లవ్ వరకూ వెళ్లలేదు డైరెక్టుగా అదే.. ఛాన్స్ వస్తే మిస్ అవను: సినిమా ఫంక్షన్‌లో నోరు జారిన హైపర్ ఆది

టెలివిజన్ హిస్టరీలోనే అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోన్న ఈ షో.. దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తోంది. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అవడంతో పాటు కొందరు స్టార్లుగా మారిపోయారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. చాలా ఏళ్లుగా తన పంచులతో సత్తా చాటుతోన్న ఈ యంగ్ కమెడియన్.. తాజాగా జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో ప్రేమ వ్యవహారాల గురించి నోరు జారాడు. ఆ వివరాలు మీకోసం!

 అలా ఎంటర్ అయ్యాడు.. ఫుల్ పాపులర్

అలా ఎంటర్ అయ్యాడు.. ఫుల్ పాపులర్

డబ్‌స్మాష్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు ఆది. అలా అతడిలోని టాలెంట్‌ను గుర్తించిన అధిరే అభి.. జబర్ధస్త్‌లో నటించే అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కొన్ని పంచులు రాయాలని సూచించాడు. ఆ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ రాసే స్టేజ్‌కు ఎదిగిపోయాడతను. అలా ఆదిలోనే గణనీయమైన ఆదరణను అందుకుని ఫుల్ పాపులర్ అయిపోయాడీ కమెడియన్.

 షో వల్ల అతడికి.. అతడి వల్లే షోకు ప్లస్

షో వల్ల అతడికి.. అతడి వల్లే షోకు ప్లస్

తెలుగు బుల్లితెర హిస్టరీలోనే జబర్ధస్త్‌ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి ప్రేక్షకుల నుంచి లభిస్తోన్న ఆదరణే అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హైపర్ ఆది స్కిట్ల ద్వారానే షోకు మంచి రేటింగ్ వచ్చింది. కేవలం అతడి స్కిట్ల కోసమే షోను చూసే వారు చాలా మందే ఉన్నారు. గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తుండడం వల్లే అతడికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే... రికార్డుల ఆది

ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే... రికార్డుల ఆది

జబర్ధస్త్ స్కిట్లకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. హైపర్ ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత అతడి స్కిట్లే ప్రతి వారం నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా అతడి స్కిట్లకు మిలియన్‌కు పైగా వ్యూస్ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం అతడు ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఇలా ఎన్నో స్కిట్ల ద్వారా పలు రికార్డులను క్రియేట్ చేశాడీ జబర్ధస్త్ కమెడియన్.

అందరినీ టార్గెట్ చేస్తూ.. హైపర్ ఆది తీరు

అందరినీ టార్గెట్ చేస్తూ.. హైపర్ ఆది తీరు

హైపర్ ఆది తన స్కిట్లలో ఎక్కువ శాతం ట్రెండింగ్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. అలాగే, అద్భుతమైన టైమింగ్‌తో తన టీమ్ మెంబర్లపై పంచుల వర్షం కురిపిస్తుంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో జబర్ధస్త్ జడ్జ్ రోజా పాలిటిక్స్‌ను ప్రస్తావిస్తూ అదిరిపోయే పంచ్ పేల్చాడు.

 సినిమా ఫంక్షన్‌లో నోరు జారిన హైపర్ ఆది

సినిమా ఫంక్షన్‌లో నోరు జారిన హైపర్ ఆది

యాంకర్ ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఫంక్షన్‌కు చిత్ర యూనిట్‌తో పాటు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ప్రేమ గురించి మాట్లాడుతూ స్టేజ్‌పైనే నోరు జారాడు.

 లవ్ వరకూ వెళ్లలేదు.. కానీ డైరెక్టుగా అదే

లవ్ వరకూ వెళ్లలేదు.. కానీ డైరెక్టుగా అదే

ఈ సక్సెస్ మీట్‌లో హీరో ప్రదీప్‌ను ఉద్దేశించి ఎమోషనల్‌గా మాట్లాడాడు హైపర్ ఆది. స్పీచ్ ముగించి వెళ్లిపోతోన్న సమయంలో యాంకర్ శ్యామల అతడిని ఆపేసి 'ఆది గారూ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా' అని అతడి నుంచి పర్మీషన్ తీసుకున్న ఆమె 'మీకేమైనా లవ్ స్టోరీ ఉందా' అని ప్రశ్నించింది. దీనికి 'మనది లవ్ దాకా వెళ్లలేదు.. డైరెక్టుగా' అంటూ నోరు జారి నాలుక కరుచుకున్నాడు.

 ఛాన్స్ వస్తే మిస్ అవను అంటూ కామెంట్స్

ఛాన్స్ వస్తే మిస్ అవను అంటూ కామెంట్స్

తాను డబుల్ మీనింగ్ మాట్లాడానని అర్థం చేసుకున్న హైపర్ ఆది.. ఆ తర్వాత తేరుకుని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, సినిమాలో లాగే 30 రోజుల్లో ప్రేమించే అమ్మాయి ఎవరన్నా వస్తే కచ్చితంగా ఆ ఛాన్స్‌ను మాత్రం మిస్ అవను అని చెప్పాడు. అయితే, తనకు అంత సీన్ లేదని కూడా కామెంట్స్ చేశాడు. దీంతో ఈ స్పీచ్ వీడియో తెగ వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X