నా పేరు బయటికొస్తే సూసైడ్ చేసుకుంటా .. హేమ పోలీసులనే బెదిరించిందా ..?

బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో అడ్డంగా దొరికిపోయి , దొరకలేదన్నట్లుగా బుకాయించి విమర్శల పాలయ్యారు సినీ నటి హేమ. వెంట వెంటనే రెండు వీడియోలు రిలీజ్ చేసి తాను స్పాట్‌లోనే లేనని హైదరాబాద్‌లోనే చిల్ అవుతున్నట్లు చెప్పారు. ఇది నిజమేనని జనం నమ్మేలోగా బెంగళూరు పోలీసులు స్పందించారు. హేమ తమ కస్టడీలోనే ఉందని , కుటుంబ సభ్యులకు విషయం చెబుతానంటే ఫోన్ ఇచ్చామని.. దాంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. రేవ్ పార్టీకి హాజరైన వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా వారిలో 86 మంది మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా నిర్ధారణ అయ్యింది. వీరిలో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెతో పాటు బుల్లితెర నటి అషీరాయ్, మరో నటుడు చిరంజీవి కూడా ఉన్నారు. వీరికి బెంగళూరు రూరల్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

ఇదిలావుండగా .. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు హేమ అత్యంత తెలివిగా వ్యవహరించారు. దాడి తర్వాత పట్టుబడిన వారి వివరాలను పోలీసులు నమోదు చేసుకుంటూ ఉండగా తన పేరును కృష్ణవేణిగా హేమ చెప్పింది. హేమ అసలు పేరు కృష్ణవేణియే.. ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో అలాగే నమోదై ఉండటంతో దానిని అడ్డం పెట్టుకుని తన స్క్రీన్ నేమ్‌ని దాచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అదే పేరుతోనే ఆమె రేవ్ పార్టీకి కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది.

I will commit suicide if my name comes out actress hema warns bangalore police at rave party drug bust

జీఆర్ ఫాంహౌస్‌లో ఈవెంట్ ఆర్గనైజర్, క్రికెట్ బుక్కీగా ఉన్న విజయవాడకు చెందిన వాసు ఈ పార్టీని నిర్వహించాడు. సదరు ఫాంహౌస్‌ గోపాల్ రెడ్డికి చెందినదే.. అయితే ఆ పార్టీలో గోపాల్ రెడ్డి లేడు. ఎంట్రన్స్ గేట్‌లో ఎంటరైనప్పుడే వీరంతా హ్యాపీ బర్త్ డే వాసు అనే ఫ్లాష్ కార్డ్‌ని సెక్యూరిటీ చెక్ పాయింట్‌లో చూపించాలి. అప్పుడే వారిని లోపలికి అనుమతిస్తారు. రేవ్ పార్టీని మూడు రోజుల పాటు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

''సన్ సెట్ టూ సన్ రైజ్ '' పేరిట తాము బర్త్ డే పార్టీ చేసుకుంటున్నట్లు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో నిర్వాహకులు ముందుస్తు అనుమతి తీసుకున్నారు. కానీ బర్త్ డే పార్టీని రేవ్ పార్టీగా మార్చేశారు. చెవులు హోరెత్తిపోయే డీజే సౌండ్స్ వినిపించడంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోలింగ్‌కు వెళ్లిన పోలీసులు ఏం జరుగుతుందోనని చూడగా రేవ్ పార్టీ బండారం బయటపెట్టింది. ఆ సమయంలో పోలీసులు, కన్నడ మీడియాలో చాలా మంది హేమను చూసి గుర్తుపట్టారు కూడా. అయినప్పటికీ ఆమె వీడియో రిలీజ్ చేయడం దుమారం రేపింది.

I will commit suicide if my name comes out actress hema warns bangalore police at rave party drug bust

అంతేకాదు.. బ్లడ్ శాంపిల్స్ తీసుకునే సమయంలో తన పేరు బయటకు వస్తే సూసైడ్ చేసుకుంటానని హేమ బెంగళూరు పోలీసులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. తన ఉనికి బయటపడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించింది. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలోని ఫ్లోరల్ టాప్, వైట్ షర్ట్ .. అలాగే ఆమె రిలీజ్ చేసిన వీడియోలో వైట్ షర్ట్‌లోనే హేమ కనిపించారు. సాయంత్రం ఫాంహౌస్ థర్డ్ గేట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కూడా వైట్ డ్రెస్‌‌లోనే ఉన్నారట.. మీడియాను పక్కకు తోసేస్తూ ఓ ప్రైవేట్ వెహికల్‌లో హైదరాబాద్‌కు బయల్దేరినట్లుగా కథనాలు వస్తున్నాయి.

మార్గమధ్యంలోని చెక్‌పోస్టులు, టోల్‌గేట్ల వద్ద కూడా మాస్క్‌లు వేసుకుని హేమ జాగ్రత్తలు తీసుకుంది. ఆమె తరచుగా బెంగళూరు వస్తూ పోతూనే ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవి, ఈవెంట్ ఆర్గనైజర్ వాసులు హేమెకు క్లోజ్ ఫ్రెండ్స్ అట. రేవ్ పార్టీకి హాజరైన నటులు, మోడల్స్‌లో చాలామందితో హేమకు పరిచయాలు ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మరో మూడు రోజుల్లో ఆమె బెంగళూరు సీసీబీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. మరి ఇప్పుడు హేమ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X