జబర్ధస్త్‌కు హైపర్ ఆది టీమ్ దూరం.. ఆరుకు బదులు ఐదు స్కిట్లు మాత్రమే.. వాళ్లు ఏం చెబుతున్నారంటే..

Recommended Video

Hyper Aadi Skit Not Shown In Popular Comedy Show Latest Episode || Filmibeat Telugu

జబర్ధస్త్‌కు హైపర్ ఆది టీమ్ దూరం.. ఆరుకు బదులు ఐదు స్కిట్లు మాత్రమే.. వాళ్లు ఏం చెబుతున్నారంటే..
హైపర్ ఆది.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్త్' షో ద్వారా ఈ యంగ్ కమెడియన్ వెలుగులోకి వచ్చాడు. మొదట వేరే టీమ్‌లో చేసినా ఆ తర్వాత తన టాలెంట్‌తో ఒక టీమ్‌కు కెప్టెన్ అయిపోయాడు. పంచులు, ప్రాసలతో స్కిట్లు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు అందరూ పొట్టలు పట్టుకుని రెడీగా ఉంటారు. అంతలా నవ్విస్తుంటాడు ఈ యంగ్ కమెడియన్. అలాంటిది ఆది జబర్ధస్త్ టీమ్‌కు దూరం అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..

జబర్ధస్త్‌లోకి ఎలా వచ్చాడంటే

జబర్ధస్త్‌లోకి ఎలా వచ్చాడంటే

హైపర్ ఆది జబర్దస్త్‌లోకి రావడానికి కారణం అదిరే అభినే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఆది కూడా చాలా సార్లు చెప్పాడు. మొదట అభి టీమ్‌లో మెంబర్‌గా చేసిన ఆది.. తన రైటింగ్ స్కిల్స్‌తో మెయిన్ కమెడియన్‌గా ఎదిగాడు. తర్వాత కొన్ని ప్రత్యేక షోలకు స్క్రిప్ట్ రాశాడు. అవి భారీ స్పందనను దక్కించుకున్నాయి. ఆ తర్వాత అతడి టాలెంట్‌ను గుర్తించిన జబర్ధస్త్ నిర్వహకులు అతడిని ఓ టీమ్‌కు కెప్టెన్ చేశారు.

సినిమాల్లోనూ మార్క్ చూపించుకున్నాడు

సినిమాల్లోనూ మార్క్ చూపించుకున్నాడు

ఆది స్కిట్లకు యూట్యూబ్‌లో ఎన్నో లక్షల వ్యూస్ వస్తుంటాయి. చాలా వారాలు ఆది స్కిట్లే యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉండేవి. దీని బట్టే అతడి పాపులారిటీ గురించి తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆదికి సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇందులో భాగంగానే పలు చిత్రాల్లో కూడా నటించాడు. అలాగే, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగులు కూడా రాశాడు. తక్కువ కాలంలోనే ఇంత పేరు సంపాదించుకున్న ఆది.. తన ఎదుగుదలకు ఎవరు కారణమో చెప్పేశాడు.

ఆది ఎదుగుదలకు కారణం ఎవరంటే...

ఆది ఎదుగుదలకు కారణం ఎవరంటే...

తాజాగా ఓ షోలో.. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అదిరే అభినే అని చెప్పాడు ఆది. ‘ఈ స్టేజ్‌ మీదే కాదు.. నేనీ స్థాయిలో ఉండడానికి అదిరే అభి అన్నే కారణం. ఆయనకు అందరి కంటే ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్న తర్వాత నన్ను ఆ రేంజ్‌లో ఎంకరేజ్ చేసింది మన డైరెక్టర్లు నితిన్ అన్నా, భరత్ అన్నా. వీళ్లు ముగ్గురు చేసిన సాయం వల్లే ఆది అంటే ఏంటో అందరికీ తెలిసింది' అని ఈ యంగ్ కమెడియన్ చెప్పుకొచ్చాడు.

జబర్ధస్త్‌కు ఆది టీమ్ దూరం

జబర్ధస్త్‌కు ఆది టీమ్ దూరం

గురువారం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అందరూ కలిసి టీవీల ముందుకు వచ్చేస్తుంటారు. దీనికి కారణం ఆరోజు జబర్దస్త్ ప్రోగ్రాం వస్తుంది కాబట్టి. ఈ వారం అలా చూస్తున్న వారికి షాక్ తగిలింది. ఎందుకంటే ఈ వారం హైపర్ ఆది స్కిట్ రాలేదు. దీంతో మిగిలిన ఐదు టీమ్‌లు మాత్రమే ప్రదర్శన చేశాయి. ఈ ప్రోగ్రాం ముగిసిన తర్వాత అందరి మదిలో ఆది టీమ్ ఎందుకు రాలేదనే అనుమానాలు కలిగాయి.

వాళ్లు ఏం చెబుతున్నారంటే...

వాళ్లు ఏం చెబుతున్నారంటే...

వాస్తవానికి హైపర్ ఆది స్కిట్‌ ఉంటుందని గత వారం ప్రోమోలు కూడా వేయలేదు. అయితే, గతంలో చాలా సార్లు ఇలానే జరిగింది. దీంతో స్కిట్ ఉంటుందని అనుకున్నారు. తీరా ప్రోగ్రాం చూస్తే లేదు. అయితే, జబర్ధస్త్ నిర్వహకులు మాత్రం ‘ఆది టీమ్ ఓ ఈవెంట్ చేయడం కోసం విదేశాలకు వెళ్లింది. అందుకే అతడి స్కిట్ రాలేదు. అంతకు మించి ఏమీ కారణం లేదు' అని చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారమైనా వాళ్ల స్కిట్ ఉంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X