చిన్న పిల్లను వదలని శేఖర్ మాస్టర్.. ఆ హీరోయిన్లతో ఆ పని.. ఆది వ్యాఖ్యల కలకలం

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుర్రాళ్లు తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్లుగా మారిపోయారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి సెన్సేషన్ అయిన హైపర్ ఆది ఒకడు. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అలరిస్తోన్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో అవకాశాలను దక్కించుకుని సత్తా చాటాడు.

ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆది.. శేఖర్ మాస్టర్‌పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ అతడెమన్నాడో చూడండి!

Hyper Aadi Sensational Comments on Sekhar in Dhee Celebrity Special Show

జబర్ధస్త్‌గా ఆది ప్రయాణం: యూట్యూబ్‌లో స్ఫూఫ్ వీడియోలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో తనదైన టాలెంట్లను ప్రదర్శించి పాపులర్ అయ్యాడు. తర్వాత టీమ్ లీడర్‌గా మారిన ఆది.. అక్కడి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. అంతేకాదు, మరెన్నో షోలలోనూ భాగం అవుతూ బుల్లితెర స్టార్‌గా దూసుకుపోతూనే ఉన్నాడు.

మూవీల్లోనూ ఆల్‌రౌండర్: జబర్ధస్త్ షో వల్ల ఫేమస్ అయిన యంగ్ సెన్సేషన్ హైపర్ ఆదికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ తన శైలిని చూపించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అదే సమయంలో రైటర్‌గానూ సత్తా చాటుకున్నాడు. మొత్తానికి సినిమా రంగంలో కూడా ఆల్‌రౌండర్ అని హైపర్ ఆది పేరు తెచ్చుకున్నాడు.

Hyper Aadi Sensational Comments on Sekhar in Dhee Celebrity Special Show

ఆ షోలో తనదైన కామెడీ: చాలా ఏళ్ల పాటు టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. ఇప్పుడు 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రం యమ సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే, ఈటీవీలోనే ప్రసారం అవుతోన్న ఢీ 17వ సీజన్ 'ఢీ సెలెబ్రిటీ స్పెషల్' షోలోనూ మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో తనదైన కామెడీ గెటప్‌లతో నానా హంగామాను చేస్తున్నాడు.

రెట్రో స్పెషల్ ఎపిసోడ్‌: వచ్చే వారం ప్రసారం కాబోతున్న 'ఢీ' 17వ సీజన్ ఎపిసోడ్‌ రెట్రో స్పెషల్‌గా రాబోతుంది. ఇది గతంలో వాటి కంటే మరింత ఫన్నీగా జరగబోతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. ఇందులో జడ్జ్‌లు శేఖర్ మాస్టర్, ప్రణితతో పాటు అందరూ పాత కాలం నాటి బట్టల్లో కనిపించారు. హైపర్ ఆది మాత్రం దొంగగా గెటప్ వేసుకుని ఎంట్రీ ఇచ్చి యమ నవ్వించాడు.

అందరి ఫోన్లూ కొట్టేశాడు: 'ఢీ సెలెబ్రిటీ స్పెషల్' షోలో వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో హైపర్ ఆది దొంగగా వచ్చాడు. దీంతో హోస్ట్ నందూ 'ఇంతకీ ఇవాళ ఏంటీ గెటప్' అని ప్రశ్నించాడు. దీనికి ఆది 'దొంగ' అన్నాడు. అప్పుడు నందూ 'ఎవరినీ' అంటూ డబుల్ మీనింగ్‌లో అన్నాడు. ఆ తర్వాత హైపర్ ఆది సెట్స్‌లోని వాళ్లు అందరి మొబైల్స్‌ను దొంగిలించానని చూపించి షాకిచ్చాడు.

Hyper Aadi Sensational Comments on Sekhar in Dhee Celebrity Special Show

శేఖర్ మాస్టర్‌ చిట్టా విప్పి: బస్తాలో తాను దొంగిలించిన మొబైల్స్‌ను హైపర్ ఆది ఒక్కొక్కటిగా బయటకు తీసి చూపించారు. ఆ సమయంలోనే అందరి కంటే ముందుగా శేఖర్ మాస్టర్ ఫోన్‌ను తీశాడు. అప్పుడు అది ఓపెన్ చేసి చూపిస్తూ.. 'నందిత.. ప్రియమణి.. పూర్ణ.. ప్రణిత' అంటూ పేర్లు చదివాడు. అప్పుడు నందూ జడ్జ్ ప్రణిత వైపు చూపిస్తూ 'ఏంటి మన ప్రణిత గారేనా' అని ఆదిని అడిగాడు.

చిన్న పిల్లను అంటూ: హైపర్ ఆది చదివింది జడ్జ్ ప్రణిత పేరేనా అని నందూ అడగడంతో 'ఈ ప్రణిత ఆమె కాదు.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ప్రణిత. అయ్యా అయ్యా వద్దయ్యా.. చిన్న పిల్లయ్యా' అంటూ బ్రతిమాలాడు. మొత్తానికి శేఖర్ మాస్టర్ పరువును తీసేశాడు. ఇదంతా ఫన్నీగానే జరిగినా కొందరు మాత్రం సీరియస్‌ మేటర్ అనుకుంటున్నారు. ఇలా ఈ వీడియో యమ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X