For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాత్రైతే సీక్రెట్‌గా అక్కడికెళ్తాడు.. అంతా అయిపోయిందంటాడు: సుధీర్ బండారం బయటపెట్టిన హైపర్ ఆది

  |

  కమెడియన్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే మరెవరకీ సాధ్యం కాని రితిలో పాపులారిటీని సొంతం చేసుకుని.. తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ పర్సనాలిటీగా వెలుగొందుతున్నాడు లవర్ బాయ్ సుడిగాలి సుధీర్. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అతడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. దీంతో ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ బండారం బయట పెట్టాడు తోటి కమెడియన్ హైపర్ ఆది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  జబర్ధస్త్‌తో మారిన కెరీర్.. అన్నింట్లోనూ సత్తా

  జబర్ధస్త్‌తో మారిన కెరీర్.. అన్నింట్లోనూ సత్తా

  జబర్ధస్త్ అనే కామెడీ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు సుడిగాలి సుధీర్. తక్కువ సమయంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్న అతడు.. టీమ్ లీడర్‌గా ఎదిగిపోయాడు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. అదే సమయంలో మ్యాజిక్‌లు, డ్యాన్స్‌లు చేస్తూ.. పాటలు పాడుతూ ఆకట్టుకున్నాడు. ఇలా తనలోని అన్ని విద్యలను చూపిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

  రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం... ఫుల్ ఫేమస్

  రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం... ఫుల్ ఫేమస్

  తనలోని అద్భుతమైన టాలెంట్‌తో ఎంతగానో అలరిస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆర్టిస్టుగా కంటే రష్మీ గౌతమ్ ప్రియుడిగా విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న ప్రచారం జరగడం వల్ల ఈ జబర్ధస్త్ కమెడియన్ ఊహించని స్థాయిలో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, రష్మీని పెళ్లి చేసుకుంటున్నాడన్న ప్రచారం జరగడం వల్ల చాలా లాభ పడ్డాడు కూడా.

  వాళ్లతో లవ్ ట్రాకులు.. తనపై తానే పంచులు

  వాళ్లతో లవ్ ట్రాకులు.. తనపై తానే పంచులు

  సుదీర్ఘమైన తన కెరీర్‌లో సుడిగాలి సుధీర్ ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాడు. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో పలువురు స్టార్ యాంకర్లతో లవ్ ట్రాకులు నడుపుతున్నాడని కూడా పేరు తెచ్చుకున్నాడు. జబర్ధస్త్‌ స్కిట్లలోనూ అతడికి అదే తరహా పాత్రలు ఇస్తుండడంతో ప్లేబాయ్ అన్న బిరుదును అందుకున్నాడు.

  యాక్టర్‌గా సక్సెస్ అయినా.. హీరోగా ఫెయిల్

  యాక్టర్‌గా సక్సెస్ అయినా.. హీరోగా ఫెయిల్

  బుల్లితెరపై తనదైన శైలి టైమింగ్‌తో కామెడీని పండిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. సినిమాల్లోనూ అడుగెట్టాడు. ఈ క్రమంలోనే ‘రేసు గుర్రం', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', ‘సర్దార్ గబ్బర్ సింగ్', ‘బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇవన్నీ అతడికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి.

  సుధీర్ బండారం బయటపెట్టిన హైపర్ ఆది

  సుధీర్ బండారం బయటపెట్టిన హైపర్ ఆది


  ప్రస్తుతం సుధీర్.. జబర్ధస్త్‌తో పాటు ‘ఢీ' డ్యాన్స్ షోలోనూ చేస్తున్న విషయం తెలిసిందే. 13వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్‌ అనే టైటిల్‌తో సాగుతోంది. ఇందులో హైపర్ ఆదితో కలిసి మేల్ కంటెస్టెంట్ల టీమ్‌ను లీడ్ చేస్తున్నాడతను. ఇక, వచ్చే వారం జరగనున్న ఎపిసోడ్‌లో కొన్ని సీక్రెట్స్ లీక్ చేయడం ద్వారా సుడిగాలి సుధీర్ బండారం బయట పెట్టాడు తోటి టీమ్ లీడర్ హైపర్ ఆది.

  Actor Sree Vishnu Kick Starts His New Movie Under Reputed Banner
  రాత్రైతే సీక్రెట్‌గా వెళ్తాడు.. అయిపోయిందంటాడు

  రాత్రైతే సీక్రెట్‌గా వెళ్తాడు.. అయిపోయిందంటాడు

  షోలో భాగంగా హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. ఇంతలో యాంకర్ ప్రదీప్ కలుగజేసుకుని మరింతగా నవ్వులు పూయించాడు. ఈ సందర్బంగా ఆది మాట్లాడుతూ.. ‘మేము నిరుపేదలం. అన్నం కోసం వేచి చూస్తుంటాం. కానీ, సుధీర్ మాత్రం రాత్రి ఎటో వెళ్తొస్తాడు. వచ్చిన వెంటనే నేను తినేశా. మీరూ తినండి అంటాడు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  English summary
  Sudheer Anand Bayana, better known as Sudigali Sudheer, is an Indian actor, comedian, and television presenter who works in Telugu films and television. He has appeared in TV shows Jabardasth, Extra Jabardasth, Pove Pora and Dhee Ultimate Dance Show. He has secured 13th place in Hyderabad's Most Desirable Men on TV – for the year 2018.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X