అఖిలే నెంబర్ వన్.. కామెడీ చేస్తోన్న మోనాల్
బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం బయట ఏం జరుగుతుందో కంటెస్టెంట్లకు తెలియదు. ఒకసారి బయటకు వస్తే వాస్తవం ఏంటన్నది బోధపడుతుంది. అలా మోనాల్ బయటకు వచ్చింది. అన్ని విషయాలను అర్థం చేసుకుంది. తన గురించి జనాలు బయట ఏమని అనుకుంటున్నారు.. అఖిల్ ఇమేజ్ ఎంత దారుణంగా ఉంది.. అభిజిత్ సోహెల్ అరియానా లెవెల్ ఎక్కడ ఉందో అన్ని మోనాల్‌కు అర్థమయ్యాయి.
తనకు అఖిలే నెంబర్ వన్ అంటూ.. అఖిల్ టైటిల్ గెలుచుకోవాలని ఉందంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. కానీ పరిస్థితి చూస్తుంటే వేరే అతను గెలిచేలా ఉన్నాడంటూ పరోక్షంగా అభిజిత్ గురించి మోనాల్ చెప్పింది. ఇంత తెలిసిన మోనాల్ మళ్లీ నేటి ఎపిసోడ్‌లో పాత పాటే పాడింది. నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లందరూ మళ్లీ రాబోతోన్నారు. కానీ ఇంట్లోకి రాకుండా గ్లాస్ రూంలోనుంచే పలకరించనున్నారు.

ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే అద్దం అవతల నుంచి మాట్లాడారో అలాగే ఈ కంటెస్టెంట్లు కూడా ముచ్చట్లు పెట్టనున్నారు. ఈ క్రమంలో మోనాల్‌నే ముందుగా లోపలికి పంపించారు. వచ్చీ రాగానే మోనాల్ అఖిల్‌తో పులిహోర కలపడం ప్రారంభించినట్టుంది. అఖిలే నెంబర్ వన్ అంటూ మళ్లీ గొంతెత్తింది. అది కామెడీగా అందా? లేదా ఇంకా భ్రమలోనే ఉందా? అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు అఖిల్ టాప్ 3లో ఉంటారని కూడా ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడంతా అభిజిత్ సోహెల్ అరియానా చుట్టే తిరుగుతోందన్న సంగతి మోనాల్‌కు కూడా తెలుసు.


Click it and Unblock the Notifications











