twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఒక్క మాటతో పరువుతీసేశాడు.. శ్రీముఖి గాలితీసేసిన హైపర్ ఆది

    |

    దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా పండుగ ఏదైనా సరే సందడి మాత్రం బుల్లితెర మీదే ఉంటుంది. స్పెషల్ ఈవెంట్లతో చానెళ్లన్నీ హోరెత్తిస్తుంటాయి. పోటీ పడి మరీ ఈవెంట్లను ప్లాన్ చేస్తాయి. ఒక్కొక్క చానెల్ ఎంతో గ్రాండ్‌గా ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈటీవీలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లతో, స్టార్ మాలో సీరియల్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో, జీ తెలుగులో అదిరింది టీంలతో స్పెషల్ ఈవెంట్లు చేస్తుంటారు. అయితే ఈ మధ్య మాత్రం కొందరు ఆర్టిస్ట్‌లు అక్కడా ఇక్కడా కనిపిస్తూనే ఉన్నారు.

    ఎలాంటి నిబంధనలు లేవు..

    ఎలాంటి నిబంధనలు లేవు..

    ఒకప్పుడు తమ ఆర్టిస్ట్‌లు తమ చానెల్స్‌లోనే పర్ఫామ్ చేయాల్సి ఉంటుందనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివి లేనట్టు కనిపిస్తున్నాయి. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు అన్ని చానెల్స్‌లోని ఈవెంట్లలో కనిపిస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఇతర చానెల్స్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు.

    దసరా ఈవెంట్‌లో..

    దసరా ఈవెంట్‌లో..

    ఈటీవీ దసరా ఈవెంట్ అక్కా ఎవరే అతగాడులో నవదీప్ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రోజాకు బదులుగా సంగీత స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. అందులో హైపర్ ఆది పార్టిసిపేట్ చేయలేదు. సుధీర్ రష్మీ వర్షిణి వంటివారు ఆ ఈవెంట్‌లో రచ్చ చేశారు. మరో వైపు జీ తెలుగులో ప్రదీప్ శ్రీముఖిలపై స్పెషల్ ఈవెంట్ చేశారు. అయితే దీపావళికి మాత్రం ఈటీవీ మాత్రమే రంగంలోకి దిగింది.

    కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా..

    కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా..

    దీపావళికి ఈటీవీలో కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా అనే ఈవెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇందులో స్పెషల్‌గా అనూప్ రూబెన్స్‌ను పట్టుకొచ్చారు. అతడి పిల్లలతో ఓ ప్రోగ్రాం చేయించారు. మరీముఖ్యంగా సోనూ సూద్‌ను తీసుకొచ్చి ప్రోగ్రాంను ఓ లెవెల్‌కు తీసుకెళ్లారు.

    తాజాగా ప్రోమోలో..

    తాజాగా ప్రోమోలో..

    దసరా ఈవెంట్‌లో హైపర్ ఆది సందడిని మిస్ అయ్యారు. కానీ ఈ సారి మాత్రం దీపావళి ఈవెంట్‌లో డబుల్ డోస్ ఇచ్చేందుకు వచ్చాడు. ఈ ఈవెంట్‌కు యాంకరింగ్ చేస్తోన్న శ్రీముఖిని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. దసరా ఈవెంట్ ఆ చానెల్‌లో దీపావళి ఈవెంట్ ఈ చానెల్‌లో చేస్తున్నావ్ అంటూ ఓ పంచ్ వేశాడు.

    శ్రీముఖి భూచక్రం..

    శ్రీముఖి భూచక్రం..

    హైపర్ ఆది తన స్కిట్‌లో భాగంగా శ్రీముఖిపై పంచ్ వేశాడు. దీపావళి టపాసుల గురించి అంతా తెలుసా? అని రోహిణి ఆదిని అడుగుతుంది. అంతా తెలుసని ఆది బదులిస్తాడు. శ్రీముఖి భూచక్రం అని అంటాడు. అంటే శ్రీముకిఅంతటా తిరిగేస్తుందా అని రోహిణి మళ్లీ ప్రశ్నిస్తుంది.. అవును అన్ని షోలను కవర్ చేస్తోంది.. ఆ షో ఈ షోలకు తిరిగేస్తోంది కదా అని కౌంటర్ వేశాడు. దీంతో శ్రీముఖి తలపట్టేసుకుంది.

    English summary
    Hyper Aadi Satires On Sreemukhi In Kanaka mahalakshmi lucky draw.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X