జబర్ధస్త్ వర్ష బండారం బయటపెట్టిన ఆది: ఆమె అసలు స్వరూపం ఇదేనంటూ మేటర్ లీక్ చేసేశాడు
దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభమైన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలాంటి వారిలో తెలుగందం వర్ష ఒకరు. జబర్ధస్త్ స్కిట్లలో నటించడం ద్వారా ఫేమస్ అయిందామె. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ బండారం బయట పెట్టాడు హైపర్ ఆది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

బుల్లితెరపై అలా పరిచయం.. సినిమాల కోసం
యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది తెలుగందం వర్ష. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో ప్రముఖ చానెళ్లలో ప్రసారం అవుతోన్న 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లలో నటించింది. తద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక, అందంలోనూ ఆకట్టుకునే ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమా ఛాన్స్‌ల కోసం చూస్తోంది.

హైపర్ ఆది ద్వారా జబర్ధస్త్ ఎంట్రీ... పాపులర్
జబర్ధస్త్‌లో ప్రస్తుతం ఉన్న టాప్ కమెడియన్లలో హైపర్ ఆది ఒకడు. అతడి స్కిట్ ద్వారానే షోలోకి అడుగు పెట్టింది వర్ష. అతడితో పలు స్కిట్లలో కలిసి నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రాకింగ్ రాకేష్ టీమ్‌లో సభ్యురాలిగా అయింది. అప్పటి నుంచి ఇమ్మాన్యూయెల్‌కు జోడీగా చేస్తోంది. ఈ క్రమంలోనే అతడితో ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇస్తూ భారీ స్థాయిలో క్రేజ్‌ను అందుకుంది.

యాంకర్‌తో వివాదం... క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
గతంలో జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. ఓ అబ్బాయి మొబైల్‌ను విసిరికొట్టిన సంగతి తెలిసిందే. దానిని ఖండిస్తూ వర్ష రిలీజ్ చేసిన వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది. అందులో అనసూయను ఆమె బాగా విమర్శించింది. అది బాగా ట్రెండ్ అవుతుండడంతో మరోసారి రెస్పాండ్ అయిన వర్ష.. అప్పుడు తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చుకుంది.

అక్కడ యమ యాక్టివ్.. వార్తల్లో నిలుస్తోందిగా
జబర్ధస్త్ షో వల్ల దక్కిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని వర్ష గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోందీ తెలుగు బ్యూటీ.

స్కిన్ షోతో రెచ్చిపోతోంది.... అలాంటివి కూడా
తెలుగు అమ్మాయిలు గ్లామర్ షోలు చేయలేరు అన్న నానుడి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ జబర్ధస్త్ వర్ష రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను ఒక్కొక్కటిగా వదులుతూ కుర్రకారు గుండెల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. ఫలితంగా ఆమె పోస్టులు వైరల్ అవుతున్నాయి.

అలా.. వర్ష బండారం బయటపెట్టిన హైపర్ ఆది
జబర్ధస్త్‌లో పర్మినెంట్ సభ్యురాలైపోయిన వర్ష.. వరుస స్కిట్లతో మెపిస్తోంది. అదిరిపోయే అందంతో పాటు హస్కీ వాయిస్‌తో పంచులు వేస్తూ ఆకట్టుకుంటోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇలాంటి సమయంలో తనదైన పంచులతో ఎదుటి వారిపై దండయాత్ర చేసే హైపర్ ఆది.. వర్ష బండారం బయట పెట్టాడు. దీంతో ఏం చేయాలో తోచన ఆమె నోరెళ్లబెట్టేసింది.
Recommended Video

అసలు స్వరూపం ఇదేనంటూ మేటర్ లీక్ చేశాడు
జబర్ధస్త్‌లో లీడర్‌గా ఉన్న హైపర్ ఆది.. ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో కెవ్వు కార్తీక్ టీమ్ కోసం గెస్టుగా వచ్చాడు. ఇందులో భాగంగానే వర్షకు నాన్న క్యారెక్టర్ చేశాడు. స్కిట్‌లో ఆమె మాట్లాడుతూ 'నాన్న నా వెంట పది మంది పడుతున్నారు' అని అంటుంది. దీనికి 'మేకప్ అద్దడం.. ఇక్కడ పది మంది అరవడం వల్ల నీకలా అనిపిస్తుంది కానీ.. కరెక్టుగా చూస్తూ కష్టమే' అంటూ ఆమె గాలి తీసేశాడు ఆది.


Click it and Unblock the Notifications











