రోజా-హైపర్ ఆది మళ్లీ కలిసారా? విభేదాలపై జబర్దస్త్ నటుడు క్లారిటీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ వేదికపై తన టైమింగ్, పంచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నవారిలో హైపర్ ఆది ఒకరు. ఆయన వేసే ప్రతి జోక్‌కు జడ్జ్‌గా ఉన్న రోజా సెల్వమణి నవ్వుతూ, ప్రశంసలు కురిపించేది. అయితే కాలక్రమేణా ఇద్దరూ తమ మార్గాల్లో బిజీ అయ్యారు. ఆది సినిమాలు, రాజకీయాలతో బిజీగా మారితే.. రోజా రాజకీయ బాధ్యతలతో షోకు దూరమయ్యారు. ఇదే సమయంలో స్టేజ్‌పై సరదాగా పంచ్‌లు వేసుకున్న వీరు, రాజకీయ రంగంలో మాత్రం పార్టీలకు మద్దతు ఇస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీనితో మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది. కానీ ఈ వార్తలపై తాజాగా హైపర్ ఆది తమ విభేదాలపై క్లారిటీ ఇచ్చారు.

జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది, నటి రోజాల మధ్య జరిగిన సరదా సంభాషణలు, ఆది వేసే పంచ్‌లకు రోజా ఇచ్చే రియాక్షన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ షోలో రోజా జడ్జీగా కీలక పాత్ర పోషించగా, హైపర్ ఆది క్రమంగా ఎదిగి స్టార్ కమెడియన్‌గా నిలిచాడు. నాగబాబు, రోజా వంటి జడ్జిల ప్రోత్సాహం ఆదిని మరోస్థాయికి తీసుకెళ్లింది. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి. రోజా రాజకీయాల్లో బిజీ అయిపోవడం, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్ల షోకు దూరమయ్యారు. మరోవైపు హైపర్ ఆది కూడా సినిమా అవకాశాలతో బిజీ అవుతూ జబర్దస్త్‌కు దూరమయ్యాడు.

Hyper Aadi Throwback Interview Clears Rift With Roja After Political Clash Rumors

ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ, అసలు మలుపు రాజకీయాల వల్ల వచ్చింది. రోజా వైసీపీ తరపున, హైపర్ ఆది జనసేనకు మద్దతుగా నిలవడంతో ఇద్దరూ వేర్వేరు రాజకీయ దారుల్లో నడిచారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ కామెంట్లు చేయడం, మాటల యుద్ధం నడవడం అభిమానుల్లో సందేహాలు రేకెత్తించింది. జబర్దస్త్ స్టేజ్‌పై ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకునే వీళ్లు, రాజకీయాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శించుకునే వారు. ఇది చూసి "ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయా?" అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా పోస్టులు కూడా ఈ విషయాన్ని మరింత హీట్ చేశాయి.

అయితే ఇటీవల హైపర్ ఆదికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓ ఫంక్షన్‌లో రోజా, హైపర్ ఆది కలుసుకోవడం ఈ కథకు కొత్త మలుపు తీసుకువచ్చింది. ఇద్దరూ చాలా కూల్‌గా మాట్లాడుకోవడం, పాత అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా మైక్ అందుకున్న హైపర్ ఆది చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. "నాకు రోజాగారికి ఎలాంటి శత్రుత్వం లేదు. ఈ విషయం రోజాగారికి కూడా తెలుసు. చాలా కాలం తర్వాత ఆమెను చూడటం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పడం ద్వారా అన్ని రూమర్స్‌కు చెక్ పెట్టాడు.

ఇంకా ఆయన చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాలు వేర్వేరు అని స్పష్టం చేయడం. "జబర్దస్త్‌లో ఉన్నప్పుడు మేమెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడుకోలేదు. రోజాగారు అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. మేము కమెడియన్లుగా ఎదగడంలో నాగబాబు గారి పాత్ర ఎంత ఉందో, రోజాగారి పాత్ర కూడా అంతే ఉంది" అని చెప్పడం ద్వారా ఆమెపై తన గౌరవాన్ని వెల్లడించాడు. ఇది కేవలం ఒక స్పీచ్ మాత్రమే కాకుండా, గతంలో వచ్చిన అన్ని అపోహలకు సమాధానం ఇచ్చినట్టుగా మారింది.

అలాగే రాజకీయాల విషయంలో కూడా ఆది చాలా క్లియర్‌గా మాట్లాడాడు. "రాజకీయంగా ఎవరి దారులు వారివి. అందరూ ఒకరికే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని పర్సనల్‌గా శత్రుత్వం పెంచుకోవాల్సిన పని లేదు" అని చెప్పడం గమనార్హం. ఈ మాటలు ప్రస్తుత కాలంలో రాజకీయ విభేదాలు వ్యక్తిగత సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక రోజా విషయానికి వస్తే, ఆమె కూడా గతంలో చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ రాజకీయ పరంగానే ఉన్నాయని చాలామంది విశ్లేషిస్తున్నారు. జబర్దస్త్ సమయంలో ఆదిని ప్రశంసించిన రోజా, బయట రాజకీయ వేదికపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా అన్నదే ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని ఆది కూడా తన మాటల్లో వెల్లడించడం గమనించదగ్గ విషయం. మొత్తంగా రోజా - హైపర్ ఆది మధ్య పెద్దగా ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఈ సంఘటన తేల్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X