ఢీ కావాలో.. పవన్ కళ్యాణ్ కావాలో తేల్చుకో అన్నారు.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపుని అందుకొని ఇప్పుడు సినిమాల్లో కూడా చాలా బిజీగా మారుతున్న కమెడియన్స్ లలో హైపర్ ఆది ఒకరు. హైపర్ ఆది కామెడీ పంచ్ ల ద్వారానే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక ఇప్పటికి కూడా అతను పలు రియాలిటీ షోలలో కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ కావాలో ఢీ షో కావాలో తెలుసుకో అన్నారు అంటూ ఆ విషయాన్ని స్టేజి పైన క్లారిటీగా తెలియజేశాడు. ఆ వివరాలలోకి వెళితే..

పవన్ కళ్యాణ్ పై అభిమానం

పవన్ కళ్యాణ్ పై అభిమానం

హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచుగా పవన్ కళ్యాణ్ పై అతను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే వారికి కూడా కౌంటర్ ఇచ్చే విధంగా ముందుకు వస్తూ ఉంటాడు. ఎంతో అభిమానించడమే కాకుండా పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి కూడా సిద్ధమే అని చాలా సార్లు చెప్పాడు.

మాటలతో ఆశ్చర్యాన్ని కలిగించిన ఆది

మాటలతో ఆశ్చర్యాన్ని కలిగించిన ఆది

ఆ మధ్య పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిర్వహించిన సభలో హైపర్ ఆది మాట్లాడిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను మాటలతో పోగడమే కాకుండా ఆయనపై విమర్శలు చేసిన వారికి కూడా కౌంటర్ ఇస్తూ వచ్చాడు. హైపర్ ఆది మాట్లాడిన విధానానికి కూడా పవన్ కళ్యాణ్ ఎంతగానో సంతోషించారు.

ఎన్నికల్లో హైపర్ ఆది

ఎన్నికల్లో హైపర్ ఆది

వచ్చే ఎన్నికల్లో కూడా హైపర్ ఆది జనసేన తరపున ఎలక్షన్స్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. అతనికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వబోతున్నాడు అని కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం ఇంకా ఎవరూ కూడా పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక హైపర్ ఆది మాత్రం మరో వైపు రియాలిటీ షోలు అలాగే సినిమాలు ఉంటూ చాలా బిజీగా మారిపోయాడు.

సార్ ట్రైలర్ ఈవెంట్ లో..

సార్ ట్రైలర్ ఈవెంట్ లో..

ఇక రీసెంట్ గా సార్ సినిమా ట్రైలర్ లాంచ్ లో హైపర్ ఆది మాట్లాడే విధానం వైరల్ గా మారింది. ధనుష్ నటించిన సార్ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాలో ఒక మంచి కామెడీ పాత్రలో నటించిన ఆది నిర్మాత నాగ వంశీ గురించి కూడా తెలియజేశాడు. ఒకరోజు షూటింగ్లో ఉండగా అర్జెంటుగా ఒక విషయంలో ఆయనకు ఫోన్ చేశాను. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కావాలో ఢీ షో కావాలో తేల్చులో అని డైరెక్ట్ గా అన్నట్లుగా తెలియజేశాడు.

పవన్ కావాలా ఢీ కావాలా?

పవన్ కావాలా ఢీ కావాలా?

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో హైపర్ ఆది కూడా ఒక చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు ఢీ షో లో కూడా పాల్గొనాల్సి రావడంతో ఒకరోజు గ్యాప్ కావాలి అని హైపర్ ఆది నిర్మాత నాగ వంశి కి ఫోన్ చేసి అడిగాడట.

దీంతో ఆయన పవన్ కళ్యాణ్ కావాలో ఢీ షో కావాలో తేల్చుకో అని అన్నట్లుగా చెప్పడంతో.. నేను రెండు చేతులు జేబులో పెట్టుకొని సైలెంట్ గా షూటింగ్ కు వెళ్ళిపోయాను అని హైపర్ ఆది చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X