twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జబర్ధస్త్‌ సెట్‌లో ఊహించని సంఘటన: ఆమెకు నిజంగానే ముద్దు పెట్టిన కమెడియన్.. షాక్‌లో అలా!

    |

    బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలు అన్నింటిలోనూ జబర్ధస్త్‌ది ప్రత్యేకమైన స్థానం. దీనికి కారణం దాదాపు ఎనిమిదేళ్లుగా ఇది తెలుగు టెలివిజన్‌ రంగంపై ప్రభావాన్ని చూపిస్తుండడమే. అంతేకాదు, ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనతను కూడా అందుకుంది. అలాగే, ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో వస్తూ భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటోంది. ఈ కారణంగానే ఈ కామెడీ షో నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది. ఇలాంటి సమయంలో జబర్ధస్త్ సెట్‌లో ఊహించని విధంగా నిజమైన ముద్దు సీన్ జరిగింది. ఆ వివరాలు మీకోసం!

    సుదీర్ఘ ప్రమాణం.. వందల మంది ఆర్టిస్టులు

    సుదీర్ఘ ప్రమాణం.. వందల మంది ఆర్టిస్టులు

    అప్పుడెప్పుడే ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రారంభం అయింది జబర్ధస్త్ షో. మొదలైనప్పటి నుంచే ప్రేక్షకాదరణను అందుకుంటూ సత్తా చాటుతోందీ షో. సుదీర్ఘమైన దీని ప్రయాణంలో కొన్ని వందల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను బుల్లితెర, వెండితెరకు పరిచయం చేసింది జబర్ధస్త్. ఈ షో పేరునే తమ ఇంటి పేర్లుగా మార్చుకుని చాలా మంది సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు.

     ఆ నలుగురికీ బాగా కలిసొచ్చిన కామెడీ షో

    ఆ నలుగురికీ బాగా కలిసొచ్చిన కామెడీ షో

    ఆర్టిస్టులు మాత్రమే కాదు.. జబర్ధస్త్ షో వల్ల యాంకర్లుగా పని చేస్తున్న అనసూయ భరద్వాజ్.. రష్మీ గౌతమ్ కూడా బాగా లాభ పడ్డారు. వీళ్లకు ఎనలేని క్రేజ్ రావడానికి ఈ షోనే కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరితో పాటు జడ్జ్‌గా చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. సీనియర్ హీరోయిన్ రోజాకు కూడా చాలా ఉపయోగపడింది. అందుకే దీనిని ప్రత్యేకంగా చెబుతుంటారు.

    Recommended Video

    #MaaVinthaGadhaVinuma: Seerat Kapoor, Siddhartha Chit Chat With Allu Aravind || Filmibeat Telugu
    వివాదాలు వెంటాడాయి.. అయినా తగ్గలేదు

    వివాదాలు వెంటాడాయి.. అయినా తగ్గలేదు

    జబర్ధస్త్ షోకు ఎంత మంది అభిమానులు ఉన్నారో.. దాన్ని ద్వేషించి వ్యతిరేకించే వాళ్లు చాలా మందే ఉన్నారు. అందుకే చాలా సందర్భాల్లో ఈ షోను నిషేదించాలన్న డిమాండ్లు వినిపించాయి. ఇందులో పలానా కులం, ప్రాంతం వారిని కించపరిచారో.. ఆడవాళ్లను అగౌరపరిచారనో.. పలానా వర్గం వారికి వ్యతిరేకంగా స్కిట్లు చేశారనో.. జబర్ధస్త్‌పై విమర్శలు చెలరేగిన సందర్భాలూ ఉన్నాయి.

    అప్పుడు వాళ్లు ఫేమస్.. ఇప్పుడు ఈ జంట

    అప్పుడు వాళ్లు ఫేమస్.. ఇప్పుడు ఈ జంట

    తెలుగులోనే నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోన్న జబర్ధస్త్ వల్ల చాలా మంది హీరో, హీరోయిన్ల స్థాయి ఫాలోయింగ్‌ను అందుకున్నారు. వీరిలో యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్ మాత్రమే జంటగా ఫేమస్ అయ్యారు. ఈ మధ్య వాళ్ల మాదిరిగానే వర్ష - ఇమాన్యూయేల్ జంట కూడా పాపులర్ అయింది. వీళ్లు తరచూ రొమాన్స్ చేస్తూ.. ప్రపోజల్స్ చేసుకుంటున్నారు.

    జబర్ధస్త్‌ సెట్‌లో ఎవరూ ఊహించని సంఘటన

    జబర్ధస్త్‌ సెట్‌లో ఎవరూ ఊహించని సంఘటన

    జబర్ధస్త్ నిర్వహకులు కొద్ది రోజులుగా స్కిట్లతో పాటు ప్రేక్షకులకు నచ్చే అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రొమాంటిక్ సీన్లను కూడా చూపిస్తున్నారు. గతంలో రష్మీ సుధీర్ జోడీని ఇందుకు వాడుకున్న యూనిట్.. ఈ మధ్య వర్ష - ఇమాన్యూయేల్ జంటను హైలైట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్‌లో ఊహించని సంఘటన జరిగింది.

    ఆమెకు నిజంగానే ముద్దు పెట్టిన కమెడియన్

    ఆమెకు నిజంగానే ముద్దు పెట్టిన కమెడియన్

    ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌లో కెవ్వు కార్తీక్ స్కిట్ చేస్తున్న సమయంలో.. అందులో సభ్యులుగా ఉన్న వర్ష - ఇమాన్యూయేల్‌ను మరోసారి హైలైట్ చేశారు. ఇందులో అతడిని అంధుడిగా చూపించారు. కళ్లు కనపడని వ్యక్తిగా ఉన్న ఇమ్మూ.. అదే అదునుగా చేసుకుని వర్షకు నిజంగా ముద్దు పెట్టాడు. ఈ ఊహించని ఘటనతో ఆమెతో పాటు జడ్జ్‌లు రోజా, మనో కూడా షాకైపోయారు.

    English summary
    Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series, broadcasts on the ETV Network channel which is shot at Annapoorna Studios, Telangana, India. The show is produced by Mallemala Entertainments and Directed by Nitin and Bharath.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X