నువ్వు హీరోయిన్ అయ్యుండి విలన్ వెంట పడుతున్నావని అడుగుతుంది ఫైమా. ఆప్షన్ లేదు అలా చేయాల్సి వచ్చిందని ఆమె ఆన్సర్ ఇస్తుంది. రాత్రి ఛాటింగ్ చేస్తుంటే రిప్లయ్ ఇవ్వవేంటీ అని ఆ సీరియల్ హీరో అడగ్గా.. నేను ఈ మధ్య చాలా మందితో చీటింగ్ చేస్తున్నానని ఫైమా అంటుంది. అది చీటింగ్ కాదని నరేష్ చెప్బబోతుండగా.. అది కరెక్ట్‌గానే చెప్పిందని పంచ్ వేస్తాడు ఆది. మీరందరూ ఫంక్షన్‌కి ఖచ్చితంగా రావాలని ఫైమా మరోసారి పిలుస్తుంది. అయితే అందరినీ పిలిచి నన్నెందుకు పిలవలేదని యాంకర్ రష్మి అడగ్గా.. నువ్వు ఫంక్షన్‌కి కాదు.. పింఛన్‌కి వస్తావు కదా అని పంచ్ విసురుతుంది ఫైమా. ప్రస్తుతం ఈ స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తోంది.

Read more about: hyper aadi faima patas praveen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X