లవర్‌తో బుక్కైన జబర్ధస్త్ వర్ష: పార్కులో ఒకరిపై ఒకరు.. వీడియో లీక్ అవడంతో కలకలం

గతంలో కంటే ఇప్పుడు తెలుగు బుల్లితెరపై ఆర్టిస్టులు పెరిగిపోతోన్నారు. పలు రకాల సాధనాలు ఉండడం వల్ల ఎంతో మంది టాలెంట్ బయటకు వస్తుండడంతో టెలివిజన్ రంగంలో పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తనదైన అందం, అభినయం, కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతోంది జబర్ధస్త్ వర్ష. ప్రస్తుతం ఎన్నో షోలలో భాగం అవుతూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న ఈ బ్యూటీ.. తాజాగా తన లవర్‌తో అడ్డంగా దొరికిపోయింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. ఆ వివరాలు మీరే చూడండి!

సీరియల్స్‌తో మంచి గుర్తింపు

సీరియల్స్‌తో మంచి గుర్తింపు

నటన మీద ఉన్న ఆసక్తితో ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వర్ష.. తనదైన అందంతో అందరి దృష్టిలో పడింది. దీంతో ఆమెకు 'అభిషేకం' అనే సీరియల్‌లో నటించే ఆఫర్ వచ్చింది. ఇందులో అదిరిపోయే నటనతో వర్ష సత్తా చాటింది. దీంతో ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసి ఈ భామ మంచి గుర్తింపును పొందింది.

జబర్ధస్త్ ఎంట్రీతో కెరీర్ స్పీడ్

జబర్ధస్త్ ఎంట్రీతో కెరీర్ స్పీడ్

బుల్లితెరపై వరుసగా సీరియళ్లు చేస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించిన వర్ష.. ఆ మధ్య జబర్ధస్త్ షోలో గెస్టు ఆర్టిస్టుగా వచ్చింది. ఆరంభంలోనే అందరినీ ఆకట్టుకున్న ఈ భామ.. కొంత కాలానికి ఆ షోలో పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి జబర్దస్త్ వర్షగా ఫుల్ పాపులర్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్‌ పరంగా దూసుకుపోతోంది.

ఆ షోనే కాదు.. వాటిలో కూడా

ఆ షోనే కాదు.. వాటిలో కూడా

జబర్ధస్త్‌ షో చాలా కాలంగా తనదైన రీతిలో మెప్పిస్తోన్న వర్ష.. బిజీగా ఉన్నా వరుసగా సీరియళ్లు చేస్తూనే వచ్చింది. అంతేకాదు, జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులకు మజాను పంచుతోంది. అలాగే, సినిమా నటిగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలను దక్కించుకున్నట్లు తెలిసింది.

ఇమ్మూతో లవ్.. పెళ్లి అంటూ

ఇమ్మూతో లవ్.. పెళ్లి అంటూ

జబర్ధస్త్ వర్ష పాపులర్ అవడానికి యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించడం కూడా ఒక కారణం అనే అనుకోవాలి. అతడితో ప్రేమలో ఉన్నట్లు కలరింగ్ ఇస్తోన్న ఈ భామ.. తరచూ కిస్‌లు, హగ్గులతో రెచ్చిపోతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరగడంతో ఈ ట్రాక్ నిజమే అని అంతా అనుకుంటోన్నారు.

ఆ షోలో పెర్ఫార్మెన్స్‌ ఇస్తూ

ఆ షోలో పెర్ఫార్మెన్స్‌ ఇస్తూ

జబర్ధస్త్ షోలో కేవలం కామెడీ స్కిట్లకు మాత్రమే పరిమితం అయిన వర్ష.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో మాత్రం తనలోని అన్ని టాలెంట్లను బయటకు తీసుకు వస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితమే తన గొంతుతో కొన్ని పాటలను ఆలపించింది. అలాగే, తరచూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు కూడా ఇస్తోంది. ఇలా తనదైన రీతిలో ఈ షోలో మెరిపిస్తూ మరింత హైలైట్ అవుతోంది.

లవర్‌తో దొరికిపోయిన వర్ష

లవర్‌తో దొరికిపోయిన వర్ష

వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎపిసోడ్ ప్రోమో రెండు రోజుల క్రితమే వచ్చింది. ఇందులో హైపర్ ఆది.. ఇమాన్యూయేల్‌తో 'వర్ష నీకు తెలియకుండా ఎవరితోనూ రీల్స్ చేయదు' అని ఓ వీడియో ప్లే చేయించాడు. అందులో మాత్రం వర్ష ఒక అబ్బాయితో పార్కులో కనిపించింది. అంతేకాదు, ఒకరి చేతిపై ఒకరు చేయి వేసుకుని రచ్చ రచ్చ చేసేశారు.

డీజే టిల్లు స్టైల్లో ప్రశ్నిస్తూనే

డీజే టిల్లు స్టైల్లో ప్రశ్నిస్తూనే

కొద్ది రోజులుగా వర్ష ఇలాంటి వీడియోలే చేస్తూ తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ చెప్తోంది. ఈ క్రమంలోనే ఈ వీడియో చేసింది. ఇక, ఇది చూసిన ఇమాన్యూయేల్ 'వర్ష.. ఎవుడాడు? వాడా రియల్ నేనా? లేకపోతే వీడా' అని డీజే టిల్లు స్టైల్లో ప్రశ్నించాడు. దీంతో వర్ష నా మీద డౌటా అనగా.. 'ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా వర్ష.. నీవల్లే ఇదంతా' అంటూ కామెడీని పంచాడు.

Photo Credits:etvteluguindia YouTube

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X