తాళికట్టు ఆటలో ఇంతే.. మొగుడు పెళ్లాలుగా అనసూయ-హైపర్ ఆది, రష్మి-సుడిగాలి సుధీర్ కేక!

తెలుగులో పాపులరైన జబర్దస్త్ కామెడీ షో 300పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని విజయవంతంగా దూసుకెళుతోంది. ఫిబ్రవరి 14న ప్రసారమైన స్పెషల్ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇందులో హైపర్ ఆది-అనసూయ... సుడిగాలి సుధీర్-రష్మి భార్యాభర్తలు నటించారు.

ఆది లీడ్ చేసిన ఈ స్కిట్లో... అతడు వేసిన పంచులు ఓ రేంజిలో పేలాయి. అసూయ-ఆది, రష్మి-సుధీర్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన విశేషాలపై ఓ లుక్కేద్దాం.

ఇందులో భార్య భర్తల రిలేషన్ ఎక్కడ ఏడ్చిచచ్చింది?

ఇందులో భార్య భర్తల రిలేషన్ ఎక్కడ ఏడ్చిచచ్చింది?

ఏమోయ్.. అనసూయ.. అని పిలవడంపై ఆమె గుర్రుగా చూడటంతో ఆది బెంబేలెత్తిపోయి ‘అనసూయ గారు' అని పిలిచి ఆమెను శాంతపరుస్తాడు. ‘ఇందులో మొగుడు పెళ్లాల రిలేషన్ ఎక్కడ ఉంది? అదే యాంకర్ టీమ్ లీడర్ రిలేషన్' అంటూ ఆది స్కిట్‌లో తొలి పంచ్ వేశాడు.

అనసూయ ముద్దుగా పిలుస్తుంటే..

అనసూయ ముద్దుగా పిలుస్తుంటే..

ఏవండీ అని అనసూయ ముద్దుగా పిలుస్తుంటే... బాడీ అంతా ఏదోలా ఉంది. రామ్ గోపాల్ వర్మగారు అన్నమయ్య తీసినట్లు... రాఘవేంద్రరావుగారు రక్త చరిత్ర తీసినట్లు.. ఉందంటూ ఆది తనదైన డైలాగులతో అదరగొట్టాడు.

తాళి కట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతాం

తాళి కట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతాం

అనసూయ తన భుజంపై చేయి వేసి రొమాంటిక్‌గా ప్రవర్తించడంతో మై మరిచిపోయిన ఆది ‘‘జల్లికట్టు ఆటలో పెద్ద పెద్ద వాటినే లొంగదీసుకుంటున్నాం.. కానీ తాళి కట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతాం'' అని చెప్పిన డైలాగ్ ఈ స్కిట్లో హైలెట్ అయింది.

రష్మి మీద పంచులే పంచులు

రష్మి మీద పంచులే పంచులు

ఈ స్కిట్లో రష్మి-సుడిగాలి సుధీర్ భార్య భర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ సూపర్బ్ అనేలా ఉంది. ‘వడిసి పట్టు కాదు విడిచి పెట్టు'... ‘లోతు లోతు కాదు.. లేత లేత కూరగాయలు' అంటూ తెలుగు సరిగా మాట్లాడటం రాని రష్మిని ఆది ఆటపట్టించాడు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళ్లినా... ఈవిడ రూపంలో ఇక్కడే తిరుగుతున్నట్లు ఉంటుంది అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

సుడిగాలి సుధీర్‌ను బయటకు వదిలితే అంతే..

సుడిగాలి సుధీర్‌ను బయటకు వదిలితే అంతే..

‘‘సుడిగాలి సుధీర్‌ను రష్మి అలా కంట్రోల్‌లో పెట్టడం వల్లే అలా ఉన్నాడు... స్వేచ్ఛగా వదిలేస్తే ప్రతి సందును ఒక చైనా చేస్తాడు'' అంటూ స్కిట్లో మరింత హైపర్ చూపించి అలరించాడు ఆది.

images by courtesy

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X