మీరంత జోకర్లు..సొల్లు కబుర్లు చెప్పకండి.. పంచ్ డైలాగ్స్‌తో హైపర్ ఆది
తెలుగు బుల్లితెరపై డ్యాన్స్‌కి సంబంధించి ఎన్నో రియాలిటీ షోలు ఉన్నా.. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ మాత్రం సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఏళ్లుగా ఎంతోమంది ప్రతిభావంతులను తెలుగు తెరకు పరిచయం చేసింది. ఇక్కడి నుంచి వెళ్లిన పలువురు డ్యాన్సర్లు స్టార్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. ఏళ్లుగా కొత్త కొత్త సీజన్స్‌తో , సరికొత్త హంగులతో ఈ షోని డిజైన్ చేస్తున్నారు నిర్వాహకులు. ప్రేక్షకులకు కూడా అదిరిపోయే టీఆర్పీలతో ఢీని నెంబర్ వన్ ప్లేస్‌లో నిలబెడుతున్నారు. తాజాగా ఢీ సెలబ్రెటీ స్పెషల్ 2 లేటెస్ట్ ప్రోమోని ఈటీవీ రిలీజ్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
కొద్దిరోజుల క్రితం ముగిసిన ఢీ సెలబ్రిటీ డ్యాన్స్ షో సీజన్ అద్భుతంగా ముగింపు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఢీ సెలబ్రిటీ స్పెషల్ -2 మొదలైంది. గత సీజన్‌లలో ప్రియమణి, సదా, పూర్ణ, శ్రీదేవి విజయ్ కుమార్ లాంటి సీనియర్ హీరోయిన్లు ఈ షోకు జడ్జిలుగా వ్యవహరించారు. వీరి బాటలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సిక ఈ షోకు జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు. ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ ముంబై భామ.. ఇప్పుడు బక్కచిక్కిపోయి, ఏమాత్రం ఛార్మింగ్ లేకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

వచ్చిరాని తెలుగులో హన్సిక నానా తిప్పలు పడి షోను బాగానే నెట్టుకొస్తుంది. ఢీ సెలబ్రెటీ స్పెషల్ 2కి నందూ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ , హైపర్ ఆది కామన్. ఇక ఈ షోకు జడ్జిగా ఏ హీరోయిన్ వస్తే ఆమె వెంటపడే హైపర్ ఆది , ఇప్పుడు హన్సిక చుట్టూ తిరగడం మొదలుపెట్టి పులిహోర కలుపుతున్నాడు. మొన్నామధ్య హైపర్ ఆదికి హన్సికకు గొడవ జరిగినట్లుగా చూపించడంతో ఆడియన్స్ కంగారుపడ్డారు. హన్సిక స్పీడు చూస్తుంటే ఆమె ఇకపై సినిమాలు వదిలేసి షోలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. జడ్జిగా మంచి ఫన్ ఇస్తూ బుల్లితెర ప్రేక్షలకు కనెక్ట్ అవుతున్నారు హన్సికా మోత్వాని.
ఇక ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 లేటెస్ట్ ప్రోమో విషయానికి వస్తే.. లేడీ టీమ్ లీడర్ల గెటప్ చూసి చాలా హ్యాపీగా ఉందబ్బా.. ఈ కోసం మేనేజర్లు ఫోన్ చేయగానే ఓకే చెప్పి మేనేజర్లను జోకర్లుగా చేశారు, తర్వాత డైరెక్టర్లకి మేం చాలా సూపర్, ఇరగదీస్తామని ఆయన్ను జోకర్‌ని చేశారు. చివరికి వీళ్లు జోకర్లు అయ్యారు అంటూ ఆది పంచ్‌లు వేస్తాడు. ఆ మాటలతో లేటీ టీమ్ లీడర్లు షాక్ అయి బొమ్మలా చూస్తుంటారు.
భోళే షావళి అద్భుతమైన పాటతో అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడు. ఆ వెంటనే రంభ ఊర్వశి మేనకలా దిగివచ్చింది హన్సిక అంటూ జడ్జిపై పాట పాడి ఆది పక్కకొచ్చి కూర్చొంటాడు. మమ్మీ కడుపులో ఉన్నప్పుడు సాంగ్‌ని హమ్ చేయమని పంపిస్తే స్టేజ్ వదిలి రావేంటీ అంటూ భోళేని ఆడుకుంటాడు ఆది. జాను జాను జాను అని పాటకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పడంతో జాను సిగ్గు పడుతూ , నవ్వేస్తుంది.
బృందావనంలోకి కృష్ణుడు వచ్చాడు అంటూ శోభిత చేసిన డ్యాన్స్ బాగుందని శేఖర్ మాస్టర్ మెచ్చుకుంటాడు. ఫిమేల్ టీం లీడర్లకు నవ్వించాలనే టాస్క్ ఇవ్వగా.. వారు రకరకాల ఫీట్లు చేసినా కొందరు నవ్వరు. మధ్యలో వారు చెప్పే డైలాగ్స్ నవ్వు తెప్పిస్తుంటాయి. చివరిలో నలుగురిని స్టేజ్‌పై నిలబెట్టి ఎవరు షోలో కంటిన్యూ అవ్వబోతున్నారు.. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారంటూ నందూ సస్పెన్స్‌లో పెడతాడు నందూ. ఇంతలో ప్రోమో ముగుస్తుంది. మరి ఢీ సెలబ్రెటీ స్పెషల్‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











