బయటపడ్డ సుడిగాలి సుధీర్ బండారం: మూడు రోజులు వాళ్లు.. నాలుగు రోజులు ఈయన ఏసుకోవడమే!
సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకున్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. కెరీర్ పరంగా ఎంత హై లెవెల్‌లో ఉన్నప్పటికీ.. వ్యక్తిగత విషయంలో మాత్రం ఈ యంగ్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా చేసిన కామెంట్లతో సుడిగాలి సుధీర్ బండారం బయట పడింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అన్నింట్లోనూ తోపే.. అందుకే ఆ పేరు
సుధీర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే తన టాలెంట్‌ను బయట పెట్టుకుని ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఒక్క కామెడీతోనే కాదు.. ఈవెంట్లలో మ్యాజిక్‌లు, డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ అన్నింట్లోనూ తోపే అని నిరూపించుకున్నాడు. తద్వారా బుల్లితెర ఆల్‌రౌండర్‌గా పేరొందాడు.

రష్మీతో ప్రేమాయణంతో మరింత ఫేమ్
ఎన్నో రకాల విద్యలను ప్రదర్శిస్తూ బుల్లితెరపై తిరుగులేని సెలెబ్రిటీగా వెలుగొందుతోన్న సుధీర్.. టాలెంట్ కంటే యాంకర్ రష్మీ గౌతమ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్న వార్తలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆమెను వివాహం కూడా చేసుకోబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు రొమాన్స్ చేయిస్తున్నారు.

వాళ్లతో ఎఫైర్లు.. హాట్ టాపిక్‌గా సుధీర్
రష్మీ గౌతమ్‌తో మాత్రమే కాదు.. సుదీర్ఘమైన కెరీర్‌లో పలువురు యాంకర్లతో సుధీర్ ప్రేమాయణం సాగిస్తున్నాడని జోరుగా వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ భీమనేనితో అతడు ప్రేమలో ఉన్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టడం.. దీనిపై ఇద్దరూ స్పందించడం జరిగాయి. స్కిట్లలో అతడికి ప్లేబాయ్ తరహా క్యారెక్టర్లు ఇస్తుండడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది.

ఇందులో హిట్.. అందులో ఫెయిల్యూర్
ఎంతో కాలంగా బుల్లితెరపై కామెడీని పంచుతూ.. నెంబర్ వన్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు సుడిగాలి సుధీర్. అదే సమయంలో 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇవన్నీ అతడికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, హీరోగా చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి.

బయటపడ్డ సుడిగాలి సుధీర్ బండారం
ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్ ప్రదర్శన ఇస్తుంది. అందులో అతడికి ప్రత్యేకమైన క్యారెక్టర్లు రాస్తుంటారు. అప్పుడప్పుడూ ఈ యంగ్ కమెడియన్ వేరే టీమ్‌లలో నటిస్తూ మెప్పిస్తుంటాడు. ఇందులో భాగంగానే వచ్చే గురువారం ప్రసారం కానున్న జబర్ధస్త్‌లో హైపర్ ఆది టీమ్‌లో స్పెషల్ రోల్ చేశాడు. దీంతో సుధీర్ బండారం బయట పడింది.

పిలిచి మరీ నువ్వు ఏసుకుంటున్నావు
స్కిట్‌లో భాగంగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఆ తర్వాత సైలెంట్‌గా ఉండిపోయాడు. దీంతో హైపర్ ఆది 'ఏంటన్నా.. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయావ్' అని ప్రశ్నించాడు. దీనికి 'బుధవారం ప్రదీప్ ఏసుకుంటాడు.. శుక్రవారం రాంప్రసాద్, గెటప్ శ్రీను ఆడుకుంటున్నారు.. ఇప్పుడు గురువారం ఖాళీగా ఉందామంటే పిలిచి మరీ నువ్వేసుకుంటున్నావ్' అని బదులిచ్చాడు.

నాలుగు రోజులు ఈయన ఏసుకోవడమే
సుధీర్ చెప్పిన సమాధానానికి 'మూడు రోజులు మేము ఏసుకునేదే చెబుతున్నావ్ కానీ.. మిగిలిన నాలుగు రోజులు నువ్వు ఏసుకునేది చెప్పవే' అంటూ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. ఆ తర్వాత అన్నా నీకేమైనా సిద్ధాంతాలున్నాయా అని ఆది అడగగా.. 'యుద్ధానికి సిద్ధమే.. పోవే వరకూ పోరాడాలి' అన్నాడు. దానికి ఆది మరో పంచ్ పేల్చాడు.


Click it and Unblock the Notifications











