బట్టలు విప్పిన అనసూయ.. పరువు తీసేలా హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు

హైపర్ ఆది.. తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులకు, సినీ ప్రియులకు, రాజకీయలపై మక్కువ చూపే వారికి అస్సలు పరిచయం అవసరం లేని పేరు ఇది. అంతలా ఇతడు అన్నింట్లోనూ ఉంటూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా అసాధారణమైన టాలెంట్‌తో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా చాలా కాలంగా వరుసగా సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆది.. అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్ బట్టలు విప్పిన దానిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలను మీరే చూడండి!

బుల్లితెరపై బిగ్ స్టార్‌గా
ఎంతో టాలెంట్ ఉన్న హైపర్ ఆది అనుకోకుండానే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో రైటర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. దీంతో టీమ్ లీడర్‌గా ఎదిగి సంచలనం అయిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడని అతడు.. బుల్లితెరపై బిగ్ స్టార్‌గా మారి హవాను చూపించాడు.

Hyper Aadi Setires On Anasuya Bharadwaj and Sekhar Master Video

ఇప్పుడు సినిమాలతో

జబర్ధస్త్ వల్ల స్టార్‌గా మారిన హైపర్ ఆది.. చాలానే అవకాశాలను అందుకున్నాడు. ఇలా ఇప్పటికే అతడు ఎన్నో చిత్రాల్లో నటించాడు. వాటిలో కూడా తనదైన మార్కును చూపిస్తోన్న అతడు.. ఏకధాటిగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్నాడు. దీనివల్ల బుల్లితెరపై వస్తున్న ఛాన్స్‌లను తగ్గించుకున్నాడు. ఫలితంగా హైపర్ ఆది వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తున్నాడు.

ఢీ షోలో ప్రత్యేకంగానే
సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్ షోలో సందడి చేసిన హైపర్ ఆది.. కొన్నేళ్ల నుంచి అందులో వర్క్ చేయడం లేదు. కానీ, ఇప్పుడు 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో మాత్రం యమ సందడి చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాడు. అలాగే, ఈటీవీలోనే ప్రసారం అవుతోన్న ఢీ 18వ సీజన్ 'ఢీ సెలెబ్రిటీ స్పెషల్' షోలోనూ తనదైన మార్కుతో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.

Hyper Aadi Setires On Anasuya Bharadwaj and Sekhar Master Video

వాళ్లపైనే పంచులేస్తూ

'ఢీ సెలెబ్రిటీ స్పెషల్ 2'లో స్టార్ హీరోయిన్ హన్సిక, శేఖర్ మాస్టర్‌, గణేష్ స్వామి మాస్టర్‌లు జడ్జ్‌లుగా వ్యవహరిస్తోన్నారు. దీంతో వాళ్లందరిపై హైపర్ ఆది స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. ముఖ్యంగా హన్సికతో రొమాంటిక్‌గా మాట్లాడుతూ, శేఖర్ మాస్టర్‌పై పంచులు వేస్తూ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇలా హైపర్ ఆది తనదైన కామెడీని పంచుతూ షోను సక్సెస్‌ఫుల్‌గా మారుస్తున్నాడు.

డ్రెస్సు విప్పడంపైన
'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్ డ్రెస్సులు విప్పేసి మరీ పోటీకి దిగడం అప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు దీనిపై హైపర్ ఆది పంచ్‌లు వేశాడు. 'మా దగ్గర బటన్ తీయమంటే సిగ్గుపడతారు. అక్కడ కోటు మొత్తం తీసేశారు' అంటూ ఆ ఘటనను గుర్తు చేశాడు.

అలా పరువు తీశాడు

శేఖర్ మాస్టర్‌ను ఉద్దేశించి హైపర్ ఆది కామెంట్స్ చేయడంతో అతడు స్టేజ్ మీదకు వచ్చాడు. అప్పుడు ఆ షోలో చేసినట్లుగానే జాకెట్ విప్పుతూ రచ్చ చేశాడు. తర్వాత నందూతో కలిసి ఆ సీన్‌ను రీక్రియేట్ చేశాడు. ఇలా శేఖర్ మాస్టర్, అనసూయ చేసిన ఆ రచ్చను పరోక్షంగా ప్రస్తావిస్తూ రెచ్చిపోయాడు. దీంతో ఈ ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X