శేఖర్ మాస్టర్ మరీ అలాంటోడా?.. ఘోరంగా అవమానిస్తోన్న హైపర్ ఆది

టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ కొరియెగ్రఫర్ శేఖర్ మాస్టర్ క్రేజ్ ఏ రేంజ్‌ల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారితో కొత్త స్టెప్పులను వేయించడంతో శేఖర్ మాస్టర్ శైలి ప్రత్యేకం. వెండితెరపై తన స్టెప్పులతో అభిమాన గణాన్ని సంపాదించుకోవడమే కాకుండా బుల్లితెరపై పంచ్‌లతో నవ్వులు పూయిస్తుంటాడు. ఢీ షోలో శేఖర్ మాస్టర్ చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడూ జబర్దస్త్ వేదికపైనా మెరుస్తూ ఉంటాడు. తాజాగా అలా వచ్చిన మాస్టర్‌పై హైపర్ ఆది పంచ్‌ల వర్షం కురిపించి నిజంగానే అనుమానాలు రేకెత్తేలా చేశాడు.

రోజా స్థానంలో..

రోజా స్థానంలో..

రాబోయే వారం జబర్దస్త్‌లో రోజా స్థానంలో శేఖర్ మాస్టర్ రాబోతోన్నాడు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. స్కిట్స్ మధ్యలో మాస్టర్ వేసిన పంచ్‌లు ఫుల్ వైరల్ అవుతున్నాయి. అన్నంటి కంటే ఎక్కువగా హైపర్ ఆది మాస్టర్‌పై వేసిన సెటైర్స్ ఓ రేంజ్‌లో పేలాయి.

ఈ సారి కొత్త అమ్మాయి..

ఈ సారి కొత్త అమ్మాయి..

ప్రతీ ఎపిసోడ్‌కు ఓ కొత్త అమ్మాయిను పరిచయం చేయడం హైపర్ ఆదికి అలవాటే. అయితే ప్రతీసారి యాంకర్, సీనియర్ నటి వంటి వారిని తీసుకొచ్చే ఆది ఈసారి అంతగా పరిచయం లేనటువంటి అమ్మాయిని తీసుకొచ్చారు. ఇక ఆమె కూడా రెచ్చిపోయి కౌంటర్లు వేసింది.

కౌంటర్లతో దాడి..

కౌంటర్లతో దాడి..

హైపర్ ఆది తీసుకొచ్చిన సదరు అమ్మాయి ఎంట్రీ ఇచ్చి.. ‘ఏమండీ.. ఆ ఇద్దర్నీ (మను, శేఖర్ మాస్టర్) చూశారా?? ఆయన దగ్గర ఆట ఉంది.. ఈయన దగ్గర పాట ఉంది'స్కిట్ ప్రారంభించింది. ఇక వెంటనే అందుకన్న హైపర్ ఆది.. ‘ఏమే.. మొగుడు మల్లెపూలు చేతికి చుట్టుకుని రెడీగా ఉంటే.. ఆయన దగ్గర ఆట ఉంది.. ఈయన దగ్గర పాట ఉంది అంటావా?? మరి నా దగ్గర ఏం లేదనా??' అంటూ డబుల్ మీనింగ్ కౌంటర్ వేశాడు.

ఆయన కన్ను పడితే..

ఆయన కన్ను పడితే..

పరాయి పురుషుడ్ని చూస్తే మీకు జెలాసీ అని మళ్లీ ఆమె అనడంతో.. ‘పర పురుషుడు అయితే ఓకేనే.. అక్కడ ఉన్నది శేఖర్ మాస్టర్.. పురుషులందు ఆ పురుషుడు వేరయా.. విశ్వదాభి రామా ఆయన కన్ను పడిందంటే నువ్ సేఫ్ కాదే భామా??' అంటూ మరో సెటైర్ వేశాడు.

Recommended Video

Jabardasth Comedian Hyper Aadi Demands High Remuneration For Bigg Boss Season 4
మరీ అలాంటి వాడా?

మరీ అలాంటి వాడా?

‘ఈ అందం అంతా అడవి కాచిన వెన్నెల కావాల్సిందేనా' అని సదరు మహిళ మరో డైలాగ్ చెప్పడంతో ‘నువ్ అలాంటి హింట్లు ఇవ్వకు.. అక్కడ ఆయన కాచుకుని కూర్చున్నాడు' అంటూ శేఖర్ మాస్టర్‌ని ఓ ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది. ఇక ఈ ప్రోమోను చూసిన వారికి నిజంగా శేఖర్ మాస్టర్ అలాంటివాడా? అనే అనుమానం రాకమానదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X