రష్మి, సుధీర్‌ కెమిస్ట్రీ చూస్తే.. కళ్లలో నుంచి రక్తమే... సుమతో శ్రీముఖి హాట్ కామెంట్

యాంకర్ సుమ ఎలాంటి కార్యక్రమాని నిర్వహించినా.. ఎలాంటి షోకు హోస్ట్ చేసినా నవ్వులతో నిండిపోవాల్సిందే. తాజా తాను నిర్వహించే ఓ షోకు శ్రీముఖి, లాస్య, విష్ణుప్రియ, అవినాష్‌ను ఆహ్వానించింది. ఆ కార్యక్రమంలో సుమ అడిగిన చిలిపి ప్రశ్నలకు శ్రీముఖితోపాటు అందరూ చాలా ఆసక్తికరమైన జవాబులిచ్చారు. శ్రీముఖి, సుమ మధ్య సాగిన ఆసక్తికరమైన సంభాషణ ఇలా..

సుమను చూసే టెలివిజన్ వైపు

సుమను చూసే టెలివిజన్ వైపు

క్యాష్ షోలోకి వచ్చిన శ్రీముఖిని ప్రశంసలతో ముంచెత్తారు. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో చోటు దక్కినందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ నాకు సినిమాలు చేయడం ఇష్టం లేదు. టెలివిజన్ షోలలో హీరో, హీరోయిన్‌గా వెలుగొందుతున్న సుమక్కను చూసిన తర్వాత నేను కూడా టెలివిజన్ షోలనే చేయాలని అనుకొన్నాను అని శ్రీముఖి చెప్పారు.

సినిమాల కంటే టీవీ మేలు

సినిమాల కంటే టీవీ మేలు

సినిమాల్లో నటిస్తే.. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మనల్ని చూడాల్సి వస్తున్నది. టెలివిజన్ షోలో హోస్ట్‌గా ఉంటే మనమే వాళ్ల ఇంటికి వెళ్తాం. కాబట్టి ప్రేక్షకులకు ఎప్పుడూ అటాచ్‌మెంట్ పెరుగుతూ ఉంటుంది. అందుకే సుమను స్పూర్తిగా తీసుకొని టెలివిజన్‌కే పరిమితం కావాలని కోరుకొంటున్నాను అని శ్రీముఖి అన్నారు.

అల్లు అర్జున్‌కు చెల్లెలుగా

అల్లు అర్జున్‌కు చెల్లెలుగా

హీరోలు అల్లు అర్జున్, రామ్‌లో ఎవరికి చెల్లెలుగా నటించడం హ్యాపీగా అనిపించిందని సుమ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్‌కు చెల్లెలుగా నటించడం నాకు ఇష్టంగా అనిపించింది. రామ్ లాంటి హ్యాండ్సమ్ హీరోకు చెల్లెలుగా నటించడం ఇష్టంగా అనిపించలేదు అని శ్రీముఖి అన్నారు. జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు శ్రీముఖి చెల్లెలుగా నటించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Anchor Sreemukhi About Her Movie Career
రష్మి, సుధీర్ చూస్తే..

రష్మి, సుధీర్ చూస్తే..

ఇక రష్మీ గౌతమ్‌, అనసూయలో ఎవరు మీకు బాగా పోటీ అని భావిస్తున్నారనే ప్రశ్నకు జవాబిస్తూ.. వారిద్దరూ కూడా నాకు పోటీ కాదు అని శ్రీముఖి అన్నారు. ఇక సుదీర్, రష్మీ గౌతమ్, సుధీర్, విష్ణుప్రియలో మంచి కపుల్ ఎవరనే ప్రశ్నకు సమాధానిమిస్తూ.. సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ జంట అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు. నాకు సుధీర్, రష్మీగౌతమ్ జంట చూస్తే కళ్లలో నుంచి రక్తం కారుతుంది అని శ్రీముఖి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X