వర్ష క్యారెక్టర్‌పై ఆది సంచలన వ్యాఖ్యలు: తేడాగా చూస్తూ అలాంటి మాటలతో దారుణంగా.. వీడియో వైరల్!
బుల్లితెరపై వచ్చే షోలలో కొన్నింటికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు.. ఆదరణ దక్కుతూ ఉంటుంది. అలాంటి వాటిలో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే జబర్ధస్త్ షో ఒకటి. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ ఉంది. అందుకే దీని ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్లు స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో పంచుల కింగ్ హైపర్ ఆది ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చి తక్కువ సమయంలోనే టాప్ టీమ్ లీడర్ అయ్యాడతను. ఇలాంటి సమయంలో జబర్ధస్త్ వర్షపై ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

అతడి వల్ల ఎంట్రీ.. టీమ్ లీడర్‌గా ప్రమోట్
సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యాడు హైపర్ ఆది. అతడిలోని టాలెంట్‌ను గుర్తించిన అదిరే అభి.. జబర్ధస్త్‌లోకి తీసుకొచ్చాడు. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశాడు. ఇలా చాలా తక్కువ సమయంలోనే తన ప్రతిభను బయట పెట్టుకున్నాడు. తద్వారా హైపర్ ఆదికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ వచ్చేసింది.

ఆది కోసమే... పంచులతో దండయాత్రలు
హైపర్ ఆది స్కిట్లు అంటేనే ఎంతో ఫేమస్. అతడి కోసమే జబర్ధస్త్‌ను చూసే పరిస్థితులను కల్పించుకున్నాడు. అంతలా సెలెబ్రిటీ కమెడియన్ అయిపోయాడతను. పది నిమిషాల స్కిట్‌లో తన టీమ్ సభ్యులపై పంచులతో దండయాత్రలు చేస్తూ రచ్చ చేస్తుంటాడు. చుట్టూ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నా.. వన్ మ్యాన్ షోగా స్కిట్‌ను నడుపుకుంటున్నాడు. తద్వారా హైలైట్ అవుతున్నాడు.

రికార్డుల కింగ్... ప్రతి వారం ట్రెండింగ్‌లోనే
జబర్ధస్త్ స్కిట్లకు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా హైపర్ ఆది టీమ్ లీడర్ అయిన తర్వాత అతడి స్కిట్లే ప్రతి వారం నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాయి. ఆ స్కిట్లకు మిలియన్‌కు పైగా వ్యూస్ వస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం అతడు ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఇలా ఎన్నో స్కిట్ల ద్వారా పలు రికార్డులను క్రియేట్ చేశాడు.

ప్రతి స్కిట్‌లో అమ్మాయిలు.. ఆమె కూడా
హైపర్ ఆది స్కిట్ అంటేనే కచ్చితంగా ఓ అమ్మాయి ఎంట్రీ ఉంటుందన్న టాక్ ఉంది. అంతలా అతడు ప్రతి దానిలోనూ ఎవరో ఒకరిని తీసుకొస్తుంటాడు. ఇప్పటికే ఎంతో మందిని బుల్లితెరకు పరిచయం చేశాడు. అయితే, వారిలో ఎవరూ పెద్దగా ఫేమస్ కాలేదు. కానీ, వర్ష అనే అమ్మాయి మాత్రం షోలో స్థిరపడిపోయింది. దీనికి కారణం హైపర్ ఆదినే అన్న విషయం అందరికీ తెలుసు.

డ్రామా కంపెనీలోకి ఎంటర్ అయిన హైపర్
'శ్రీదేవి డ్రామా కంపెనీ' పేరుతో ఈటీవీలో మరో కామెడీ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రది ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాన్ని మల్లెమాలనే రూపొందిస్తోంది. ఇందులో జబర్ధస్త్ వర్ష - ఇమాన్యూయేల్ జోడీని బాగా హైలైట్ చేస్తుంటారు. ఇక, వచ్చే వారం ఎపిసోడ్‌కు హైపర్ ఆది గెస్టుగా వచ్చి అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు.

వర్ష క్యారెక్టర్‌పై ఆది సంచలన వ్యాఖ్యలు
వచ్చే వారం ప్రసారం కానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు హైపర్ ఆది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రావడం రావడమే అతడు పంచుల వర్షం కురిపించాడు. అలాగే, అందరినీ గోవా తీసుకెళ్తున్నానని చెబుతూ ఒక్కో ఆర్టిస్టును పరిచయం చేశాడు. అదే సమయంలో వాళ్ల ఊళ్ల గొప్పదనం కూడా చెప్పమన్నాడు. ఈ సందర్భంలో వర్ష క్యారెక్టర్‌పై ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తేడాగా చూస్తూ.. అలాంటి మాటలతో రచ్చ
ఇందులో వర్ష మాట్లాడుతూ.. 'నేను చాలా బాగున్నానండీ.. ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి' అని అంది. ఆ వెంటనే ఆది 'పనిలో పనిగా కింద కామెంట్లు కూడా చూసుకోపోయావా.. ఆ కొత్తగా వచ్చిన లేడీ గెటప్ ఎవరు? చాలా బాగుందని అడుగుతున్నారు' అంటూ పైకి కిందకూ తేడాగా చూస్తూ ఆమె జెండర్‌పై కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కూడా వదిలాడు. దీంతో ఇది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











