Hyper Aadi: హీరోయిన్ ప్రియమణితో హైపర్ ఆది రిలేషన్.. షాకింగ్ విషయాలు చెప్పిన జబర్దస్త్ కమెడియన్
హైపర్ ఆది.. ఈ పేరు తెలియని, ఈయన పంచుల గురించి తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై అనేక షోలలో కనిపిస్తూ రచ్చ చేస్తున్న ఈయన ఢీ జోడీ షోలో జడ్జిగా చేసిన హీరోయిన్ ప్రియమణితో కలిసి చాలా క్లోజ్ గా ఉండేవారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ చాలా మంది కామెంట్లు చేశారు. అయితే హైపర్ ఆది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. యాంకర్ ఇదే ప్రశ్న అడిగారు. మీకు ప్రియమణికి గల రిలేషన్ ఏంటంటూ ప్రశ్నించగా.. షాకింగ్ సమాధానం చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ షోలో అదిరిపోయే డబులు మీనింగ్ డైలాగ్ పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ట్రెండింగ్ లోకి వచ్చేశాడు హైపర్ ఆది. ముఖ్యంగా ఆయన వేసే డబుల్ మీనింగ్ డైలాగ్ ల పంచులకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. బీటెక్ చేసిన ఈయన ఉద్యోగం చేయకుండా.. సినిమాలపై తనకు ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అలా జబర్దస్త్ షోలో అవకాశం రాగా తన టాలెంట్ తో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. కమెడియన్ స్థాయి నుంచి టీం లీడర్, యాంకర్ గా కూడా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న ఈయన ఒక్క జబర్దస్త్ లోనే కాకుండా అనేక రకాల షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, మరోవైపు జబర్దస్త్.. ఇంకా ఢీ జోడీ ఇవే కాకుండా అనేక ఈవెంట్లు చేసుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే ఢీ జోడీ షోలో చేసేటప్పుడు ఈయన జడ్జి ప్రియమణితో కలిసి చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఈయన ఆమెపై ఎలాంటి పంచులు వేసినా చాలా స్పోర్టివ్ గా తీసుకునేది ఆమె. అయితే ఇలా వీరిద్దరి మధ్య బంధం చాలా చక్కగా ఉండేది.
కానీ చాలా మంది వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఒకప్పుడు అనసూయతో రిలేషన్ అంటగట్టి.. ఆ తర్వాత ప్రియమణితోనూ హైపర్ ఆదికి అఫైర్ ఉందని పుకార్లు లేపారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా యాంకర్ నేరుగా.. హీరోయిన్ ప్రియమణికి మీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటని అడగ్గా.. షాక్ అయిన ఆది ఆ తర్వాత తేరుకుని అసలు విషయం చెప్పాడు. అంతా అనుకున్నట్లు తమ మధ్య తప్పుడు బంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.

హీరోయిన్ ప్రియమణి ఎవరితోనైనా చాలా క్లోజ్ గా ఉంటుందని.. పని చేసే వాళ్లందరితో ఫ్రెండ్లీగా ఉంటుందని వివరించాడు. అలాగే షోలో కామెడీ పండించడానికి అవసమరైన క్లోజ్ నెస్ తమ మధ్య ఉందని.. తానేసే పంచులకు రియాక్ట్ అవుతూ.. ఆమె కూడా రివర్స్ పంచులు వేసేదని తెలిపాడు. అలాగే సెట్లో తనను బావా బావా అని పిలుస్తూ.. సందడి చేసేదని అన్నారు. తనకు కూడా ఆమె అంటే ఇష్టమే అని... అంత పేరు, టాలెంట్, ఎక్స్ పీరియన్స్ ఉండి.. అందరితోనూ ఇలా కలిసిపోయే ప్రియమణి అంత గొప్ప నటిని తాను ఇప్పటి వరకు చూడలేదని అన్నాడు.


Click it and Unblock the Notifications










