ఆమెను హత్తుకుని ముద్దులు పెట్టిన జబర్ధస్త్ కమెడియన్.. క్యారెక్టర్‌లో అలా చేశానంటూ నిజంగానే!

తెలుగులో జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఒకే రకమైన స్పందనతో దూసుకుపోతోందీ షో. ప్రతి వారం రెండు రోజుల పాటు కామెడీని పంచుతూ బుల్లితెరపై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతేకాదు, పోటీగా ఎన్నో కామెడీ షోలు పుట్టుకొచ్చినా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. ఈ క్రమంలోనే జనాలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తున్నారు నిర్వహకులు. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్ షోలో ఊహించని పరిణామం ఒకటి జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

ఎనిమిదేళ్ల ప్రస్థానం.. ఎంతో మంది పరిచయం

ఎనిమిదేళ్ల ప్రస్థానం.. ఎంతో మంది పరిచయం

ఎనిమిదేళ్ల నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా ప్రసారం అవుతూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్ షో. ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన ఈ షో.. తెలుగులో టాప్ ప్లేస్‌లో వెలుగొందుతోంది. ఇంత సుదీర్ఘ ప్రస్థానంలో కొన్ని వందల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను బుల్లితెర, వెండితెరకు పరిచయం చేసిందీ షో. వాళ్లంతా ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు.

వాళ్లకు మాత్రం బాగా కలిసొచ్చిన కామెడీ షో

వాళ్లకు మాత్రం బాగా కలిసొచ్చిన కామెడీ షో


జబర్ధస్త్ సాదాసీదా షో మాత్రమే కాదు.. ఇది ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఆర్టిస్టులు మాత్రమే కాదు.. ఇందులో యాంకర్లుగా పని చేసిన అనసూయ భరద్వాజ్.. రష్మీ గౌతమ్‌ ఓ రేంజ్‌లో వెలుగొందడానికి కారణం అయింది. వీరితో పాటు జడ్జ్‌లుగా పని చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. సీనియర్ హీరోయిన్ రోజాకు కూడా ఈ కామెడీ షో చాలా ఉపయోగపడిందనే చెప్పాలి.

ప్రశంసలు మాత్రమే కాదు.. విమర్శలు కూడా

ప్రశంసలు మాత్రమే కాదు.. విమర్శలు కూడా


గురు, శుక్రవారాలు బుల్లితెర ప్రేక్షకులకు కామెడీని పంచుతూ టెలివిజన్ రంగంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది జబర్ధస్త్ షో. అంతలా చాలా కాలంగా ప్రభావం చూపిస్తోంది. ఈ షోను ఆదరించే వాళ్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు. అదే సమయంలో కొందరిని కించపరిచారన్న కారణంతో జబర్ధస్త్‌ ప్రసారాలను ఆపేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి.

జబర్ధస్త్‌లో మరో జోడీ.. వాళ్లను మించి రొమాన్స్

జబర్ధస్త్‌లో మరో జోడీ.. వాళ్లను మించి రొమాన్స్

జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్ మాత్రం విపరీతమైన స్థాయిలో క్రేజ్‌ను అందుకున్నారు. ఈ షోలో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తున్నట్లు చూపించడమే దీనికి కారణం. వీళ్ల తర్వాత కొత్తగా వర్ష - ఇమాన్యూయేల్ జంట కూడా క్రమక్రమంగా పాపులర్ అవుతోంది.

ఆమెను హత్తుకుని ముద్దులెట్టిన కమెడియన్

ఆమెను హత్తుకుని ముద్దులెట్టిన కమెడియన్


వర్ష ఈ మధ్య తరచూ జబర్ధస్త్ షోలలో స్కిట్లు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఇమాన్యూయేల్‌కు జోడీగా ఆమె ఎన్నో పాత్రలు పోషించింది. ఇందులో భాగంగానే వచ్చే వారం 'ఇడియట్' సినిమా స్ఫూఫ్ చేయగా.. అందులో వీళ్లిద్దరూ తండ్రీ కూతుళ్లుగా చేశారు. అయినప్పటికీ ఆమెను వదిలి పెట్టని ఇమ్మూ... గట్టిగా హగ్ చేసుకోవడంతో పాటు ముద్దులిచ్చాడు.

క్యారెక్టర్‌లో అలా చేశానంటూ నిజంగానే చేశాడు

క్యారెక్టర్‌లో అలా చేశానంటూ నిజంగానే చేశాడు


తండ్రి పాత్రను పోషించిన ఇమాన్యూయేల్.. వర్షను ప్రేమగా హత్తుకున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. అంతేకాదు, ఆమె నుదిటిపై వరుసగా ముద్దుల మీద ముద్దులు ఇచ్చాడు. నాన్న క్యారెక్టర్ కావడం వల్లే ఇలా చేశానని తర్వాత చెప్పుకొచ్చాడు. మొత్తానికి వచ్చే వారం వీళ్ల టీమ్ స్కిట్ అదగొట్టేలా ఉంది. ఎంతో సందడిగా సాగిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X