మగాళ్లందరూ అయిపోయారు.. ఇప్పుడు వాటితోనే ఆ పని: జబర్ధస్త్ వర్షపై అనుచిత వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరపై గతంలో కంటే ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ షోలో చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్లు హల్చల్ చేస్తూ కామెడీని పంచుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ వర్ష, క్రేజీ కమెడియన్ ఇమాన్యూయేల్ పేర్లు ప్రత్యేకంగా చెప్పాలి. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన వీళ్లు.. జంటగానూ తెగ హడావిడి చేస్తున్నారు. దీంతో క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వర్షపై ఇమాన్యూయేల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అసలేమైందో మీరే చూడండి!

సీరియల్ నటిగా ఫేమస్
యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆరంభంలోనే వర్ష మోడల్‌గా మారి అందచందాలతో మాయ చేసింది. ఇలా ఆ రంగంలో ఉన్నప్పుడే ఎన్నో ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే 'అభిషేకం' అనే సీరియల్‌లో నటించే ఆఫర్ వచ్చింది. దీంతో ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లతో మెప్పించి మంచి పేరు తెచ్చుకుంది.

Immanuel Controversial Comments on Varsha Character in Jabardasth Show

జబర్ధస్త్‌లో అతడికి జోడీ

సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సీరియళ్లలో నటించి సత్తా చాటుకున్న క్యూట్ లేడీ వర్ష.. ఓ సందర్భంలో జబర్ధస్త్ షోలోకి వచ్చి స్కిట్ చేసింది. ఇందులో అదరగొట్టడంతో ఆమెకు అదే షోలో అవకాశాలు వచ్చాయి. అలా వర్ష అందులో పర్మినెంట్ మెంబర్ అయిపోయింది. అప్పటి నుంచి జబర్దస్త్ ఫేమ్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఇమాన్యూయేల్‌కు జోడీగా సెన్సేషన్ అయింది.

జంటగా షోలు, ఈవెంట్లే
జబర్ధస్త్ షోలో చాలా కాలంగా సందడి చేస్తోన్న వర్ష, ఇమాన్యూయేల్.. ఇదే క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ సత్తా చాటుతున్నారు. ఇలా జబర్ధస్త్‌, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో అలరిస్తున్నారు. వీటితో పాటు యూట్యూబ్‌లో ప్రసారం అయ్యే కొన్ని రకాల షోలను కూడా వీళ్లిద్దరూ జంటగా హోస్ట్ చేస్తూ రచ్చ లేపుతున్నారు.

Immanuel Controversial Comments on Varsha Character in Jabardasth Show

క్యారెక్టర్ బ్యాడ్ చేసేలా

అందం, అభినయం, కామెడీతో హైలైట్ అయిన వర్ష.. మరింత పేరు తెచ్చుకోవడానికి యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు నటిస్తోంది. అయితే, అతడు మాత్రం తరచూ ఆమె క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసేలా కామెంట్లు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ షోలో ఆమెపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీంతో ఇమ్మూపై విమర్శలు వస్తున్నాయి.

మగాళ్లందరూ అయ్యారు
ఈ వారం ప్రసారం అయ్యే జబర్ధస్త్ షోకు సంబంధించిన ప్రోమోలో వర్షపై ఇమాన్యూయేల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. స్కిట్‌లో భాగంగా ఆమె ఇంట్లో దెయ్యాలు ఉన్నట్లుగా ఇమాన్యూయేల్‌తో చెప్తుంది. దీంతో అతడు 'మగాళ్లందరూ అయిపోయారా? ఇప్పుడు ఆత్మలను కూడా వదలడం లేదా' అన్నట్లు ఆమె క్యారెక్టర్‌ను డ్యామేజ్ చేసేలా కామెంట్లు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X