వర్షపై ఇమాన్యూయేల్ మదర్ ఊహించని కామెంట్స్: లైవ్ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన జబర్ధస్త్ బ్యూటీ
తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ప్రజాధరణను అందుకున్న షోలలో జబర్ధస్త్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎన్నో సవాళ్ల నడుమ ప్రారంభం అయిన ఈ కామెడీ షోకు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. దీంతో ఈ షో నిర్వహకులు కూడా కొత్త కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తూ మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలా ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో వర్ష ఒకరు. కొంత కాలంగా జబర్ధస్త్‌లో తన మార్క్ చూపిస్తోన్న ఈ బ్యూటీని ఉద్దేశిస్తూ కమెడియన్ ఇమాన్యూయేల్ మదర్ ఊహించని కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్ హల్‌చల్ చేస్తున్న కొత్త జంట
జబర్ధస్త్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేర్లు చాలా తక్కువే. అందులో కమెడియన్ సుడిగాలి సుధీర్.. యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంటారు. దీనికి కారణం వీళ్లిద్దరూ జంటగా హల్‌చల్ చేస్తుండడమే. చాలా కాలంగా ఈ జోడీ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతోంది. వాళ్ల తర్వాత ఆ షో వల్ల వర్ష - ఇమాన్యూయేల్ జంట తెగ పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే.

కలర్‌ను కాదు.. మనసును చూడాలి
హైపర్ ఆది టీమ్ ద్వారా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకుంది వర్ష. అలాగే, 'పటాస్' అనే షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యూయేల్. వీళ్లిద్దరూ కలిసి చేసిన స్కిట్లు బాగా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే వర్ష.. ఇమాన్యూయేల్‌ను ప్రేమిస్తున్నట్లు 'కలర్‌ను కాదు.. మనసును చూడాలి' అంటూ డైలాగులు కూడా చెబుతోంది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ
కెవ్వు కార్తీక్ టీమ్‌లో స్కిట్ల కోసం ఇమాన్యూయేల్.. వర్షను జంటగా చూపిస్తున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరినీ హైలైట్ చేస్తున్నారు. ఇందుకోసం లవ్ ట్రాకును కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరచుకోవడంతో పాటు అప్పుడప్పుడూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. తద్వారా తరచూ ట్రెండ్ అవుతున్నారు.

ఈ జంటపై ప్రయోగాలు చేస్తున్నారుగా
ఎవరికైతే ఎక్కువ క్రేజ్ ఉంటుందో.. వాళ్లకే షో నిర్వహకుల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ ఉంటోంది. ఇందులో భాగంగానే అలాంటి జంటపై రొమాంటిక్‌గా తరచూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. ఇలా.. కొద్ది రోజులుగా జబర్ధస్త్‌తో వర్ష - ఇమాన్యూయేల్‌పై రొమాంటిక్ యాక్టులు ప్లే చేస్తున్నారు. వీళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు డ్యాన్సులు, ప్రపోజల్స్ పెడుతున్నారు.

షోలోకి ఇమాన్యూయేల్ ఫ్యామిలీ ఎంట్రీ
'శ్రీదేవి డ్రామా కంపెనీ' పేరుతో ఈటీవీలో మరో కామెడీ షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రది ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాన్ని మల్లెమాలనే రూపొందిస్తోంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ ఆదివారం స్పెషల్‌గా చేశారు. ఈ కార్యక్రమానికి జబర్ధస్త్ కమెడియన్ ఇమాన్యూయేల్ ఫ్యామిలీ వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కమెడియన్ మదర్ ఊహించని కామెంట్స్
'శ్రీదేవి డ్రామా కంపెనీ' వాలంటైన్స్‌డే స్పెషల్ ప్రోగ్రామ్‌లో ఇమాన్యూయేల్.. తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తన తల్లిదండ్రులు, సోదరుడి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అలాగే, అతడి మదర్, ఫాదర్ ఉద్వేగంగా మాట్లాడారు. తమను ఓ షోలోకి తీసుకొచ్చిన కొడుకుపై ప్రేమను కురిపించారు. అదే సమయంలో జబర్ధస్త్ బ్యూటీ వర్షపై ఇమాన్యూయేల్ మదర్ కామెంట్స్ చేశారు.
Recommended Video

షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన జబర్ధస్త్ బ్యూటీ
వర్షను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'నా కొడుకు వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. వాడు చాలా మంచి వాడు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు' అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో వెంటనే వర్ష ఆమె దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంది. అంతేకాదు, 'మీ కొడుకు బంగారం. నేనేమీ ఫీల్ అవను. అతడిని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.


Click it and Unblock the Notifications











