ఆ విషయంలో రష్మీ తడబాటు.. పరువు పోయేలా హైపర్ ఆది సెటైర్స్
యాంకర్ రష్మీకి ఉన్న తెలుగు ప్రావీణ్యం గురించి అందరికీ తెలిసిందే. రష్మీ తెలుగమ్మాయ్ కాదు. తెలుగు అంతగా రాదనీ అందరికీ తెలుసు. అయితే యాంకరింగ్ చేసి ఇంత కాలం అవుతుండటంతో తెలుగుపై పట్టు సంపాదించకపోయినా.. బాగానే మాట్లాడే స్థాయికి వచ్చింది. అలాంటి రష్మీ తెలుగులో పాట పాడటం, అందులోనూ నోరు తిరగని పదాలతో పాట పాడటమంటే సాహసమే. అదే సాహసం తాజాగా చేసినట్టుంది. రీసెంట్ ప్రోమోను చూస్తేంటే రష్మీ.. హైపర్ ఆది పంచ్‌లకు బలైపోయినట్టు కనిపిస్తోంది.

ఢీ షో ఫేమస్..
ఒకప్పుడు ఢీ షో అంటే డ్యాన్సులకు ఫేమస్. కానీ ఢీ షో తన స్వరూపాన్నే మార్చుకుంటోంది. ప్రస్తుతం ఢీ షో అంటే పంచ్‌లు, జోకులు, రొమాన్స్ మాత్రమే. సుడిగాలి సుధీర్, రష్మీలతో వేరే రూట్‌లోకి వచ్చిన షో.. హైపర్ ఆది, వర్షిణి ఎంట్రీతో మరింతగా మారింది.

మధ్యలో టాస్క్‌లు..
ఢీ షోలో డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు ఏమో గానీ మధ్యలో వచ్చే కుళ్లు జోకులు, టాస్క్‌లు, స్కిట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకోవడం, ప్రదీప్ మధ్యలో దూరడం నాలుగు సెటైర్స్ వేయడం.. ఇదే జరుగుతూ వస్తోంది. అయితే ప్రేక్షకులుకూడా వీటినే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు.

తాజా ప్రోమో వైరల్..
ఢీ షోకు సంబంధించి రీసెంట్‌గా విడుదల చేసిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇందులో మొదటగా వర్షిణి, హైపర్ ఆది గెలిచినట్టు ఉన్నారు. టాస్క్‌లో భాగంగా అక్కడ ఉన్నవారందరి చేత సుధీర్ తెలుగు పాట పాడించాలని హైపర్ ఆది కోరాడు. దానిలో భాగంగా స్టూడెంట్ నెం.1 సినిమాలోని కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే.. తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే.. రేగుతున్న చోట భోగిమంట మండుతుంటే.. మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే అనే పాటను హైపర్ ఆది గుక్కతిప్పకుండా పాడేశాడు.

తంటాలు పడ్డ రష్మీ..
ఇక ఈ పాటను సుధీర్ కూడా పాడేశాడు. అయితే మధ్యలో కాస్త తడబడ్డాడు. కానీ రష్మీ మాత్రం నానా తంటాలు పడింది. అసలే తెలుగులో అంతంత మాత్రమే అనే రష్మీ ఈ పాటను మొత్తం కూనీ చేసింది. ఇక హైపర్ ఆది పంచ్‌ల వర్షాన్ని కురిపించాడు. రష్మీ పాటను దగా చేయడం చూసి మగ్గు, జగ్గు అంటూ ఆమె పాటలపై కౌంటర్స్ వేశాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వారు. దీంతో రష్మీ పరుపుపోయినంత పనైంది.


Click it and Unblock the Notifications











