వర్ష జాకెట్‌పై ఇమాన్యూయేల్ సంచలన వ్యాఖ్యలు: వాడి కోసమేగా ఇలా.. అందరి ముందే పరువు తీశాడు పాపం

వర్ష.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వల్లే ఆమెకు ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్న విషయం తెలిసిందే. మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టి ఇప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా ఫాలోయింగ్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటోంది. ఇక, ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వర్ష డ్రెస్సింగ్‌పై కమెడియన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలెట్టి.. సీరియల్ నటిగా

అలా మొదలెట్టి.. సీరియల్ నటిగా

నటిగా అవకాశాలు దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది వర్ష. అక్కడ తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో బుల్లితెరపైకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే పలు సీరియళ్లలో సైతం నటించింది. వాటిలో 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు వర్షకు మంచి పేరును తెచ్చాయి.

అతడి ద్వారా జబర్ధస్త్‌లోకి ప్రవేశం

అతడి ద్వారా జబర్ధస్త్‌లోకి ప్రవేశం

మోడల్‌గా, సీరియల్ నటిగా సత్తా చాటుతోన్న సమయంలోనే హైపర్ ఆది ద్వారా వర్ష జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకటి రెండు స్కిట్ల కోసం షోలోకి వచ్చిన ఈ భామ.. అప్పుడే అందరి దృష్టిలో పడడంతో పాటు చర్చనీయాంశం అయింది. దీంతో ఆమెను షోలో కంటిన్యూ చేస్తున్నారు. ఫలితంగా జబర్ధస్త్‌లో పర్మినెంట్ ఆర్టిస్టు అయింది. ఈ క్రమంలోనే పలువురు టీమ్‌లలో పని చేస్తోంది.

కమెడియన్‌తో వర్ష లవ్ ట్రాక్ స్టార్ట్

కమెడియన్‌తో వర్ష లవ్ ట్రాక్ స్టార్ట్

జబర్ధస్త్‌లో మెప్పించిన వర్ష.. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ భాగం అయింది. ఈ రెండింటిలోనూ సత్తా చాటడానికి కారణం ఆమె.. యంగ్ టాలెంటెడ్ కమెడియన్‌ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడపడమే. స్కిట్ల కోసం లవర్లుగా నటించిన వీళ్లిద్దరూ.. అప్పుడప్పుడూ నిజమైన ప్రేమికుల్లానే కనిపిస్తున్నారు. దీంతో వీళ్లపై నిర్వహకులు మరింత ఫోకస్ చేయడంతో పాపులర్ అయిపోయారు.

 కిస్, హగ్, పెళ్లితో వర్ష హాట్ టాపిక్

కిస్, హగ్, పెళ్లితో వర్ష హాట్ టాపిక్

వర్ష.. ఇమాన్యూయేల్ కేవలం జంటగా కనిపించడమే కాదు.. అప్పుడప్పుడూ ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో రొమాంటిక్ సీన్స్‌ను కంటిన్యూ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో వర్ష.. ఇమాన్యూయేల్‌కు ఏకంగా పెళ్లి కూడా చేసేశారు. ఈ ఎపిసోడ్‌ బాగా హైలైట్ అయింది.

వాడి కోసమేగా ఇలా అని కామెంట్

వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో వర్ష, ఇమాన్యూయేల్‌ భార్యభర్తల్లా కనిపించారు. స్కిట్‌లో భాగంగా ఇమాన్యూయేల్ 'ఏంటే ఈరోజు ఇంటి ముందు ముగ్గు వేయలేదు? అంటే వాడు రాలేదు. వస్తే రా.. దా అంటూ ముగ్గులేస్తావ్. ఇంతకీ ఎవడే వాడు' అంటూ భార్య పాత్రలో ఉన్న వర్షను అనుమానించే భర్తగా నటించాడు.

Recommended Video

Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
వర్ష జాకెట్‌ చూపించి పరువు తీశాడు

వర్ష జాకెట్‌ చూపించి పరువు తీశాడు

ఇమాన్యూయేల్ మాటలకు ఫీలైన వర్ష 'పద్దతికి చీర కట్టిన దానిలా ఉంటాను. నన్నే అనుమానిస్తున్నారా' అని బాధ పడుతుంది. అప్పుడతను సూపర్ అంటూ చప్పట్లు కొడుతూ 'చూడండమ్మా. మా ఆవిడ పద్దతికి చీర కట్టినట్లు ఉంటది' అంటూ ఆమె బ్లౌజ్ చూపించాడు. అలాగే, 'ఎవరైనా బ్లౌజ్‌కు చిన్న కిటికీలు పెడతారు. నువ్వేంటే 70MM తెర పెట్టావు' అని పరువు తీసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X