twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేక్ స్మైల్ ఇవ్వాలా? ఎన్నికల ఫలితాలపై యాంకర్ రష్మి సంచలన కామెంట్

    |

    Recommended Video

    Rashmi Gautam Interesting Reply To A Netizen On BJP Win || Filmibeat Telugu

    2019 ఎన్నికల్లో మరోసారి 'నమో' మంత్రం మారుమ్రోగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటి తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నవారంతా దేశ వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు.

    మోదీని అధికారంలోకి తెచ్చిన ప్రజలు, మోదీని వ్యతిరేకిస్తున్న వారు.... ఈ ఫలితాలపై సినీ సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారనే విషయాన్ని ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్లు తమ ఒపీనియన్ వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. అయితే కొందరు మౌనంగా ఉండటంతో స్పందించాలంటూ నెటిజన్ల నుంచి ఒత్తిడి పెరిగుతోంది. ఈ క్రమంలో యాంకర్ రష్మి తదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

    ఫేక్ స్మైల్ ఇవ్వాలా?

    ఫేక్ స్మైల్ ఇవ్వాలా?

    బీజేపీ అధికారంలోకి రావడంపై మీ అభిప్రాయం ఏమిటి? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా రష్మి తనదైన శైలిలో స్పందించారు. ‘‘ప్రజలు ఎన్నుకున్నారు. అదే ప్రజలు నా లాంటి వారి నుంచి సోషల్ మీడియాలో వారికి అనుకూలంగా ఒక పోస్ట్ పెట్టాలని ఆశిస్తున్నారు. వారి కోసం నేను ఒక ఫేక్ స్మైల్ ఇవ్వాలేమో, దానికి కట్టుబడి ఉండాలేమో''... అంటూ రష్మి వ్యాఖ్యానించారు.

    వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేకనే...

    వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేకనే...

    రష్మి ఇచ్చిన రిప్లై చూస్తుంటే... తాను ఒక పార్టీకి చెందిన వ్యక్తి అని కానీ, మద్దతుదారు అనే ముద్ర పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీని వల్ల అనవసర వివాదాల్లో ఇరుక్కుంటాననే సందేహంలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.

    పొలిటికల్ అంశాలకు దూరంగా రష్మి

    పొలిటికల్ అంశాలకు దూరంగా రష్మి

    పొలిటికల్ అంశాలకు రష్మి మొదటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకే గురువారం విడుదలైన ఫలితాలపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీని, ఏపీలో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డిని అభినందించే ప్రయత్నం చేయలేదు. రష్మి ఎక్కువగా స్త్రీవాదానికి సంబంధించిన అంశాలు చర్చించడానికి ఆసక్తి చూపుతారనే విషయం తెలిసిందే.

    English summary
    "Well yes i do have political views. People hav chosen and it’s the same people who expect people like me to post pics and give fake smiles so I’ll stick to that and keep my opinions to myself." Rashmi gautam tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X