నిన్ను, నీ ఫ్యామిలీని చంపేస్తాం.. బిగ్‌బాస్ సెలబ్రిటీకి డెత్ వార్నింగ్
బిగ్‌బాస్ 12 రియాలిటీ షోలో గాయని జస్లీన్ మాతరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వయసుపై బడిన గాయకుడు అనుప్ జలోటాతో కలిసి రొమాన్స్ చేసిన తీరు టెలివిజన్ ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని, వినోదాన్ని పంచింది. చాలా రోజుల తర్వాత మళ్లీ జస్లీన్ మాతరు వార్తల్లోకి వచ్చింది. ఈసారి మాత్రం ఫ్యామిలీని రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఆమె వార్తలకెక్కింది. జస్లీన్ ఫ్యామిలీ ప్రస్తుతం గృహనిర్భంధంలో ఉండటమే..

మాఫియా వార్నింగ్‌తో
ప్రపంచమంతా కరోనావైరస్ ధాటికి భయపడిపోయి స్వచ్ఛందంగా గృహనిర్భంధం విధించుకొంటే.. జస్లీన్ మాతరు కుటుంబం మాత్రం మాఫియాకు భయపడి ఇంట్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జస్లీన్ మాతరు కుటుంబానికి డెత్ వార్నింగ్ రావడంతో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాం
జస్లీన్ మాతరు కుటుంబాన్ని కొందరు అగంతకులు హెచ్చరించారు. నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాం. నీ ఫ్యామిలీ ప్రాణాలతో ఉండాలంటే మాకు డబ్బు ముట్టచెప్పాలి. లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని అంతం చేస్తామని అగంతకులు వార్నింగ్ ఇచ్చారు. దాంతో జస్లీన్ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పలుమార్లు ఫోన్‌లో బెదిరింపులు
మీడియా కథనం ప్రకారం..పలుమార్లు ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డారు. నా ఫోన్‌కు కాల్స్ వచ్చాయి. ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు తర్వాత సెక్యూరిటీ కోసం పోలీసుల భవనాన్ని తనిఖీ చేశారు. తగిన రక్షణ ఏర్పాటు చేశారు అని మీడియా కథనాల్లో పేర్కొన్నది.

రక్షణ ఏర్పాటు చేసాం
జస్లీన్ మాతరు వచ్చిన బెదిరింపులపై ఓషివారా పోలీస్ స్టేషన్ అధికారులు స్పందించారు. జస్లీన్‌కు బెదిరింపులు వచ్చింది నిజమే. ఆమె మాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వారికి రక్షణను ఏర్పాటు చేశాం. బెదిరింపు కాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఎందుకు వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.
Recommended Video

స్వయంవరం షో నుంచి ఎలిమినేట్
బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత జస్లీన్ మాతరు ఇంటికే పరిమితమయ్యారు. స్వయంవరం షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత జస్లీన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. మార్చి 12 నుంచి ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం తన కుటుంబాన్ని అగంతకుల నుంచి రక్షించుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకొని గృహనిర్బంధానికే పరిమితమయ్యారు.


Click it and Unblock the Notifications











