ఆ యాంకర్‌తో హైపర్ ఆది ట్రాక్.. నిజంగానే చేస్తున్నానని ఒప్పుకున్న జబర్ధస్త్ కమెడియన్

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర హిస్టరీలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ రైటర్ కమ్ ఆర్టిస్టు తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని ఆది.. ఒకపక్క టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. దీంతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైపర్ ఆది ఓ యాంకర్‌తో నడుపుతున్న ట్రాక్‌ గురించి బయట పెట్టాడు. ఇంతకీ ఎవరా యాంకర్.? అసలు అతడేం చెప్పాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆది స్కిట్‌కు అదిరిపోయే రెస్పాన్స్

ఆది స్కిట్‌కు అదిరిపోయే రెస్పాన్స్

జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అన్ని టీమ్‌ల కంటే అతడికి ఎక్కువ సమయం కేటాయిస్తారు దర్శకులు. దీనికి కారణం ఆది స్కిట్లో ఉండే పంచులే. గుక్క తిప్పుకోకుండా అతడి నోటి వెంట నుంచి వచ్చే డైలాగులకు తెలుగు వారు ఫిదా అవుతున్నారు. అందుకే అతడి స్కిట్లకు యూట్యూబ్‌లో సైతం భారీ స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి.

సినిమాల్లోనూ మార్క్ చూపిస్తున్నాడు

సినిమాల్లోనూ మార్క్ చూపిస్తున్నాడు

హైపర్ ఆది తనకున్న టాలెంట్‌తో ఎన్నో సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే అతడు ఎన్నో సినిమాల్లో నటించాడు. అలాగే, మరికొన్నింటిని లైన్‌లో పెట్టేశాడు. ముఖ్యంగా వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ' సినిమాలో ఆది క్యారెక్టర్ చాలా సేపు ఉంటుంది. అలాగే, అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి'లో నటించడంతో పాటు డైలాగులు కూడా రాశాడు.

జబర్ధస్తే కాదు.. ఆ షో సక్సెస్‌కు కారకుడు

జబర్ధస్తే కాదు.. ఆ షో సక్సెస్‌కు కారకుడు

హైపర్ ఆది అంటే అందరికీ జబర్ధస్త్ షోనే గుర్తుకు వస్తుంది. కానీ, అతడు మరో షో సక్సెస్‌కు కూడా ప్రధాన కారకుడు అయ్యాడు. అదే.. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ డ్యాన్స్ షోగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఢీ'. ఈ షోలో యాంకర్ ప్రదీప్.. ఇతరులపై వేసే పంచులు రాసేది ఆదినే. ఈ విషయాన్ని సుడిగాలి సుధీర్ ఓ సారి బయట పెట్టాడు.

అక్కడ సక్సెస్ అయ్యాడు.. ఇక్కడికొచ్చాడు

ఇప్పటి వరకు జబర్ధస్త్ షోకు మాత్రమే టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్న హైపర్ ఆది.. ఇటీవల మరో షోలోకి కూడా ప్రవేశించాడు. ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘ఢీ' ఛాంపియన్స్‌కు అతడు టీమ్ లీడర్ అయ్యాడు. ఓ వైపు యూట్యూబ్ జోడీ సుధీర్, రష్మీ గౌతమ్ ఉండగా.. మరోవైపు వర్షిణితో కలిసి ఆది టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు.

ఆ యాంకర్‌తో హైపర్ ఆది ట్రాక్

ఆ యాంకర్‌తో హైపర్ ఆది ట్రాక్

‘ఢీ' షోలో హైపర్ ఆది.. యాంకర్ వర్షిణితో కలిసి సరికొత్త కామెడీని పంచుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతో కలిసి ‘సామజవరగమన' పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. అనంతరం దీనిపై మాట్లాడుతూ.. ‘మా ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తోంది. ఇది నిజంగానే ఫీల్ అయి చేశాం' అని వెల్లడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X