Rashmi Gautam : రష్మి ప్రేమకి అగ్ని పరీక్ష .. టెన్షన్ పెట్టించిన స్టార్ కమెడియన్
కొత్త కొత్త రియాలిటీ షోలు, కార్యక్రమాలతో తెలుగు ఎంటర్‌టైన్మెంట్ సెక్టార్‌లో ఈటీవీ దూసుకెళ్తోంది. ఈ ఛానెల్‌ను కొన్నేళ్లుగా నిలబెడుతోన్న జబర్దస్త్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అన్న గుర్తింపు తెచ్చుకున్న ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. దాదాపుగా జబర్దస్త్‌లోని స్టాండప్ కమెడియన్లే ఈ షోను నడిపిస్తుండటంతో బాగానే వర్కవుట్ అవుతోంది. తాజాగా ఈ వారానికి సంబంధించి ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.
జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ బాగానే వర్కవుట్ అవుతోంది. అయితే కొన్ని ఎపిసోడ్స్ హిట్ అవుతుండగా.. మరికొన్ని మాత్రం డల్‌గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పండుగలు, ప్రత్యేక దినాలను పురస్కరించుకుని స్పెషల్ స్కిట్స్‌ను రూపొందిస్తున్నారు మేకర్స్. గత వారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చేసిన స్కిట్ బాగానే వర్కవుట్ అయ్యి నవ్వులు పూయించింది. ఈ వారం కూడా సరికొత్తగా రెడీ అయ్యింది.

ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కిరణ్ అబ్బవరం 'క' మూవీకి స్పూఫ్‌గా ఓ స్కిట్ చేశాడు హైపర్ ఆది . పోస్ట్‌మెన్ గెటప్‌లో పొట్టి నరేష్‌ను సైకిల్ ఎక్కించుకుని వస్తాడు ఆది. ఇంతలో ఒక లెటర్‌లో సాయంత్రం జరిగే జాతరలో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నామని దమ్ముంటే ఆ అమ్మాయిని కాపాడాలని ఉంటుంది. దీంతో ఆ అమ్మాయిని నేనే కాపాడతానని ఆది అంటాడు. అమ్మాయంటే ఎగబడతావ్ నువ్వు కాపాడతావా అని నరేష్ సెటైర్లు వేస్తాడు. జాతర లుక్ రావడానికి గాను ముద్దుగుమ్మలంతా కలర్ ఫుల్ డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీదకు వస్తారు. ఇంతలో ఐస్ కోన్స్ అందుకునేందుకు రష్మి రాగా.. నీకు వాడు ఎక్కడో చోట పొడుస్తాడని ఆది పంచ్‌లు విసురుతాడు.
ఇంతలో వాటర్ బాటిల్‌ని టేబుల్‌పై నిలబెట్టే టాస్క్ ఇస్తాడు ఆది. అది మిస్ అయితే కర్ర పుల్లతో కొడతానని చెప్పి బుల్లెట్ భాస్కర్‌ను కొట్టిస్తాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక భాస్కర్ నేను వెళ్లిపోతానని చెప్పగా ఆది అడ్డుకుంటాడు. తర్వాత ఆది బాటిల్‌ని నిలబెట్టేందుకు యత్నించగా పొట్టి నరేష్ కొడతాడు. ఎట్టకేలకు ఈ టాస్క్‌లో ఆది గెలవగా.. నరేష్‌ను టాస్క్ అని పిలవగా మనోడు స్టేజ్ దిగి పారిపోతాడు. తర్వాత కలర్ బాల్స్‌ని షూట్ చేసే గేమ్ ఆడతాడు ఆది. రష్మి చెప్పిన కలర్‌ని కొట్టలేక ఆమెకే గన్ ఇస్తాడు.
నువ్వు గనుక నేను చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్‌లో నీ లవ్ సక్సెస్ అవుతుందని పందెం కడతాడు ఆది. దీంతో అతను చెప్పిన బెలూన్‌ని రష్మి కాలుస్తుందో లేదోనని అంతా ఎగ్జయిటింగ్‌తో ఎదురుచూస్తూ ఉంటారు. మరి రష్మి టార్గెట్‌ను కొట్టిందో లేదా? జాతరలో కిడ్నాప్ కాబోయే ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని హైపర్ ఆది కాపాడాడో లేదో తెలియాలంటే డిసెంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోని మీరు కూడా చూసేయండి.


Click it and Unblock the Notifications











