For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫేమస్ షోలోకి నిహారిక కొణిదెల: ఉన్నా వేస్టే అంటూ పరువు తీసిన హైపర్ ఆది

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది తమ వారసులను పరిచయం చేశారు. అందులో చాలా మంది హీరోలుగానే ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే, మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తన కుమార్తెను కూడా హీరోయిన్‌గా తీసుకు వచ్చారు. అయితే, ఆమె చాలా చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే నిహారిక వివాహం కూడా చేసుకుంది. అయితే, కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హైపర్ ఆది ఆమెపై అదిరిపోయే పంచ్‌లు వేశాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

   అలా ఎంట్రీ.. అప్పుడే ఫేమస్

  అలా ఎంట్రీ.. అప్పుడే ఫేమస్

  ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన 'ఢీ' అనే డ్యాన్స్ షోకు నిహారిక కొణిదెల యాంకరింగ్ చేయడం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. అక్కడ తనదైన హోస్టింగ్‌తో మెప్పించిన ఈ అమ్మాయి.. తర్వాత షార్ట్ ఫిల్మ్‌లు చేసింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్ స్థాపించి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, చేసింది.

  ఏమీ లేకుండా కనిపించిన అఖండ హీరోయిన్: చివర్లో మాత్రం హాట్ ట్విస్ట్

  పెళ్లి తర్వాత కూడా ఫుల్ బిజీ

  పెళ్లి తర్వాత కూడా ఫుల్ బిజీ


  నటిగా ఆరంభంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నిహారిక.. హీరోయిన్‌గా మాత్రం సక్సెస్ కాలేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అవడంతో కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలోనే చైతన్య జొన్నలగడ్డను ఆమె పెళ్లాడింది. అయితే, వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. అయితే, ఇప్పుడు నిహారిక నటిగా కాకుండా నిర్మాతగా ఫుల్ బిజీగా గడుపుతోంది.

   హలో వరల్డ్ అంటూ వచ్చేసి

  హలో వరల్డ్ అంటూ వచ్చేసి


  నిహారిక తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ప్రస్తుతం 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఆర్యన్ రాజేష్, నిత్యా శెట్టి, నిఖిల్, అనిల్ గీలా తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శివ సాయి వర్థన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. జీ5 సంస్థ ఈ సిరీస్‌కు నిర్మాణ భాగస్వామిగా ఉంది. దీన్ని అదే ఓటీటీలో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు.

  ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

  శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి

  శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి


  తెలుగులో తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుని ఫేమస్ అయిన షోలలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. దిగ్విజయంగా సాగిపోతోన్న ఈ కార్యక్రమంలోకి నిహారిక కొణిదెల నిర్మించిన 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. షోలోని సభ్యులతో కలిసి వీళ్లంతా తెగ సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

   చెక్ చేయడానికి వచ్చానని

  చెక్ చేయడానికి వచ్చానని


  వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నారు. దీనికి నిహారిక కొణిదెల గెస్టుగా వచ్చింది. వచ్చీ రావడమే ఆమె 'బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఆయన రేంజ్‌లో ఉన్నాయో లేదో చూడడానికి వచ్చాను' అని డైలాగ్ విసిరింది. ఆ తర్వాత చిరంజీవి పాటలకు కొందరు డ్యాన్స్‌లు చేసి అందరినీ అలరించారు.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

  హైపర్ ఆదికే పంచులు వేసి


  ఈ షోలో భాగంగా నిహారిక, హైపర్ ఆది కలిసి ఓ స్పెషల్ స్కిట్ చేశారు. అప్పుడు అతడు 'నువ్వు దాదా.. నేను ఏటీఎం' అని చెప్పాడు. దీనికి మెగా డాటర్ 'అందరినీ దా దా అని పిలిచేది నువ్వు. ఇప్పుడు దాదా అని పిలిచేది నన్నా' అని పంచ్ వేసింది. తర్వాత తెలుగులో హీరోగా చేస్తున్నానని ఆది అంటే.. నేను పాన్ ఇండియా మూవీ చేస్తున్నా అని నిహారిక అంటుంది. దీంతో ఆది ఏంటి జోకా అని అడిగాడు. అప్పుడామె 'ఫస్ట్ జోక్ వేసింది ఎవడు' అని గాలి తీసేసింది.

  నీకంటే నేను బెస్ట్ అంటూ

  నీకంటే నేను బెస్ట్ అంటూ


  అనంతరం హైపర్ ఆది 'భీమ్లా నాయక్‌లో సాంగ్ చేశాను. మామూలుగా లేదు' అంటాడు. దీనికి నిహారిక 'ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన దానికి కూడా అలా చెప్పుకుంటారా' అని అంటుంది. అప్పుడు ఆది 'నువ్వు సైరాలో చేసిన దానికంటే పెద్దదేలే' అంటూ పరువు తీసేశాడు. దీంతో నిహారిక పక్కకు వెళ్లి మరీ నవ్వుకుంది. దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Jabardasth Comedian Hyper Aadi Paticipated in Sridevi Drama Company Show. He Satires on Niharika Konidela in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X