హీరోయిన్ శ్రీలీల పరువు తీసేసిన హైపర్ ఆది.. తండ్రి డ్రింకింగ్ గురించి చెబుతూ ఘోరంగా!
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది బ్యూటిఫుల్ శ్రీలీల. పెళ్లి సందD చిత్రంతో మోస్ట్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినీ అవకాశాలు చెంత చేరాయి. మొత్తంగా శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె తండ్రి తాగడం గురించి మాట్లాడుతూ ఎవరు ఊహించని వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
అదే తొలి చిత్రం: టాలీవుడ్‌లో అతివేగంగా స్టార్ హీరోయిన్‌గా మారింది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరని చెప్పవచ్చు. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులు బాగా పాపులర్ అయిన ఈ బ్యూటి మొదటి సినిమా మాత్రం లవ్ యు ఇడియట్. అయితే ఈ సినిమా పలు కారణాలతో విడుదలకు నోచుకోలేదు. దీంతో ఆమె నటించిన రెండో మూవీ పెళ్లి సందDనే అంతా మొదటి మూవీ అనుకున్నారు.

అగ్ర హీరోల సరసన: ఇటీవల ఓటీటీలో విడుదలైన శ్రీలీల లవ్ యు ఇడియట్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక రవితేజ నటించిన ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఇందులో ఆమె నటనకు, డ్యాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు అగ్ర హీరోల సరనస నటించే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.
భారీగా డిమాండ్: శ్రీలీల ప్రస్తుతం రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో నటిస్తోంది. అలాగే మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28లో కూడా అవకాశం కొట్టేసింది. మొత్తంగా శ్రీలీల చేతిలో 7 భారీ చిత్రాలు ఉండటం విశేషంగా మారింది. స్టార్ హీరోయిన్ల తరహాలో బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తుందని టాక్.

ముఖ్య అతిథిగా: ఇదిలా ఉంటే తాజాగా ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరైంది బ్యూటిఫుల్ శ్రీలీల. ఈ ఫైనల్ ఎపిసోడ్ మే 31న ప్రసారం కానుంది. అయితే ఈ ఎపిసోడ్ లో శ్రీలీల డ్యాన్స్ చేసి అదరగొట్టింది. మీకు డ్యాన్సుకు ఎంత దగ్గరి సంబంధం ఉందని శ్రీలీలను యాంకర్ ప్రదీప్ అడిగాడు.
కాలుకు బొబ్బలు: ప్రదీప్ అడిగిన దానికి "నాకు మూడేళ్ల నుంచి డ్యాన్సుతో సంబంధం ఉంది. నాకు సరిగా నడవడం వచ్చో రాదో తెలీదు గానీ మా అమ్మ నన్ను డ్యాన్స్ క్లాస్ కు పంపించేది. అప్పుడు డ్యాన్స్ వల్ల కాలుకు ఇంతింత బొబ్బలు వచ్చినప్పుడు తిట్టుకునేదాన్ని. ఏంటమ్మా ఇది. టార్చరమ్మా. దీనికి బదులు తొందరగా స్కూల్ లో జాయిన్ అయిపోతానమ్మ అనేదాన్ని" అని శ్రీలీల తెలిపింది.

మూడేళ్లంటూ ఆది: తర్వాత అదే ప్రశ్నను హైపర్ ఆదిని అడిగాడు ప్రదీప్. "ఇది ఇప్పుడు కాదు. నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు" అంటూ సేమ్ శ్రీలీల చెప్పిన డైలాగే చెప్పి ఆమె పరువు తీశాడు హైపర్ ఆది. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వడం మొదలు పెట్టారు. దాన్నీ శ్రీలీల కూడా కామెడీగా తీసుకుని నవ్వుకుంది. కానీ, హైపర్ ఆది ఇంకా కంటిన్యూ చేశాడు.
పెగ్ ఏసుకోని: "మూడేళ్లప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పెట్టేవారు. నేర్చుకోరా డ్యాన్స్ డ్యాన్స్ అని. ఒళ్లంతా బొబ్బలు వచ్చేవి. నాన్న ఇంటికి వచ్చాకా.. స్కూలుకు వెళ్తాను నాన్న.. ఇది నా వల్ల ఈ డ్యాన్స్ కాదు అని చెప్పా. కానీ ఆయన ఒకటి (మందు పెగ్) ఏస్తాడు. ఊగుతాడు. అదే డ్యాన్స్ అంటాడు" అని ఘోరంగా స్పూఫ్ చేసి ఊహించనివిధంగా కామెడీ పండించాడు ఆది. దీంతో శ్రీలల నవ్వుతూనే ఉండిపోయింది.


Click it and Unblock the Notifications











