Rathika Rose: తనలోని మరో కొత్త టాలెంట్‌ను బయటపెట్టిన రతికా... మీరూ గమనించారా?
బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్, హాట్ బ్యూటీ రతికా రోజ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతుకు మించిన హాట్ షోతో బిగ్ బాస్ ను షేక్ చేసిన ఈమె... పల్లవి ప్రశాంత్, యావర్ లతో కలిపిన పులిహోర చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కాసేపు ఫ్రెండ్స్ గా చూస్తూనే మరికాసేపటికి శత్రువులా బిహేవ్ చేసి విపరీతమైన నెగిటివిటీని తెచ్చుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనలోని మరో అద్భుతమైన టాలెంట్ ను పరిచయం చేసింది. ఆ టాలెంట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినీ రంగలో యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రతికా చాలానే సినిమాలు చేసింది. అలాగే కెరియర్ ఆరంభంలో సింగర్ రాహులు సిప్లిగంజ్ ను ప్రేమించింది. పెళ్లి వరకూ వెళ్లిన వీరి ప్రేమాయణం పలు కారణాల వల్ల మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది. అయితే బ్రేకప్ బాధను అనుభవిస్తున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ కు వచ్చింది. ఈ విషయాన్ని అక్కడి కంటెస్టెంట్లకు చెప్పి చాలానే సింపథీ గెయిన్ చేసుకుంది.

కానీ ఆతర్వాత పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో ఆమె వ్యవహరించిన తీరు ఎవరికీ నచ్చకుండా పోయింది. ఇలా విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ నాలుగో వారమే ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయింది. బయట నెగిటివిటీని తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డ ఈమె... మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి తన నెగిటివిటీని పోగొట్టుకోవాలనుకుంది. అందుకు తగ్గట్లుగానే రైతుబిడ్డకు సారీ చెప్పింది. శివాజీ కాళ్లు కూడా పట్టుకుంది. వారి గ్రూపులోనే ఉంటూ గేమ్ ఆడింది.
అలాగే ముందుగా వేసుకున్నలాంటి బట్టలు కూడా వేసుకోలేదు. పద్ధతిగానే కనిపిస్తూ.. పాజిటివ్ చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బీబీ ఉత్సవం షోలో పాల్గొని బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లు అందరినీ కలిసింది. వారందరితో మాట్లాడి చాలానే రచ్చ చేసింది. ముఖ్యంగా రైతుబిడ్డితో ఓ రొమాంటిక్ పాటకు స్టెప్పులు వేసి.. మరోసారి సారీ చెప్పింది. ఇదంతా ఇలా ఉండగా.. ఈ క్యూట్ బ్యూటీ.. తనలోని కొత్త టాలెంట్ ను ఈ షో ద్వారానే పరిచయం చేసింది.

ఎప్పుడూ తనకు పాటలు అంటే చాలా ఇష్టం అని చెప్పే ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ సాంగ్ ను పాడింది. అద్భుతంగా పాడి అందరిచేత ఆహా అనిపించుకుంది. రాహుల్ సిప్లిగంజ్ మీద ప్రేమతోనే తనకు పాటలు అంటే ఇష్టం అని చెబుతుందని అంతా అనుకున్నారు... కానీ రతికా రోజ్ స్టేజీ మీద మంచి పాట పాడి అందరినీ మెస్మరైజ్ చేయడంతో భావన మార్చుకున్నారు. రతికాలో కూడా మంచి సింగర్ ఉందని.. ఫ్యూచర్ లో ఇంకా అద్భుతమైన పాటలు పాడే దిశగా ఆమె కష్టపడాలని చాలా మంది చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











