For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కారులో అడ్డంగా దొరికిపోయిన జబర్ధస్త్ జోడీ: అలా బయటకు వచ్చిన ఫొటో.. ఆమె చేసిన పనికి పరువు పాయె!

  |

  తెలుగు బుల్లితెరపై సుదీర్ఘమైన ప్రస్థానంతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్ధస్త్ షో. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా దీనికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చినా.. ఏమాత్రం టీఆర్పీ రేటింగ్‌లో తేడా లేకుండా దూసుకుపోతోంది. దీనికి కారణం ఈ షోలో కామెడీతో పాటు సరికొత్త ప్రయోగాలు చేస్తూ.. ప్రేక్షకులకు ప్రతి వారం మజాను పంచుతుండడమే. ఈ మధ్య కాలంలో జబర్ధస్త్‌లో వర్ష.. ఇమాన్యూయేల్ జంటను బాగా హైలైట్ చేస్తున్నారు. వీళ్లతో రొమాన్స్‌ను పండిస్తూ తద్వారా రేటింగ్‌ను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇమాన్యూయేల్.. వర్ష కారులో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  వర్ష అలా.. ఇమ్మూ ఇలా వచ్చారు

  వర్ష అలా.. ఇమ్మూ ఇలా వచ్చారు

  సీరియల్ నటిగా ఫేమస్ అయిన వర్ష.. హైపర్ ఆది ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అందంతో పాటు యాక్టింగ్‌తో ఇరగదీస్తూ ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు.. 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యూయేల్. అది ఆగిపోయిన తర్వాత జబర్ధస్త్‌లోకి ప్రవేశించి తక్కవ టైమ్‌లోనే తనదైన కామెడీతో ఫుల్ పాపులర్ అయిపోయాడు.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన భూమిక: తడిచిన అందాలతో ఘాటుగా.. ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  జంట అయ్యారు.. పేరు పొందారు

  జంట అయ్యారు.. పేరు పొందారు

  బుల్లితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చినా.. కొందరు మాత్రమే పాపులర్ అవుతారు. అందులో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇలా బుల్లితెర జంటగా అప్పట్లో రష్మీ.. సుధీర్ ఫేమస్ అయ్యారు. వీళ్ల తర్వాత ఇప్పుడు వర్ష - ఇమాన్యూయేల్‌ను కూడా జోడీగా చేశారు. ఈ జంట క్రమంగా పాపులర్ అవుతోంది. దీంతో వీళ్లపై ఎన్నో స్కిట్లు క్రియేట్ చేస్తున్నారు.

  క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు

  క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు

  వర్ష.. ఇమాన్యూయేల్ జోడీగా అంత నమ్మశక్యంగా లేకపోయినా.. తరచూ వీళ్ల మధ్య రొమాంటిక్ సీన్స్ చూపిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఇది నిజమేనేమో అన్న భావన కలిగింది. అందుకు అనుగుణంగానే షోల నిర్వహకులు ప్రతి స్కిట్‌లోనూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేయిస్తున్నారు. ఫలితంగా ఈ జంటకు భారీ స్థాయిలో క్రేజ్ దక్కిందని చెప్పొచ్చు.

  Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు

  పెళ్లి చేసుకుని... మరీ దారుణంగా

  పెళ్లి చేసుకుని... మరీ దారుణంగా

  జబర్ధస్త్ జంటగా పేరొందిన రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌కు అప్పట్లో ఓ ఈవెంట్‌లో పెళ్లి చేసిన విషయం తెలిసిందే. దానికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇప్పుడదే మాదిరిగా 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' అనే షోలో అప్పుడప్పుడే ఫేమస్ అవుతోన్న వర్ష.. ఇమాన్యూయేల్‌కు పెళ్లి చేశారు. ఈ ఎపిసోడ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ జంట మరింత హైలైట్ అయిపోయింది.

  కారు అడ్డంగా దొరికిపోయిన జంట

  కారు అడ్డంగా దొరికిపోయిన జంట

  జంటగా ఫేమస్ అయిన తర్వాత వర్ష.. ఇమాన్యూయేల్ మరింతగా రెచ్చిపోతున్నారు. తరచూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు స్కిట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పంచులు కూడా వేసుకుంటున్నారు. దీంతో ఈ జంట నిత్యం వార్తల్లోనే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ, ఇమాన్యూయేల్ కారులో ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  అలా బయటకు వచ్చిన క్రేజీ పిక్

  వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో చివర్లో వర్ష, ఇమాన్యూయేల్‌ గురించి రోజా ఓ న్యూస్ చెప్పి బుక్ చేసింది. స్కిట్ చివర్లో ఆమె 'రెండు రోజుల ముందు మీరిద్దరూ కలిసి ఎక్కడికెళ్లారు' అని ప్రశ్నించింది. అంతేకాదు, వాళ్లిద్దరూ కారులో కూర్చుని ఉండగా తీసిన ఓ ఫొటోను సైతం చూపించి షాకిచ్చింది.

  Recommended Video

  Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
  ఆ పని చేయడానికే కూర్చున్నాం

  ఆ పని చేయడానికే కూర్చున్నాం

  రోజా అడగ్గానే వర్ష షూటింగ్‌లో ఉన్నానని.. ఇమాన్యూయేల్ ఊరెళ్లానని చెప్పారు. ఇక, ఆ ఫొటోను చూపించగానే అతడు మాట్లాడుతూ.. 'నార్మల్‌గా కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నాం అంతే' అని చెప్పాడు. వర్ష మాత్రం 'నేను షూట్‌లో ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఆ విషయం నా మాట ద్వారా తెలుసుకుని అక్కడకు వచ్చేశాడు' అని ఏదో జరిగినట్లు చెప్పుకొచ్చింది.

  English summary
  Telugu Actress, Model Jabardasth Fame Varsha and Comedian Immanuel Caught in Car. This Pic Was Leaked by Judge Roja in The Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X