అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్.. జబర్ధస్త్‌ను వీడడం వెనుక రహస్యం ఇదేనా.!

By Manoj

తెలుగు బుల్లితెరపై చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేస్తూ తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ సెన్సేషన్.. తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. మరోవైపు, తన స్కిట్ల ద్వారా ఎంతో మందిపై పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన అవినాష్‌పై ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే, ఓ రహస్యాన్ని లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం.!

అలా ఎంటరైన ఆది.. ఇలా టీమ్ లీడర్‌గా

అలా ఎంటరైన ఆది.. ఇలా టీమ్ లీడర్‌గా

హైపర్ ఆది కెరీర్ ఆరంభంలో సినిమా వేషాల కోసం ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫన్నీ స్ఫూప్ వీడియోలు వదిలేవాడు. ఇలా అదిరే అభి దృష్టిలో పడి జబర్ధస్త్‌లో అవకాశం పొందాడు. అక్కడ తనలోని టాలెంట్‌ను చూపించి తక్కువ సమయంలోనే టీమ్ లీడర్‌ అయిపోయాడు. అప్పటి నుంచి ఆది వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

 పేరుకు తగ్గట్లే దూకుడు... అందుకే క్రేజ్

పేరుకు తగ్గట్లే దూకుడు... అందుకే క్రేజ్

ఆది స్కిట్ వస్తుందంటే చాలు ఎంతో మంది టీవీలకు అతుక్కు పోతుంటారు. దీనికి కారణం అతడు పంచులతో దండయాత్ర చేస్తుండడమే. జబర్ధస్త్‌లో తన అనే పేరుకు తగ్గట్లే పనితనం విషయంలో హైపర్‌గా కనిపిస్తుంటాడు. అందుకే అతడి స్కిట్లు పేలుతుంటాయి. గుక్క తిప్పుకోకుండా పంచులు పేల్చే ప్రత్యేకత ఉండబట్టే హైపర్ ఆదికి బయట విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.

రికార్డుల రారాజు.... ట్రెండ్ సెట్ చేశాడు

రికార్డుల రారాజు.... ట్రెండ్ సెట్ చేశాడు

బుల్లితెరపై చాలా కాలంగా హైపర్ ఆది రాకముందు... వచ్చిన తర్వాత అనే విధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు కారణం... అతడి స్కిట్లకు యూట్యూబ్‌లో వస్తున్న స్పందనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆది స్కిట్లు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అందుకే అతడు ఎప్పుడూ ట్రెండింగ్ పర్సన్‌గా ఉంటున్నాడు. అలాగే, టీఆర్పీకి కూడా బాగా ఉపయోగపడుతున్నాడు.

ఎవరినీ వదలని ఆది.. రోజాను కూడా

ఎవరినీ వదలని ఆది.. రోజాను కూడా

హైపర్ ఆది కేవలం మూస కొట్టుడు స్కిట్లను మాత్రమే చేయకుండా... సమాజంలో జరిగే ట్రెండింగ్ విషయాలను జోడిస్తూ స్క్రిప్టులు రాసుకుంటుంటాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్ కమెడియన్లు, యాంకర్లు, ఆఖరికి జడ్జ్‌లతో పాటు చాలా మంది సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ స్కిట్లు రాశాడు. దీనివల్ల గతంలో కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొన్నాడీ యంగ్ కమెడియన్.

 అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై ఆది పంచ్

అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై ఆది పంచ్

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ షో నాలుగో సీజన్ గత నెలలో ప్రారంభం అయింది. ఇందులో జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన శైలి కామెడీతో బిగ్ బాస్ హౌస్‌లో తెగ సందడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముక్కు అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2
జబర్ధస్త్‌ను వీడడం వెనుక రహస్యం ఇదే

జబర్ధస్త్‌ను వీడడం వెనుక రహస్యం ఇదే

స్కిట్‌లో భాగంగా వంట మాస్టర్ అయిన ఆదితో భార్య గెటప్ వేసిన శాంతి స్వరూప్ ‘ఎంత కాలమని ఇలా గరిటే పట్టుకుని వంటలు చేసుకుంటాం. కనీసం ఈఎంఐలో ఒక ఇల్లు తీసుకోవచ్చుగా' అని అంటాడు. దీనికి ‘వాటి గురించి మాట్లాడకు. ఇలా హౌస్‌లకు ఈఎంఐలు కట్టలేకే మనోడు ఒకడు వేరే హౌస్‌కు వెళుతున్నాడు తెలుసుగా' అంటూ పరోక్షంగా అవినాష్‌పై సెటైర్ వేశాడు ఆది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X