For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయిలతో హైపర్ ఆది పాడు పనులు: స్కిట్‌కు పిలిచి అలాంటి ప్రవర్తన.. అనసూయ కూడా అలాగే!

  |

  హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ కమెడియన్ దాదాపు ఐదారేళ్లుగా కడుపుబ్బా నవ్విస్తూ ముందుకు సాగుతున్నాడు. జబర్ధస్త్ షో ద్వారా పరిచయం అయినప్పటికీ.. మరికొన్ని కార్యక్రమాలు, స్పెషల్ ఈవెంట్లు, సినిమాల్లో సైతం తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. ఫలితంగా నెంబర్ వన్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది అమ్మాయిలతో వ్యవహరించిన తీరు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Jabardasth Comedian Hyper Aadi Demands High Remuneration For Bigg Boss Season 4
   అలా వచ్చాడు.. ప్రమోషన్ పొందాడు

  అలా వచ్చాడు.. ప్రమోషన్ పొందాడు

  కమెడియన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో డబ్‌స్మాష్ వీడియోలు, యూట్యూబ్‌లో సినిమా స్ఫూఫ్‌లు చేసేవాడు ఆది. అలా అప్పట్లో గుర్తింపును అందుకున్నాడు. ఆ సమయంలోనే అదిరే అభి సహాయంతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన అతడు.. ఆ తర్వాత ఆర్టిస్టుగానూ మెప్పించాడు. దీంతో అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు నిర్వహకులు.

   జబర్ధస్త్ షో అంటే హైపర్ ఆది అనేలా

  జబర్ధస్త్ షో అంటే హైపర్ ఆది అనేలా

  జబర్ధస్త్ షో దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రసారం అవుతోంది. ఇందులో ఎంతో మంది కమెడియన్లు తమదైన శైలి టైమింగ్‌తో సందడి చేస్తూ వచ్చారు. అయితే, హైపర్ ఆది వచ్చిన తర్వాత ప్రతి స్కిట్‌నూ వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు. గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ.. తన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. దీంతో అతడి కోసమే షోను చూసే వాళ్లు తయారైపోయారు.

   అతడిదే హవా... అందుకే రికార్డులు

  అతడిదే హవా... అందుకే రికార్డులు

  జబర్ధస్త్‌లోకి హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వకముందు చాలా మంది టీమ్ లీడర్లు హవాను చూపించారు. కానీ, అతడు ప్రవేశించిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎవరు ఎన్ని రకాల స్కిట్లు చేసినా అతడినే విజయం వరించేది. మరీ ముఖ్యంగా హైపర్ ఆది చేస్తున్న స్కిట్లే ఎప్పుడూ ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఇప్పటికే ఈ కమెడియన్ ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి.

  అందరినీ బుక్ చేస్తున్న హైపర్ ఆది

  అందరినీ బుక్ చేస్తున్న హైపర్ ఆది

  హైపర్ ఆది తన స్కిట్లలో ఎక్కువ భాగం సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. అలాగే, అద్భుతమైన టైమింగ్‌తో తన టీమ్ మెంబర్లపై పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టడు. ఇలా ఒకటే స్కిట్లో ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేలుస్తుంటాడు. ఈ కారణంగానే అవన్నీ ఫన్నీగా సాగుతాయి.

  అమ్మాయిలపై హైపర్ ఆది కామెంట్స్

  అమ్మాయిలపై హైపర్ ఆది కామెంట్స్

  జబర్ధస్త్‌లో తనదైన శైలి కామెడీతో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది.. వచ్చే వారం ప్రసారం కానున్న స్కిట్‌లోనూ అదరగొట్టేశాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో అతడిని బాగా హైలైట్ చేశారు. ఈ సారి ఆది స్కిట్‌లో మరో సెలెబ్రిటీ గెస్టుగా వచ్చింది. ఈ క్రమంలోనే అమ్మాయిలపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  చేస్తే ఒకలా.. చేయకపోతే ఇంకోలానా

  వచ్చే వారం స్కిట్‌లో భాగంగా కడుపు పండాలని భార్య అనగానే గోరింటాకు పెట్టుకో అని ఆది అంటాడు. ఆ తర్వాత పిల్లల గురించి మాట్లాడుతూ ఆమె ‘ఏమైందండీ.. ఏమైనా లోపమా' అని అంటుంది. దీనికి హైపర్ ఆది ‘ఏమీ చేయకపోతే లోపం అంటారు. ఏదైనా చేస్తేనేమో స్కిట్ కోసం పిలిచి ఇలా చేస్తారా అంటారు. ఇప్పుడేం చేయాలి' అంటూ సెటైరికల్‌గా కామెంట్స్ చేశాడు.

  అనసూయ కూడా అలాంటి మాటలు

  అనసూయ కూడా అలాంటి మాటలు

  హైపర్ ఆది డైలాగ్ చెప్పిన వెంటనే జబర్ధస్త్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ ‘స్కిట్ కోసం వచ్చి అమ్మాయిలు అందరితో చేసేశావా' అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా పంచ్ వేసింది. దీనికి అతడు ‘హే ఏంటండీ ఈమె కూడా అలాగే అంటుంది' అంటూ సిగ్గు పడిపోయాడు. దీంతో ఈ ప్రోమో వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Jabardasth Talented Comedian Hyper Aadi Shocking Comments on Girls in Jabardasth Skit. Then Anasuya Bharadwaj Punch on This Comedian
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X