జబర్ధస్త్ కమెడియన్ల పాడు పనులు: అప్పుడందుకే వదిలేశారు.. గోవాలో కష్టమేనంటూ ఆది షాకింగ్ కామెంట్స్

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతున్నాయి. వాటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా కామెడీ ప్రధానంగా నడిచే కార్యక్రమంగా ప్రారంభమై.. దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది జబర్ధస్త్. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది తమ తమ టాలెంట్లను నిరూపించుకుని బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. టాప్ కమెడియన్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్ కమెడియన్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే..

అలా ఎంట్రీ ఇచ్చాడు.. దుమ్ము దులిపేశాడు

అలా ఎంట్రీ ఇచ్చాడు.. దుమ్ము దులిపేశాడు

కెరీర్ ఆరంభంలో సినిమా స్ఫూఫ్‌ల ద్వారా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసేవాడు ఆది. ఆ సమయంలోనే అదిరే అభి ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ టీమ్‌లో పని చేస్తున్న సమయంలోనే అతడిలోని అద్భుతమైన టాలెంట్‌ను గుర్తించిన షో నిర్వహకులు.. టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పటి నుంచి హైపర్ ఆది.. రైజింగ్ రాజుతో కలిసి దుమ్ము దులిపేస్తూనే ఉన్నాడు.

పంచులతో దండయాత్ర... అన్నీ తానవుతూ

పంచులతో దండయాత్ర... అన్నీ తానవుతూ


టీమ్ లీడర్ అయిన తర్వాత హైపర్ ఆది తనలోని సత్తాను నిరూపించుకుంటున్నాడు. పది నిమిషాల స్కిట్‌లో పదుల సంఖ్యలో పంచులు వేస్తూ ఎదుటి వాళ్లపై దండయాత్ర చేస్తున్నాడు.గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెబుతూ సత్తా చాటుతున్నాడతను. అంతేకాదు, స్కిట్‌లో అన్నీ తానై ఉంటూ ప్రతి దానిని వన్ మ్యాన్ షోగా మార్చేసుకుంటున్నాడీ యంగ్ కమెడియన్.

అందరినీ టార్గెట్ చేస్తూ.. నవ్వులు పంచుతూ

అందరినీ టార్గెట్ చేస్తూ.. నవ్వులు పంచుతూ

తన స్కిట్ల ద్వారా సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలను గుర్తు చేస్తుంటాడు హైపర్ ఆది. వాటిని వాడుకుంటూ టీమ్ సభ్యులపై ఎన్నో పంచులు వేస్తుంటాడు. అంతేకాదు, షోలో పని చేసే యాంకర్లు, మిగిలిన టీమ్ లీడర్లనూ వదిలి పెట్టడు. అలాగే, జబర్ధస్త్ జడ్జ్‌లపైనా కామెంట్లు చేస్తున్నాడు. ఇక, బయటి వాళ్లను టార్గెట్ చేయడం వల్ల కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నాడతను.

వాళ్లిద్దరి కేసుపై ఫోకస్... పరువు తీస్తూ అలా

వాళ్లిద్దరి కేసుపై ఫోకస్... పరువు తీస్తూ అలా


జబర్ధస్త్‌లో హైపర్ ఆది టీమ్‌లో పని చేస్తున్న ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఆ టీమ్‌లో సెకెండ్ లీడ్‌గా ఉన్న ఆర్టిస్టులు కావడంతో అప్పుడీ కేసు పెద్ద సంచలనం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరినీ టార్గెట్ చేస్తూ ఆది ఎన్నోసార్లు పంచులు వేశాడు. ఇప్పటికీ దీన్నే కంటిన్యూ చేస్తున్నాడు.

గోవాలో జబర్ధస్త్ కమెడియన్లు.. భార్యతో ఆది

గోవాలో జబర్ధస్త్ కమెడియన్లు.. భార్యతో ఆది

వచ్చే వారం ప్రసారం కానున్న జబర్ధస్త్‌లో హైపర్ ఆది.. రోహిణితో కలిసి జంటగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్లిద్దరూ అదిరిపోయే సాంగ్‌కు స్టెప్పులు వేశారు. ఆ తర్వాత రోహిణి.. 'ఏవండీ.. పిల్లలు ఎప్పటి నుంచో ట్రిప్పు తీసుకెళ్లు.. ట్రిప్పు తీసుకెళ్లు అని అడుగుతున్నారు. గోవా వెళ్దాం పదండి' అని అంటుంది. దీంతో వెంటనే ఓకే చెప్పిన హైపర్ ఆది అందరినీ తీసుకుని అక్కడ ప్రత్యేక్షం అవుతాడు.

Recommended Video

Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie

జాగ్రత్తగా ఉండండి.. మనది కాబట్టి వదిలారు

గోవాకు సంబంధించిన సన్నివేశాలు వచ్చిన సమయంలో హైపర్ ఆది.. దొరబాబు, పరదేశీపై పంచులు పేల్చాడు. స్కిట్‌లో భాగంగా మాట్లాడుతూ.. 'గోవా వచ్చాం.. జాగ్రత్తగా ఉండండి ఓకేనా.. అదంటే మన ఏరియా కాబట్టి చేతులు పట్టుకుంటే వదిలేశారు. ఇక్కడ అలా కాదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో స్కిట్‌ను ఆపేసి మరీ వాళ్లంతా నవ్వుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X