నిజంగానే ప్రేమలో పడ్డ జబర్ధస్త్ వర్ష.. సీక్రెట్ లీక్ చేసిన క్లోజ్ ఫ్రెండ్
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది లోకల్ అమ్మాయిలు తమదైన టాలెంట్లను చూపించి సెన్సేషన్ అయ్యారు. తద్వారా సెలెబ్రిటీలుగా మారిపోవడంతో పాటు ఎన్నో అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం వర్ష ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ భామ.. లవ్ ట్రాకులతో మరింత హైలైట్ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వర్ష నిజంగానే ప్రేమలో ఉందని ఆమె క్లోజ్ ఫ్రెండ్ రివీల్ చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
సీరియళ్లతో మంచి పేరు
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే లక్ష్యంతో మోడలింగ్ రంగంలో మెప్పించిన వర్ష.. తనదైన గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు 'అభిషేకం' అనే సీరియల్‌లో నటించే ఆఫర్ వచ్చింది. ఇందులో అదిరిపోయే నటనతో వర్ష సత్తా చాటింది. దీంతో ఆ తర్వాత 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియళ్లు చేసి ఈ భామ మంచి పేరు తెచ్చుకుంది.

జబర్ధస్త్ రాకతో హైలైట్
టెలివిజన్‌లో వరుస పెట్టి సీరియళ్లు చేస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న వర్ష.. ఆ మధ్య జబర్ధస్త్ షోలో గెస్టు ఆర్టిస్టుగా వచ్చింది. ఆరంభంలోనే అందరినీ తనవైపు చూసేలా చేసిన ఈ భామ.. కొంత కాలానికి ఆ షోలో పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి జబర్దస్త్ వర్షగా ఫుల్ పాపులర్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను దక్కించుకుంటోంది.
వాటిలో కూడా సందడి
సుదీర్ఘ కాలంగా జబర్ధస్త్ షోలో తనదైన రీతిలో మెప్పిస్తోన్న వర్ష.. బిజీగా ఉన్నా వరుసగా సీరియళ్లు చేస్తూనే వచ్చింది. అంతేకాదు, జబర్ధస్త్, స్పెషల్ ఈవెంట్లతో పాటు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' షోలోనూ భాగమై ప్రేక్షకులకు మజాను అందిస్తోంది. అలాగే, సినిమా నటిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాల్లో క్రేజీ రోల్స్ చేసేందుకు రెడీ అయిపోతోంది.

ఇమ్మూతో లవ్ ట్రాక్‌తో
జబర్ధస్త్ వర్షకు ఇంతలా పేరు రావడానికి యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించడం కూడా ఒక కారణం అన్న విషయం తెలిసిందే. అతడితో ప్రేమలో ఉన్నట్లు కలరింగ్ ఇస్తోన్న ఈ భామ.. తరచూ కిస్‌లు, హగ్గులతో రెచ్చిపోతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ రావడంతో వీళ్ల ట్రాక్ నిజమే అనుకుంటున్నారు.
నిజంగానే లవ్‌లో వర్ష
వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న 'ఎక్స్‌స్టా జబర్ధస్త్' ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఇమాన్యూయేల్ - వర్ష 'ప్రేయసి రావే' మూవీ స్ఫూఫ్ చేశారు. ఆ సమయంలో అతడు 'ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి' అని అడిగాడు. దీనికి వర్ష 'అబ్బో మనల్ని చాలా మంది ప్రేమిస్తారు. కానీ, మనం ఒకరినే ప్రేమిస్తాం' అని సమాధానం చెప్పింది. దీంతో ఇమ్మూ 'ఆ ఒక్కరు ఎవరో చెప్పొచ్చుగా. సెట్ మొత్తం వెయిటింగ్' అంటూ ఆమె నిజంగానే ప్రేమలో ఉందని చెప్పేశాడు.
సీక్రెట్ లీక్ చేసేశాడు
తర్వాత ఇమాన్యూయేల్ 'మీకు కావాల్సిన వాడు ఎలా ఉండాలో చెబితే' అని అడిగాడు. దీనికి వర్ష 'ఆరు అడుగులు ఉండాలి. వాడికి సిక్స్ ప్యాక్ కూడా ఉండాలి' అని బదులిచ్చింది. అప్పుడు ఇమాన్యూయేల్ 'మరి మాకు తెలిసినోడికి అవన్నీ లేవు కదా' అంటూ వర్ష నిజమైన బాయ్‌ఫ్రెండ్ గురించి బయటపెట్టాడు. దీంతో ఆమె అతడిని పరిగెత్తించి మరి కొట్టింది.


Click it and Unblock the Notifications











