Bigg Boss Telugu: ఏడు వారాలు అమ్మాయిలే ఎలిమినేట్ అయింది అందుకేనట, ఫ్లోలో నిజం చెప్పేసిన హైపర్ ఆది!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో మొదలు కాబోతుంది అని తెలిసినప్పటి బుల్లితెర ప్రేక్షకులు అంతా ఫుల్ ఎగ్జైంటింగ్ గా ఫీల్ అయ్యారు. ఇక బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంతా రాత్రి 9 కాగానే వచ్చి టీవీల ముందు కూర్చుంటున్నారు. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షో.. పదకొండో వారంలోకి అడుగు పెట్టబోతుంది. ఈక్రమంలోనే సండే ఫండే, ముఖ్యంగా దివాళి సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ నిర్వహించబోతున్నారు. ఈక్రమంలోనే అదిరిపోయే గెస్టులను స్టేజీ మీదకు తీసుకు వచ్చారు బిగ్ బాస్.
ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా.. బిగ్ బాస్ స్టేజీపైకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు స్నేహితులు కూడా వచ్చారు. ఇదంతా మనం మొదటి ప్రమోలో చూడగా.. ఈ షోకు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదల అయింది. అందులో ముందుగా ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఆ తర్వాతా క్యూట్ హీరోయిన్ శ్రీలీల, పంజా వైష్ణవ్ తేజ్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో ఆదికేశవ సినిమా రాబోతుండగా.. ఆ ప్రమోషన్స్ లో భాగంగానే ఈషోకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే శ్రీలలతో కలిసి నాగార్జున ఓ పాటకు స్టెప్పులు వేశారు. వైష్ణవ్ తేజ కూడా వారితో కాలు కలిపాడు. అలాగే వారి సినిమా ఆదికేశ గురించి నాగార్జున కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇది టెంపుల్ కు సంబంధించిన కథ అంటూనే, మరి త్రిశూలం ఎందుకు ఉందని అనగా.. అంతా శివుడే కాబట్టి అలా పెట్టామని వైష్ణవ్ తేజ్ వివరించాడు. బిగ్ బాస్ లో ఎలాగైతే బిగ్ బాస్ ఉన్నారో.. అలాగో ఐ యామ్ ద బిగ్ బాస్ అంటూ కన్నుకొట్టింది. దీనికి నాగ్ అవును ప్రోమోలో కూడా అన్ని సార్లు కన్ను కొట్టావ్ అని అడిగాడు. అందుకు అంతా నవ్వారు. ఇక ఆ తర్వాత అమ్మాయిని కాస్త డామినేట్ చేస్తారని చెప్పుకొచ్చింది. దీనికి నాగ్ ఏదో పంచ్ వేయగా అంతా నవ్వుకున్నారు.
అందుకే అమ్మాయిలంతా ఎలిమినేట్ అయ్యారు..!
ఇదంతా అయ్యాక వైష్ణవ్ తేజ్ కు.. శ్రీలీల నచ్చింది కదా అని అడగ్గా.. హీరోయిన్ షాకైంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యామ్ లలో ఎవరు ఇష్టం అని అడగ్గా ఆన్సర్ చెప్పలేకపోయారు హీరోహీరోయిన్లు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కల్యాణ్ అనగా... శ్రీలీల ఇంపాజిబుల్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక ఆ తర్వాత క్రికెట్ బ్యాట్ తో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. మన్మధుడు సినిమాలో కూడా నాగార్జున గారికి ఫస్ట్ ఆఫ్ లో అమ్మాయిలు అంటే పడదు.. అలాగే ఈ సీజన్ లో కూడా ఫస్ట్ ఆఫ్ లో అమ్మాయిలంతా ఎలిమినేట్ అయ్యారని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ లో అద్భుతమైన బౌలర్ టేస్తీ తేజ అని.. ఆయన వేసిన సిల్లీ నామినేషన్ రీజన్స్ బాల్ వల్ల ఆరుగురు ఎలిమినేట్ అయ్యారని హైపర్ ఆది కామెంట్ చేశాడు. అలాంటి తేజాగాడిని అదే బాల్ తో నువ్వు ఎలిమినేట్ చేశావు చూడన్నా అది అద్భుతం అంటూ శివాజికి చెప్పగా అంతా ఘొల్లుమన్నారు. మొక్క మీద కాకుండా రతికా అక్క మీద కాన్ సంట్రేషన్ చేస్తే మాకు భయమేసిందంటూ రైతుబిడ్డను ఆట పట్టించాడు. అలాగే అమర్ ను చూస్తే... నువ్వు నీకోసం పుట్టలేదురా శోభాను కెప్టెన్ చేయడానికి పుట్టావు తిప్పరా మీసం అంటూ పంచులు వేశాడు.
యావర్ ను చూస్తుంటే అమ్రిష్ పురి మళ్లీ తెలుగులో పుట్టాడని అనిపించిందని, అర్జున్ హైట్ ను చూసి బిగ్ బాస్ ఏ టాస్క్ లు ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడంటూ పైహర్ ఆది కామెడీ చేశాడు. నేనేం చేయలేదు శోభా, నాకొద్దు టాటూ, నాకేయండి ఓటు అంటూ టేస్టీ తేజ కలవరిస్తున్నాడంటూ శోభాను ఆట పట్టించాడు. ఇక ఆ తర్వాత శోభా తండ్రితో పాటు ఆమె ప్రియుడు కూడా బిగ్ బాస్ స్టేజీపై అడుగు పెట్టాడు. ఐ లవ్ యూ కూడా చెప్పగా.. అంతా మురిసిపోయారు.


Click it and Unblock the Notifications











