నా మీద దారుణంగా నెగిటివిటీ... ఎవ్వరూ పత్తిత్తులు కాదు... హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్

తన పంచ్‌లు, ప్రాసలతో తెలుగువారికి దగ్గరయ్యారు హైపర్ ఆది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి తన ప్రతిభతో సెలబ్రిటీగా మారారు ఆది. జబర్దస్త్‌తో పాపులరైన ఆయన ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై పలు ఛానెల్స్‌లో రకరకాల కార్యక్రమాలతో పాటు సినిమాల్లోనూ బిజీ అయ్యారు. నటుడిగా, రైటర్‌గా సేవలు అందిస్తున్నారు. తాజాగా ఢీ 2 కార్యక్రమంలో పాల్గొన్న హైపర్ ఆది తనపై ఫేక్ పోస్టులు, దుష్ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

హైపర్ ఆది - సుడిగాలిలో సుధీర్‌లలో బెస్ట్ ఎవరు?
గతంలో ఢీ డ్యాన్స్ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్ తర్వాత ఈ షోకు దూరమయ్యారు. సినిమాలు, ఇతర ఛానెల్స్‌లో బిజీ కావడంతో తిరిగి ఢీ షోకి సుధీర్ తిరిగి రావడంతో కంటెస్టెంట్స్ అంతా సంతోషించారు. కమ్ టూ ఢీ పార్టీ పేరుతో దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. ఇందులో హైపర్ ఆది- సుడిగాలి సుధీర్‌లలో ఎవరు బెస్ట్ ఎంటర్‌టైనర్ అనే కాంపీటిషన్ వచ్చింది. దీనిపై ఇంద్రజ మాట్లాడుతూ.. మా ఓపీనియన్స్ మేం పెట్టే ముందు మీ గురించి, ఆది గారి గురించి జనాలు ఏమనుకుంటున్నారో చూద్దామని ఓ వీడియో ప్లే చేశారు. అందులో మాకు ఆది ఎందుకు ఇష్టమో? సుధీర్ ఎందుకు ఇష్టమో రకరకాలుగా వారి అభిప్రాయాలను పంచుకున్నారు ప్రేక్షకులు.

Hyper Aadi Shocking Comments on Fake Posts and Praises Sudigali Sudheer

అందరికీ నెగిటివిటీ కామన్
తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన ఆది, సుధీర్‌లు ఒకరికొకరు హత్తుకుంటారు. నా మీద చూపించే ప్రేమకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇది జబర్దస్త్ ఫ్యామిలీ అని సుధీర్ అన్నారు. సాధారణ ప్రేక్షకుల్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే వాళ్లు చూసే విధానం వేరుగా ఉంటుంది, అది ఏ షో అయినా సరే. సోషల్ మీడియా తాలూకా వచ్చే నెగిటివ్, ఫేక్ కామెంట్స్, ఫేక్ పోస్టులు ఇవేవీ నేను పెద్దగా రిసీవ్ చేసుకోను. ఎందుకంటే నాకు తెలుసు.. ఇక్కడున్న చాలామందికి 95 శాతం పాజిటివిటీ ఉంటే ఒక 5 శాతం నెగిటివ్ ఉంటుంది అని హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆయనకి సపోర్ట్ చేసినందుకే
నేను సినిమాలు చేసుకుంటూ, టీవీ షోలు చేసుకుంటూ నాకు నచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా రాజకీయాల్లో సపోర్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా సోషల్ మీడియాలో నాకు ఖచ్చితంగా 10 శాతం నెగిటివిటీ ఉంటుంది. ఆ సాధారణ ప్రేక్షకులు చూసే వ్యూయర్‌షిప్‌నే ఎక్కువగా నమ్ముతాను. వాళ్లందరూ మేం చేసే మంచి కంటెంట్‌ని చేసినప్పుడు అది చూడటానికి వాళ్లందరూ వెయిటింగ్, అంత బాగా ఎంజాయ్ చేస్తూ రిసీవ్ చేసుకుంటారు. అలాంటి సాధారణ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అని ఆది అన్నారు.

ఆ కోటకి కింగ్ ఆయనే
ఆ తర్వాత ఆది- సుడిగాలి సుధీర్ కలిసి చేసిన కొన్ని స్కిట్స్‌ని స్క్రీన్‌పై ప్రదర్శించగా వారిద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఆ ఈవెంట్స్ అన్ని కూడా ఈటీవీలో 13, 14 ఈ రేటింగ్స్ నడిచిన రోజులవి. ఒక షో ఆ రేంజ్‌లో చూడటం అనేది వేరే లెవల్. మా అందరి కాంబినేషన్‌కి ఉన్న వాల్యూ అది. ఢీలో ఆ రోజులను నేను చాలా మిస్ అవుతున్నా. ఢీ కొత్త సీజన్ ఎప్పుడు స్టార్ట్ చేసినా మళ్లీ సుధీర్ బ్రదర్‌ని ఒకసారి ట్రై చేయమని అడిగేవాడిని. నేను సుధీర్ అన్నని ఎంత మిస్ అవుతున్నానో అన్నది ఒక విషయం అయితే నాకు తెలిసి ఢీలో సుధీర్ అన్నని ఎంతమంది మిస్ అవుతున్నారంటే ఆయన ఢీకి వస్తే మాత్రం .. ఢీ ఆయన కోట, అందులో నేను ఆయన తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను. ఢీ అనే కింగ్డమ్‌కి కింగ్ నువ్వే అంటూ సుధీర్‌ను మెచ్చుకున్నారు హైపర్ ఆది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఆది, సుధీర్‌ల ఫ్రెండ్ షిప్ ఇలాగే ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: hyper aadi sudigali sudheer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X