For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రష్మీ, సుధీర్ మేటర్ లీక్ చేసిన హైపర్ ఆది: దూరమైంది అందుకే.. ఎంగేజ్‌మెంట్, పెళ్లి అంటూ!

  |

  గ్లామర్ ఫీల్డులో టాలెంట్ ఉంటేనే ఫేమస్ అవుతారన్న టాక్ ఉంది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. దీనికి కారణం ఏ విధంగానైనా ఇప్పుడు చాలా మంది పాపులర్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా లవ్ ట్రాకుల వల్ల తెలుగు బుల్లితెరపై ఎంతో మంది హైలైట్ అయ్యారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ జంట గురించే. జబర్ధస్త్‌లో కలిసి వీళ్లిద్దరూ దాదాపు తొమ్మిదేళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టాప్ కమెడియన్ హైపర్ ఆది.. సుధీర్, రష్మీ మధ్య ఉన్న రిలేషన్‌పై కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  అలా మొదలు.. కలిసిన జంట

  అలా మొదలు.. కలిసిన జంట

  రష్మీ గౌతమ్ నటిగా కెరీర్‌ను ప్రారంభించి.. ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇక, మ్యాజిక్‌లు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా మారిపోయాడు సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా వీళ్లిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి జంటగా మారారు.

  అషు రెడ్డి ప్రైవేటు భాగంలో పవన్ టాటూ: మరోసారి డ్రెస్ తీసేసి చూపించిన బ్యూటీ

  లవ్ ట్రాకుతో ఎనలేని గుర్తింపు

  లవ్ ట్రాకుతో ఎనలేని గుర్తింపు

  రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్.. ఆరంభంలో మామూలుగానే ఉన్నా కొన్నేళ్లకు ప్రేమికులు అన్న ట్యాగ్‌ను అందుకున్నారు. దీనికి కారణం వీళ్లిద్దరూ బుల్లితెరపై కనిపిస్తున్న తీరే అని చెప్పొచ్చు. దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ మొదలైంది. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు రావడంతో వీళ్లు జంటగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు.

  రష్మీ.. సుధీర్.. రెండు ఛానెళ్లు

  రష్మీ.. సుధీర్.. రెండు ఛానెళ్లు

  ఇంతకాలం ఒకే ఛానెల్‌లో, ఒకే షోలో కలిసి కనిపించిన రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ ఇటీవలే దూరం అయ్యారు. దీనికి కారణం అతడు ఈటీవీని వదిలేసి స్టార్ మాలోకి ఎంట్రీ ఇవ్వడమే. దీంతో ఈ బ్యూటీ ఒంటరి అయిపోయింది. అయితే, సుధీర్ హోస్ట్ చేయాల్సిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమాన్ని మాత్రం రష్మీనే నడిపిస్తోంది. మధ్యలో అతడిని గుర్తు చేసుకుంటోంది.

  హాట్ సెల్ఫీతో షాకిచ్చిన దేత్తడి హారిక: అసలు ఇది డ్రెస్సేనా.. చూస్తే అవాక్కవుతారు!

  హైపర్ ఆది గుర్తు చేస్తూ స్కిట్

  హైపర్ ఆది గుర్తు చేస్తూ స్కిట్

  జబర్ధస్త్ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో హైపర్ ఆది ఒకడు. చాలా కాలం పాటు ఆ షోలో సందడి చేసిన ఈ యంగ్ కమెడియన్.. ఇప్పుడు దానికి గ్యాప్ ఇచ్చాడు. అయితే, 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో మాత్రం తెగ రచ్చ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఈషా చావ్లాకు ప్రపోజ్ చేస్తూ రష్మీ, సుధీర్ జంటను గుర్తు చేశాడు.

  మేటర్ లీక్ చేసిన హైపర్ ఆది

  మేటర్ లీక్ చేసిన హైపర్ ఆది

  గతంలో ఓ పండుగ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌కు 9 రకాల గిఫ్టులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్నే రీ క్రియేట్ చేస్తూ ఇప్పుడు హైపర్ ఆది.. గెస్టుగా వచ్చిన హీరోయిన్ ఈషా చావ్లాకు 11 గిఫ్టులు ఇచ్చాడు. ఈ సందర్భంగా రష్మీని పిలిచిన అతడు.. 'అప్పుడు నువ్వు 9 గిఫ్టులు ఇచ్చావు గుర్తుందా. ఇప్పుడు అదే నేను ఈషాకు ఇవ్వబోతున్నా' అన్నాడు.

  బీచ్‌లో నిక్‌తో ప్రియాంక చోప్రా రొమాన్స్: వాళ్ల బట్టలు, ఫోజులు చూశారంటే!

  పెళ్లి, ఎంగేజ్‌మెంట్ అంటూ

  పెళ్లి, ఎంగేజ్‌మెంట్ అంటూ


  ఈ ఎపిసోడ్‌లో ఆది మాట్లాడుతూ.. 'సరిగ్గా మీ తొమ్మిదేళ్ల ప్రాసెస్ కరెక్టుగా జరిగుంటే మీకే ఎంగేజ్‌మెంట్, పెళ్లి అని 90 గిఫ్టులు వచ్చేవి' అన్నాడు. అప్పుడు రష్మీ 'నేను గిఫ్టులు ఇచ్చాను. అయినా మేము జనాలకు బోర్ కొట్టామా ఏంటి' అని ప్రశ్నించింది. దీనికి ఆది 'బోర్ కొట్టారనే కదా. ఇప్పుడు విడివిడిగా చేస్తున్నారు' అంటూ అసలు మేటర్ లీక్ చేస్తూ తెగ నవ్వించాడు.

  దిష్టి జోడీ.. ముష్టి జోడీ అంటూ

  దిష్టి జోడీ.. ముష్టి జోడీ అంటూ

  రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ జోడీపై హైపర్ ఆది సెటైర్లు వేయగానే.. పక్కనే ఉన్న ఇమాన్యూయేల్ 'ఏంటి ఆ జోడీని అంటున్నారు. వాళ్ల జోడీకి దిష్టి తగిలిద్ది తెలుసా' అని అన్నాడు. దీనికి హైపర్ ఆది 'దిష్టి జోడీ గురించి ముష్టి జోడీ మాట్లాడుతుందయ్యా' అంటూ పంచ్ పేల్చాడు. దీంతో ఇమ్యూ, వర్ష ముఖాలు వాడిపోయాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్ నవ్వులతో సాగిపోయింది.

  English summary
  Jabardasth Talented Comedian Hyper Aadi Punches on Sudigali Sudheer and Anchor Rashmi Gautam Relation in Sridevi Drama Company Latest Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X