స్పెషల్ డే కోసం జబర్ధస్త్ కపుల్ రచ్చ: నేరుగా స్టేజ్‌ మీదకే తీసుకొచ్చి.. అందరి ముందే రొమాంటిక్‌గా!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే దానికీ దక్కని స్పందనను అందుకుంటూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న ఈ షో.. వారానికి రెండు రోజులు ప్రసారం అయినప్పటికీ ప్రేక్షకాదరణను అందుకుంటోంది. తద్వారా భారీ స్థాయిలో రేటింగ్ రాబడుతూ దూసుకుపోతోంది. ఇక, ఈ షో సక్సెస్‌కు చాలా కారణాలే ఉన్నప్పటికీ.. అందులో చూపించే లవ్ ట్రాకులూ ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల్లో రాబోతున్న స్పెషల్ డే కోసం రచ్చ రచ్చ చేసింది జబర్ధస్త్ జోడీ. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్‌కు పోటీనే లేదు.. సాటి రావేమీ

జబర్ధస్త్‌కు పోటీనే లేదు.. సాటి రావేమీ

జబర్ధస్త్ షో దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తోంది. ప్రారంభంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. ఆ తర్వాత రెండు రోజులకు పెరిగింది. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనలో మార్పు రాకపోగా, ఇంకా పెరిగింది. అదే సమయంలో ఎన్నో షోలు పుట్టుకొచ్చినా జబర్ధస్త్ జోరు ముందు నిలవలేకపోతున్నాయి. దీంతో ఇదే నెంబర్ వన్‌గా సాగుతోంది.

వాళ్లిద్దరినీ జంటగా మార్చింది ఈ షోనే

వాళ్లిద్దరినీ జంటగా మార్చింది ఈ షోనే

జబర్ధస్త్ కామెడీ షో ఎంతగానో ఆదరణను అందుకుంటోంది. అదే సమయంలో చాలా మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. మరికొందరినైతే బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అయితే, ఓ ఇద్దరిని మాత్రం జంటగా పాపులర్ చేసింది. వాళ్లే యాంకర్ రష్మీ గౌతమ్.. కమెడియన్ సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరూ ఈ కామెడీ షో కారణంగా ఫుల్ పాపులర్ అయ్యారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ జోడీ వల్ల షోకు ఎంతో ప్లస్ అయింది

ఆ జోడీ వల్ల షోకు ఎంతో ప్లస్ అయింది

రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మధ్య ప్రేమాయణం సాగుతోందన్న టాక్ ఎప్పుడో ప్రారంభం అయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ కూడా ప్రచారం అవుతూనే ఉంది. దీంతో ఈ జంట విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు జబర్ధస్త్ యూనిట్ వీళ్లపై తరచూ రొమాంటిక్ స్క్రిప్టులు ప్రయోగిస్తోంది. తద్వారా రేటింగ్ అందుకుంటోంది.

మరో ఇద్దరినీ హైలైట్ చేస్తున్న జబర్ధస్త్

మరో ఇద్దరినీ హైలైట్ చేస్తున్న జబర్ధస్త్

జబర్ధస్త్ జంట రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ తర్వాత ఆ షో వల్ల ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదించుకున్న వారిలో వర్ష.. ఇమాన్యూయేల్ జంట ఒకటి. హైపర్ ఆది టీమ్ మెంబర్‌గా షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కెవ్వు కార్తీక్ సహా ఎంతో మంది లీడర్ల కింద స్కిట్లు చేసింది. ఈ క్రమంలోనే ఇమాన్యూయేల్‌తో ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇస్తోంది.

రొమాన్స్‌తో రచ్చ.. కిస్సులు.. హగ్గులు

రొమాన్స్‌తో రచ్చ.. కిస్సులు.. హగ్గులు

కెవ్వు కార్తీక్ టీమ్‌లో స్కిట్ల కోసం ఇమాన్యూయేల్.. వర్షను జంటగా చూపిస్తున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరినీ హైలైట్ చేస్తున్నారు. ఇందుకోసం లవ్ ట్రాకును కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరచుకోవడంతో పాటు అప్పుడప్పుడూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. దీంతో తరచూ వార్తల్లో ఉంటున్నారు.

స్పెషల్ డే కోసం జబర్ధస్త్ కపుల్ రచ్చ

స్పెషల్ డే కోసం జబర్ధస్త్ కపుల్ రచ్చ

తరచూ ఏదో విధంగా హాట్ టాపిక్ అవుతోన్న ఇమాన్యూయేల్ - వర్ష జంట.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. దీనికి కారణం కొద్ది రోజుల్లో రాబోతున్న ప్రేమికుల రోజే. అవును దీని కోసం వీళ్లిద్దరూ జబర్ధస్త్ స్టేజ్‌పై రొమాంటిక్ చూపులతో మాయ చేశారు. జబర్ధస్త్ స్కిట్లలో చూపిస్తున్న దాని వల్ల వీళ్లను ప్రేమికులు అనుకుంటున్న విషయం తెలిసిందే. దీనికి మరోసారి బలాన్నిచ్చారు.

స్టేజ్‌ మీదకే తీసుకొచ్చి.. అందరి ముందే

స్టేజ్‌ మీదకే తీసుకొచ్చి.. అందరి ముందే

జబర్ధస్త్‌ స్కిట్ల గ్యాప్‌లో ఇమాన్యూయేల్.. రోజాతో 'మేడం.. వాలంటైన్స్ డే వస్తుంది కదా. మీరు పర్మీషన్ ఇస్తే వర్షకు ఓ సర్‌ప్రైజ్ ఇస్తా' అని అడిగాడు. దీనికి జడ్జ్ ఓకే చెప్పడంతో ఆమెను స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. అనంతరం మోకాళ్లపై కూర్చుని హార్ట్ షేప్‌లో ఉన్న బెలూన్‌తో పాటు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X